ఒక స్థిర ఆస్తి అనేది ఒక కదపబడలేని వస్తువు, దానిని ధ్వంసం చేయకుండా లేదా దానిని మార్చకుండా తరలించడం సాధ్యం కాని ఒక ఆస్తి అంశం. ఆ ఆస్తికి భూమికి జోడించబడి ఉంటుంది, ఉదాహరణకు కొంత భూమి లేదా ఒక ఇల్లు.

ప్రస్తుత పన్ను వ్యవస్థలో, ఒక స్థిర ఆస్తికి సంబంధించి అందించబడిన పన్ను పరిధిలోకి వచ్చే సేవలు సర్వీస్ టాక్స్ కు లోబడి ఉంటాయి.

సర్వీస్ టాక్స్ అనేది కేంద్రం ద్వారా విధించబడేది అయి ఉండడంతో, సేవ రాష్ట్రంలోపల లేదా మరొక రాష్ట్రానికి అందజేయబడిందా అనేదానితో సంబంధం లేకుండా వర్తింపజేయబడుతుంది.
ఒక స్థిర ఆస్తికి సంబంధించి సరఫరా చేయబడిన సేవల విషయంలో, సరఫరా స్థానం నిర్ధారించడానికి ప్రత్యేక నియమాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. సేవల సరఫరా స్థానం నిర్ధారించడానికి సాధారణ నియమాల ను ఈ నియమాలు అధిగమిస్తాయి.
ఒక స్థిర ఆస్తికి సంబంధించి అందించబడిన సేవల సరఫరా పద్రేశం అనేది స్థిర ఆస్తి ఉన్న లేదా ఉండటానికి ఉద్దేశించబడిన ఆ ప్రదేశం అయి ఉంటుంది.

Place of supply of services provided in relation to an immovable property will be the location at which the immovable property is located or intended to be located.Click To Tweetదీనికి నాలుగు దృష్టాంతాలు ఉండవచ్చు:

1. ఒక స్థిర ఆస్తికి సంబంధించి నేరుగా అందించబడిన సేవలు

ఇందులో కట్టడం విశేషజ్ఞులు (ఆర్కిటెక్టులు), లోపలి అలంకరణ చేసేవారు, సర్వేచేసేవారు, ఇంజనీర్లు, మొదలైనవారు అందించిన సేవలు ఉంటాయి

ఉదాహరణకు: సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ లో నమోదు చేయబడిన రాజ్ హోటల్స్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ లో ఒక హోటల్ నిర్మిస్తోంది. హోటల్ లోపలి అలంకరణ మొత్తం, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ తమ నమోదిత వ్యాపార ప్రాంతం అయి ఉన్న రవి ఇంటీరియర్స్, ద్వారా చేయబడుతోంది.

లోపలి అలంకరణ సేవ సరఫరా కోసం,
సరఫరాదారు స్థానం: డెహ్రాడూన్, ఉత్తరాఖండ్
ప్రదేశం: గ్రహీత అయిన రాజ్ హోటల్స్ యొక్క వ్యాపార నమోదిత ప్రదేశం సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ అయి ఉన్నప్పటికీ, సరఫరా స్థానం అనేది హోటల్ ప్రాంతం, అనగా డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ అయి ఉంటుంది
ఇది ఒక రాష్ట్రంలోపల సరఫరా మరియు వర్తించే పన్నులు ఏమిటంటే సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి
Place of Supply of Services_9

2. ఒక స్థిర ఆస్తిలో నివాస వసతి (లాడ్జింగ్)

ఇందులో ఒక హోటల్, సత్రం, గెస్ట్ హౌస్, హోం స్టే, క్లబ్, క్యాంప్ సైట్, హౌస్ బోట్ మొదలైన వాటి ద్వారా అందజేయబడే నివాస వసతి ఉంటుంది

ఉదాహరణకు: షిమ్లా, హిమాచల్ ప్రదేశ్ లోని రాజ్ హోటల్స్, ఒక అధికారిక సమావేశం కోసం జైపూర్, రాజస్థాన్ లో ఒక నమోదిత డీలర్ అయిన తారీక్ కు నివాస వసతి కల్పిస్తుంది.
సరఫరాదారు స్థానం: సిమ్లా, హిమాచల్ ప్రదేశ్
సరఫరా ప్రదేశం : సిమ్లా, హిమాచల్ ప్రదేశ్.
ఇది ఒక రాష్ట్రంలోపల సరఫరా మరియు వర్తించే పన్నులు ఏమిటంటే సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి

Place of Supply of Services_10

3. ఒక కార్యక్రమం నిర్వహించుకోవడం కోసం ఒక స్థిర ఆస్తిలోపల వసతి కల్పించడం

ఇందులో ఏదైనా అధికారిక, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన లేదా వ్యాపార కార్యక్రమం నిర్వహించడం కోసం వసతి కల్పించడం ఉంటుంది.
ఉదాహరణకు: గురుగ్రామ్, హర్యానాలో ఒక నమోదిత డీలర్ అయిన ముఖేష్ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒక అధికారిక సమావేశం నిమిత్తం 3 రోజుల కోసం హిమాచల్ ప్రదేశ్ లోని షిమ్లాలోగల, రాజ్ హోటల్స్ లోని కాన్ఫరెన్స్ హాల్ బుక్ చేస్తారు.
సరఫరాదారు స్థానం: సిమ్లా, హిమాచల్ ప్రదేశ్
సరఫరా ప్రదేశం : సిమ్లా, హిమాచల్ ప్రదేశ్.
ఇది ఒక రాష్ట్రంలోపల సరఫరా మరియు వర్తించే పన్నులు ఏమిటంటే సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి

Place of Supply of Services_11

4. పైన పేర్కొన్న సేవలకి అనుబంధంగా ఉండే ఏవైనా సేవలు

ఉదాహరణకు: ముఖేష్ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒక అధికారిక సమావేశం హిమాచల్ ప్రదేశ్ లోని షిమ్లాలోగల, రాజ్ హోటల్స్ లోని కాన్ఫరెన్స్ హాల్ బుక్ చేయడంతో పాటు తమ అతిధుల కోసం ఆహారం మరియు పానీయాలను కూడా ఆర్డర్ చేస్తారు.
సరఫరాదారు స్థానం: సిమ్లా, హిమాచల్ ప్రదేశ్
సరఫరా ప్రదేశం : సిమ్లా, హిమాచల్ ప్రదేశ్.
ఇది ఒక రాష్ట్రంలోపల సరఫరా మరియు వర్తించే పన్నులు ఏమిటంటే సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి

Place of Supply of Services_12

పైన చర్చించిన విధంగా, ప్రస్తుత వ్యవస్థలో, స్థిరాస్తులకు సంబంధించి అందజేయబడిన సేవల పై సర్వీస్ టాక్స్ విధించబడుతుంది. సర్వీస్ టాక్స్ అనేది కేంద్రం ద్వారా విధించబడేది కావడంతో, అది ఏ రాష్ట్రానికి సంబంధించినది అనేదానితో పనిలేకుండా, అందుకోబడిన సేవల పై ఇన్పుట్ క్రెడిట్ ని అందజేయబడిన సేవలపై బాధ్యతకు వ్యతిరేకంగా రద్దు (సెట్ ఆఫ్) చేయవచ్చు
పై ఉదాహరణ తీసుకుంటే, ప్రస్తుత వ్యవస్థలో, హర్యానాలోని ముఖేష్ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు హిమాచల్ ప్రదేశ్ లో హోటల్ ఛార్జిలపై చెల్లించిన పన్ను యొక్క ఇన్పుట్ క్రెడిట్ తీసుకోవచ్చు. అయితే, జిఎస్టి తరంలో, స్థిరాస్తులకు సంబంధించి అందజేయబడిన సేవల యొక్క సరఫరా స్థానం అనేది స్థిరాస్తి యొక్క స్థానం అయి ఉంటుంది. ఈ దృష్టాంతాలలో, వర్తించే పన్నులు సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి అయి ఉంటాయని ఇది సూచిస్తుంది.
ఒక రాష్ట్రం యొక్క సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి క్రెడిట్ మరొక రాష్ట్రం యొక్క బాధ్యత రద్దు (సెట్ అఫ్) చేసేందుకు ఉపయోగించడం వీలుకాదు అని గమనించండి. అటువంటి సందర్భంలో, ఒక నమోదిత వ్యక్తి వేరొక రాష్ట్రంలోని స్థిర ఆస్తి సేవలని అందుకున్నప్పుడు ఆ వ్యక్తి మరొక రాష్ట్రం నుండి తీసుకున్న సేవ పై ఇన్పుట్ క్రెడిట్ తీసుకోవడం వీలుకాదు. అందుకే, జిఎస్టి వ్యవస్థలో, హర్యానాలో నమోదు చేయబడిన ముఖేష్ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు, హిమాచల్ ప్రదేశ్ లో చెల్లించిన సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి ఇన్పుట్ క్రెడిట్ తీసుకోవడం వీలుకాదు.
క్రమంలో రానున్నవి: సంఘటనలకు సంబంధించి సేవల యొక్క సరఫరా ప్రదేశం

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

105,621 total views, 42 views today