ఇప్పటి నుండి కొద్ది వారాల్లోనే అతిపెద్ద పరోక్ష పన్ను పరివర్తన నిస్సందేహంగా మన మీదికి వచ్చేస్తుంది. తగిన శాసనాలు జారీచేయబడగలిగే విధంగా -దాని నిర్ణీత నిబంధనలు మరియు ఆకృతులపై చట్ట నిర్ణేతలు చర్చలు జరుపుతున్నారు.

ఇది మార్కెట్లో గొప్పగా సమతలంగా చేసేవాటిల్లో ఒకటై ఉంటుందని, మరియు వ్యాపారవేత్తకు భారతీయ మార్కెట్ ని తెరుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంటర్-స్టేట్ వర్తకం యొక్క అడ్డంకులు అదృశ్యమవుతాయి మరియు ప్రస్తుతం కన్నా ఎక్కువ మంది కస్టమర్లను మరియు సరఫరాదారులను కనుగొనగలుగుతారు. తక్కువ మంది ప్రజలు చట్ట నిబంధనలనుంచి అనుచిత ప్రయోజనాన్ని పొందగలుగుతారు లేదా పన్నులను ఎగవేయడం ద్వారా, అందువలన పోటీకి ఒక సమతల స్థాయి ఉండటం వలన మరిన్ని వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఒకే పన్ను వ్యవస్థలోకి పలు ప్రస్తుత పన్నులను సంగ్రహించడం వలన అనువర్తనకు పట్టే సమయం మరియు ఖర్చు తగ్గిపోతుంది.

ఇది నిజంగా వేడుకలకి సమయం. చిన్నతరహా వ్యాపారవేత్తకు తప్ప

It is indeed time for celebration. Except for the Small Businessman.Click To Tweet

మామూలుగా, చిన్న వ్యాపారాలు సాధారణంగా ‘మరింత నిజాయితీగా’ ఉంటాయి, మరియు సాధారణంగా ‘మరింత నగదు ప్రవాహ సమస్యలు’ ఎదుర్కుంటూ ఉంటాయి.
పెరిగిన సాపేక్ష నిజాయితీ అనేది సాంఘిక తలవంపులు కారణంగా ఉన్నప్పుడు, లేదా సమస్యలు గుర్తించబడినప్పుడు వాటిని ‘సెటిల్’ చేయగల సామర్ధ్యం లేకపోవడం, లేదా అవినీతిగా ఉండటం వలన ఉండే ప్రయోజనం ప్రలోభపరిచేటంతగా లేనప్పుడు, లేదా ప్రాథమిక నైతిక ఫైబర్ అనేది తగినంత ప్రలోభంతో పరీక్షించబడకుండా ఉండటం అనేది వాస్తవానికి ఒక చర్చనీయాంశం. ఏ ఇతర రుణ వ్యాపారంలో కంటే మైక్రో లెండింగ్ స్పేస్ అత్యధిక తిరిగి చెల్లించే నిష్పత్తులను చూస్తుందనే విషయం బాగా తెలుసినదే.

అదే సమయంలో, చిన్న వ్యాపారాలు తరచుగా నగదు ప్రవాహం అసమానతతో బాధపడుతూ ఉంటాయి. విక్రయించిన వస్తువుల కోసం డబ్బు అందుకోవడంలో మామూలు ఒక-వారం ఆలస్యం కూడా వారి నిత్యకృత్యాలు గాడి తప్పిపోయేలాగా చేస్తుంది. కుటుంబంలో ఒక వివాహమా? చక్రాల మరమ్మతుకు అనేక వారాలు పడుతుంది. ఒక లాభసాటి వేలం లేదా వారికి అధిక లాభదాయకతని ఇచ్చే వస్తువుల కోసం ఒక ఆఫర్, ఇక వాటి ప్రయోజనాన్ని పొందడానికి వాళ్ళు కొన్ని వారాలపాటు వారి నగదు చక్రాలని సర్దుబాటు చేసుకోవాలి. ఒక ఉద్యోగి కుటుంబంలో వివాహమా? సహాయం చేయాలి అనే వారి కోరిక వారి నగదు ప్రవాహ నిర్వహణ పై దెబ్బ తీస్తుంది.
జిఎస్టి కోసం వారి డ్రాఫ్ట్ మోడల్ చట్టంలో ప్రభుత్వం ద్వారా చేయబడిన ప్రస్తుత ప్రకటనలో నెమ్మదిగా, కానీ నిశ్చయంగా, దాదాపుగా ప్రతి చిన్న వ్యాపారాన్ని చివరకు మూతపడిపోయేలాగా చేసే కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం కాదు, ఇది కేవలం ఇతర మంచి ఉద్దేశ్యం యొక్క ఒక ఊహించని పర్యవసానమై ఉంది. ఇది సరిదిద్దబడతగినది కూడా, అయితే కారణాలు మరియు పరిణామాలు గుర్తించబడాలి.
‘ఒక నిర్దిష్ట విండోలోపల సరఫరాదారు పన్ను చెల్లించినట్లయితే మాత్రమే కొనుగోలుదారుకు అందుబాటులో ఉంటే ఇన్పుట్ పన్ను క్రెడిట్ సదుపాయం’ అనే నియమం, ఒక సహేతుకమైన శాతం చిన్న తరహా వ్యాపారాలు వారి జీవిత చక్రంలో ఎదుర్కొనే ఒక సమస్య. చాలామందికి (అందరూ కాకపోతే), ఎగవేత లేదా చెల్లించకుండా ఉండాలనే చెడు ‘ఉద్దేశ్యం’ ఉండదు. లేదా వారు ప్రభుత్వాన్ని మరీ తేలికగా కూడా తీసుకోరు. ఇతర అత్యవసరాల కారణంగా వారు కొన్నిసార్లు చెల్లింపును ఆలస్యం చేయవలసి ఉంటుంది అంతే- వాటిలో కొన్ని పైన వర్ణించాము. కొన్నిసార్లు, ‘నా కార్మికులకు సకాలంలో జీతం చెల్లింపు’ ‘మరియు’ ఆలస్యం చేయబడిన చెల్లింపు కోసం ప్రభుత్వానికి జరిమానా చెల్లింపు’ ల ఎంపిక అనేది వారు అందుకునే అంతరాత్మ ప్రేరణ., లేకపోతే వారు వారి ప్రజల్ని కోల్పోవచ్చు. కొన్నిసార్లు, వారి సరఫరాదారు చెల్లించవలసిన ఒత్తిడి తీవ్రతరమవుతుంది, లేకపోతే వారి పదార్ధాల చక్రం తెగిపోయి వారు శాశ్వతంగా వారి వినియోగదారుల వ్యాపారాన్ని కోల్పోవచ్చు – అందుకోసమనే మళ్ళా ‘ఆలస్యం చేయబడిన చెల్లింపుకు జరిమానా’ అనేది ఆమోదయోగ్యమవుతుంది. మరియు, చివరికి వాళ్ళు చెల్లిస్తారు.
ఒక సంబంధిత మరియు మరింత భయపెట్టే నియమం ఏమిటంటే, ప్రభుత్వం ఒక ‘ అనువర్తన రేటింగ్’ బహిరంగంగా వెల్లడి చేయాలని అనుకుంటోంది – అందుకని, మీ సరఫరాదారుకి ‘మంచి లేదా తక్కువరకం’ రేటింగ్ ఉన్నది అనే విషయం మీరు కొనుగోలు చేయడానికి ముందే మీకు తెలుస్తుంది. మీ ఇన్పుట్ పన్ను క్రెడిట్ అనేది సరఫరాదారు యొక్క ఈ ‘నాణ్యతపై’ ఆధారపడి ఉండటం వలన, మీరు ‘తక్కువ రకం’ రేటింగ్ గల ప్రజల నుండి కొనుగోలు చేయడాన్ని నివారించడానికి ప్రయత్నిస్తారు – అనగా, ఒక ‘తక్కువ రకం’ రేటింగ్ ని నివారించడానికి ప్రజలు వారికి సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తారు అనేది దీని ఉద్దేశ్యం .
మీరు మీ డేటాను ఫైల్ చేయడంలో ఆలస్యం అయినందువలన రేటింగ్ ‘తక్కువ రకం’ అవదు, కాని మీ చెల్లింపులో జాప్యాలు ఉండవచ్చుకాబట్టి అవుతుంది.
సారాంశం ఏమిటంటే, మీరు ఈ నిబంధనలను కలిపి తీసుకుంటే, చిన్న వ్యాపారం ఎదుర్కుని ఉండగల ఏ సమస్య అయినా, ఇప్పుడు ‘విశదమవుతుంది మరియు బహిరంగంగా’ వెల్లడై ఉంటుంది మరియు సంబంధించి ఒకదానితో ఒకటి ముడిపడి ఉండే (స్నోబాల్) ప్రభావాన్ని కలిగి ఉంటుంది.. కాబట్టి, మీరు ఒక సమస్యను ఎదుర్కొన్న క్షణం, మీ కొనుగోలుదారులు ‘సురక్షితంగా వ్యవహరించి’ ఇతరుల నుండి కొనుగోలు చేస్తారు కాబట్టి సమస్య వచ్చే నెలలో మరింతగా పెరుగుతుంది (మార్కెట్ ప్రస్తుతం ‘మరింత బహిరంగ మార్కెట్’ అయి ఉండటం అనేది ఇక్కడ ఒక వరం). మరింత చెల్లింపు ఆలస్యాలు మరియు/లేదా మీ రేటింగ్ మరింత క్రిందికి పడిపోవడానికి, మరింత మంది వినియోగదారులను కోల్పోవడానికి దారితీస్తూ – మీరు చివరికి మూతపడిపోయేటంత వరకు- ఇది మీ సమస్యను మరింత పెంచుతుంది.
చిన్న తరహా వ్యాపారాలకి ‘ఎట్టిపరిస్థితుల్లోనూ జిఎస్టికి చెల్లించడానికి మరియు చెడ్డ రేటింగ్ నివారించడానికి’అత్యవసర నిధుల’ అవసరం ఏర్పడటం అనేది అక్రమ వసూలు పరిస్థితులకు, మరియు వారు భరించలేని ఖర్చుల భారానికి దారి తీయబోతోంది. అసలే వారు కొలమానాల ఆర్థిక వ్యవస్థల ద్వారా ఖర్చులు నిర్వహించలేకుండా ఉన్నారు. ఇప్పుడు, జిఎస్టి వ్యవస్థలో కేవలం వారి ‘వ్యాపారాన్ని నిలిపిఉంచుకోవాలని’ ప్రయత్నించడం అనేది, ఇక నిషిధ్ధమే అవుతుంది.
మరి వైరుధ్యం ఏమిటంటే, జిఎస్టి అనేది అనువర్తన ఖర్చులని తగ్గిస్తుందని ఆశించబడింది! CLICK TO TWEET
తప్పుడు బిల్లులపై మోసపూరిత క్లెయిములకు ఇన్పుట్ క్రెడిట్ను తిరస్కరించే హక్కు నిస్సందేహంగా ప్రభుత్వానికి ఉంది. జిఎస్టిఎన్ తో వారి సరఫరాలను రిజిస్టర్ చేయవలసిన సరఫరాదారుల ప్రస్తుత నిబంధనలతో మరియు కేవలం ఇటువంటి ఇన్వాయిస్ల పై మాత్రమే ఇన్పుట్ క్రెడిట్ అందుబాటులో ఉండటంతో, ఇది ఇప్పటికే ఒక మూతబిగించబడిన సమస్య అయింది. వ్యాపారాలు అన్ని వారి ఇన్వాయిస్లని అప్లోడ్ చేసి ఉండాలని డిమాండ్ చేయడం అనేది పూర్తిగా, వారి బాధ్యతని స్టాపిస్తుంది, మరియు వారి చెల్లింపు (లేదా చెల్లింపును డిమాండ్/సేకరించడం కోసం ప్రభుత్వం యొక్క హక్కు) దాదాపుగా ఖచ్ఛితం అవుతుంది.
చట్టంలో ఇటువంటి నిర్వహించబడలేని నియమం ఉండటానికిగల ముఖ్య కారణం ఏమిటంటే, , ముఖ్యంగా సదరు వ్యాపారం చెల్లించలేక పోయినప్పుడు, వివిధ రాష్ట్రాలకు ఐజిఎస్టి పంపిణీలో సమస్య అని వదంతులు ప్రబలుతున్నాయి. దీనితో వ్యవహరించడానికి ప్రత్యామ్నాయ పద్ధతులు అన్ని ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి, కాని ప్రస్తుత ముసాయిదా చట్టం మాత్రం పై నిబంధనలను ప్రతిబింబించడం కొనసాగిస్తుంది – కానీ అనధికారిక భావన ఏమిటంటే ఈ సమస్య తరువాత పరిష్కారించబడగలదు అని, మరియు ప్రస్తుత ముసాయిదా చట్టం ఫ్రేంవర్క్ తో పాటుగా మొదటి అమలు జరుగుతుంది అని.
అయినప్పటికీ, ఇది తరువాత పరిష్కరించబడవలసిన సమస్య కాదు. తాత్కాలిక మరణం లాంటి విషయమంటూ ఏదీ ఉండదు. తగిన్ని చిన్న తరహా వ్యాపారాలు తప్పుగా “’వారితో వ్యవహరించే ప్రమాదం మనకెందుకులే’ అన్నటలుగా ‘బ్రాండ్’ చేయబడతాయి, మరియు తరువాత చట్టం మారినా కూడా అవి తిరిగి కోలుకోలేవు. అందుకు విరుధ్ధమైనది కావడం తధ్యం. ఈ నిబంధన లేకుండానే కూడా పన్నుల మోసం నాటకీయంగా తగ్గిపోతూ ఉండటం ప్రభుత్వం గమనించనట్లయితే, ‘నియంత్రించడానికి ఏకైక మార్గం’గా వారు దానిని ఎల్లప్పుడూ ప్రవేశపెట్టవచ్చు.
అభ్యర్థించబడుతున్న మార్పు ఏమిటంటే – ‘చెల్లుబాటు అయ్యే రిటర్న్’ స్టేట్మెంట్ కు ‘చెల్లింపు’ ని లింక్ చేయవద్దు. ఒక చెల్లుబాటు అయ్యే రిటర్న్ అనేది దాని కంప్యుటేషన్లో సరైనది, మరియు పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి యొక్క బాధ్యతను నిర్వచిస్తుంది. ఒక వినియోగదారుడు ‘ఇన్పుట్ క్రెడిట్’ క్లెయిమ్ చేయగల ఏకైక ఆధారంగా సరఫరాదారు యొక్క ‘చెల్లుబాటు అయ్యే రిటర్న్’ ఉండనివ్వండి (ఇది ఇప్పటికే ప్రస్తుత చట్టం యొక్క నియమం. అయితే బాధ్యతకు చెల్లింపు జరిగి ఉంటే మాత్రమే అది చట్టబద్ధమైనదిగా పరిగణించబడుతుంది.). ఈ సాధారణ మార్పు ఎలాగైనా వ్యాపారాల తాళాలు తెరుస్తుంది, అనువర్తనాన్ని మెరుగుపరుస్తుంది మరియు జిఎస్టి యొక్క త్రిభుజాకార స్వభావం కారణంగా నాటకీయంగా మోసం తగ్గించబడుతుంది.
పన్ను క్రెడిట్ కు చెల్లింపులను లింక్ చేయడం కేవలం ఒక ‘దోషం’ మాత్రమే కాదు, అది ఒక పెద్ద ‘వైపరీత్యం’ కూడా .CLICK TO TWEET
3 వ్యాపారాల ఒక సాధారణ గొలుసు తీసుకొని, కంపెనీ A 1 కోటి + 20 లక్షల జిఎస్టి (మొత్తం విలువ 1.2 కోట్ల) ఇన్వాయిస్ ని కంపెనీ B పై చేసిందనుకుందాం. కంపెనీ A 20 లక్షల పన్నును ప్రభుత్వానికి కూడా చెల్లింపు చేస్తుంది.
కంపెనీ B ఇప్పుడు 1.2 కోట్ లు+ 24 లక్షల జిఎస్టి (మొత్తం విలువ 1.44 కోటలు) కంపెనీ C పై చేసింది. కంపెనీ B ఇప్పుడు 24 లక్షలు చెల్లించి, 20 లక్షల క్రెడిట్ తీసుకునే బాధ్యత కలిగి ఉంటుంది, అందుకని ప్రభుత్వానికి 4 లక్షలు చెల్లించాల్సిన అవసరం ఉంది. . అయితే, కొన్ని సందర్భాల కారణంగా, ఇది చెల్లించడంలో విఫలమైంది.
కంపెనీ C ఇప్పుడు 1.5 కోట్లు + 30 లక్షల జిఎస్టి (మొత్తం విలువ 1.8 కోట్ల) ఇన్వాయిస్ చేస్తుంది – మరియు ఇది గొలుసుకు ముగింపు (అనగా, తుది వినియోగదారుకు విక్రయించబడింది) అని భావించండి.
కంపెనీ Cకి ,24 లక్షల ఇన్పుట్ క్రెడిట్ తీసుకున్న తర్వాత 30 లక్షలు- లేదా 6 లక్షల నికరం చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే, కంపెనీ B సమయానికి పన్ను చెల్లించలేని కారణంగా, ఈ ఇన్పుట్ పన్ను క్రెడిట్ తిరస్కరించబడింది మరియు కంపెనీ C పూర్తి 30 లక్షల చెల్లించాల్సి ఉంటుంది.
ఇప్పుడు, కంపెనీ B గనక పన్ను చెల్లించి ఉన్నట్లయితే, ప్రభుత్వం ద్వారా సేకరించబడిన మొత్తం పన్ను కంపెనీ A ద్వారా 20, కంపెనీ B ద్వారా 4 మరియు కంపెనీ C ద్వారా 6 – లేదా మొత్తం 30 లక్షలు అయి ఉంటుంది.
అయితే మరి, కంపెనీ B సకాలంలో చెల్లించడంలో విఫలమైనందున, ప్రభుత్వం వాస్తవానికి 50 లక్షలు సేకరించింది! కంపెనీ A ద్వారా 20, మరియు కంపెనీ C ద్వారా 30
అకస్మాత్తుగా, కంపెనీ B ద్వారా పన్ను చెల్లించకపోవడం అనేది రెవెన్యూ శాఖకు ఒక బోనస్ అయ్యింది!
అంతేకాక, కంపెనీ B స్వచ్ఛందంగా లేదా ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడిన రికవరీ చర్యల ద్వారాగాని, 4 లక్షల్లో భాగాన్ని చెల్లించే అవకాశం పూర్తిగా ఉంటుంది. దీనితో మొత్తం సేకరణలు 50 లక్షలు మించిపోతుంది!
చట్టం యొక్క ఈ విపరీత విధానం అంతర్గతంగా భరించతగనిది. అకస్మాత్తుగా, కంపెనీ B ద్వారా పన్ను చెల్లించకపోవడం అనేది (తప్పుగా అయినప్పటికీ) దేశం యొక్క ఆదాయం పెరుగుతుంది కాబట్టి దేశానికి ఎంతో మంచిదిగా కనిపిస్తుంది!.

And the paradox is, GST was expected to REDUCE compliance costs!Click To Tweet

చట్టం యొక్క ఉద్దేశ్యం ఖచ్చితంగా ఇది కాదు, లేదా ఇదిఒక చెల్లుబాటు అయ్యే ఫలితంగా పరిగణించబడదు.
పౌరులుగా, మనమందరమూ కూడా ప్రభుత్వానికి సృష్టించవలసిన అవసరంలేని సమస్యల్ని సృష్టించడం కంటే, ప్రభుత్వానికి సామర్ధ్యంగల ప్రయోజనాలను అందించే ఒక చట్టం రూపొందించడానికి సహాయపడటం అనేది ఎంతో ముఖ్యం.
ప్రస్తుత చట్టాలు ఇప్పటికే పన్ను ఎగవేతకు వ్యతిరేకంగా విపరీతమైన భద్రత మరియు రక్షణను అందిస్తున్నాయి మరియు కొన్ని చిన్న సాంకేతికతలు మాత్రమే (ఉదాహరణకు, ఐజిఎస్టి కోసం) పరిష్కరించాల్సిన అవసరం ఉంది – మరియు ఈ కృత్రిమ మరియు భరించలేని నిబంధనలు సరళమైన ‘జిఎస్టిఎన్ తో రిజిస్టర్ చేసుకోబడిన ఇన్వాయిస్ ల పై మాత్రమే ఇన్పుట్ టాక్స్ క్రెడిట్’ తో భర్తీ చేయబడవచ్చు. వాస్తవానికి ప్రస్తుత చట్టాలు ఇన్వాయిస్ ప్రస్తుతం రిజిస్టర్ చేయబడనప్పటికీ కూడా ‘తాత్కాలిక ఇన్పుట్ క్రెడిట్ అనుమతిస్తాయి’, మరియు ‘చెల్లింపు లింకేజ్’ తొలగించబడితే ఈ ‘లగ్జరీ’ కూడా వ్యాపారాలు సంతోషంగా వదులుకుంటాయి.
మనం దాని కింద నలిగిపోయేది కాకుండా మనమందరమూ చేతులుచాపి స్వాగతించే ఒక గొప్ప జి.టి.టి చట్టం కోసం ప్రార్థన చేద్దాం

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

109,924 total views, 5 views today