మా గత బ్లాగ్ లో సరుకు మరియు సేవల సరఫరా: దాని అర్ధం ఎమిటి అనేదానిలో మనం అమ్మకాలు, బదిలీలు, మరియు వ్యాపార చర్యలు వంటివాటి గురించి ఎక్కువగా ఉండే పరిగణనతో సరఫరా చర్చించాము.

ఈ బ్లాగ్ పోస్ట్ లో, మేము సరఫరాలో ఒక భాగం అయ్యే, మరియు పన్ను విధించబడగల అసాధారణ సందర్భాలను చర్చిద్దాం:

  • పరిగణ లేకుండా చేయబడిన సరఫరాలు
  • ఒక పరిగణన కోసం చేయబడిన సరఫరాలు, వ్యాపార కోర్సులో లేదా విస్తరణ కోసం అయినా కాకపోయినా

పరిగణ లేకుండా సరఫరా

GST supply without consideration

క్రింది కార్యకలాపాలు పరిగణ లేకుండా కూడా సరఫరాగా పరిగణించబడతాయి, మరియు పన్ను కోసం బాధ్యమై ఉంటాయి.

గమనిక: A కీ దృష్టాంతంలో ‘సంబంధిత వ్యక్తుల మధ్య లేదా ప్రత్యేకమైన వ్యక్తికి మధ్య పరిగణన లేకుండా సరకులు మరియు లేదా సేవల సరఫరా ‘, మా తదుపరి బ్లాగ్ పోస్ట్ లో సవివరంగా కవర్ చేయబడుతుంది.

1. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ వాడుకోబడిన వ్యాపార ఆస్తుల శాశ్వత బదిలీ / విక్రయం

వ్యాపార ఆస్తుల అంటే ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ వినియోగించుకోబడిన క్యాపిటల్ సరుకు – విక్రయం లేదా బదిలీ విషయంలో, వీటిని పరిగణ లేకుండా తొలగించడం లేదా బదిలీచేయడంగాని చేసినప్పటికీ , ఆ లావాదేవీని సరఫరాగా పరిగణించడం జరుగుతుంది మరియు వ్యాపారం జిఎస్టి చెల్లించవలసి బాధ్యత కలిగి ఉంటుంది.

ఉదాహరణ

సూపర్ కార్స్ లిమిటెడ్ రూ.3,00,000 విలువగల 15 కంప్యూటర్లు కొనుగోలు చేసారు మరియు రూ.54,000 జిఎస్టి ని చెల్లించారు. సూపర్ కార్స్ లిమిటెడ్ రూ.54,000 ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ వినియోగించుకున్నారు. ఈ కంప్యూటర్లు వ్యాపార రికార్డులు మరియు ఖాతాలని నిర్వహించడం కోసం ఉపయోగించారు.

సంవత్సరాల తరబడి వాడుకున్న తర్వాత, ఏ ఖర్చు లేకుండా ఉద్యోగులకు ఈ కంప్యూటర్లు ఇవ్వాలని సూపర్ కార్స్ లిమిటెడ్ నిర్ణయించుకున్నారు.

కంప్యూటర్లు ఏ పరిగణ లేకుండా తీసివేయబడినప్పటికీ, సూపర్ కార్స్ లిమిటెడ్ కు జిఎస్టి చెల్లించవలసిన బాధ్యత ఉంటుంది.
గమనిక: పూర్తి నియమాలు ఒకసారి అందుబాటులోకి వస్తే, అటువంటి సరఫరా యొక్క పన్నువిధించదగిన విలువకు ఎలాగ చేరుకోవాలి అనేదానిపై మరింత స్పష్టత అందుబాటులోకి వస్తుంది.

2. ప్రిన్సిపల్ మరియు అతని ఏజెంట్ మధ్య సరుకు సరఫరా

క్రింది పరిస్థితుల్లో సరుకు సరఫరా అనేది పరిగణ లేకుండా కూడా పన్ను పరిధిలోకి వచ్చే సరఫరాగా పరిగణించబడుతుంది.

  • తన ఏజెంట్ ద్వారా ప్రిన్సిపాల్ కు సరఫరా: ప్రిన్సిపాల్ తరపున ఏజెంట్ సరఫరా చేసేందుకు చేపట్టినప్పుడు
  • ఏజెంట్ ద్వారా ప్రిన్సిపల్ కు సరఫరా: ప్రిన్సిపాల్ తరపున అటువంటి వస్తువులు స్వీకరించడాన్ని ఏజెంట్ చేపట్టినప్పుడు

ఉదాహరణ

సూపర్ కార్ లిమిటెడ్ ఒక ప్రతినిధిగా శర్మ ఏజెన్సీని నియమిస్తుంది. వారు సూపర్ కార్స్ లిమిటెడ్ ద్వారా సరఫరా చేయబడిన విడిభాగాలను నిల్వ చేస్తారు, మరియు అతని డీలర్స్ నుండి సూపర్ కార్స్ లిమిటెడ్ కు ఒక ఆర్డర్ అందగానే, సరుకు సరఫరా చేయవలసిందిగా శర్మ ఏజెన్సీకి సూచనల పంపబడతాయి.
అలాగే, సూపర్ కార్స్ లిమిటెడ్ తరపున తయారీదారులు నుండి ముడి పదార్థం సరఫరా అందుకోవడం శర్మ ఏజెన్సీ కి అప్పగించబడింది
ఉదాహరణ ప్రకారం,

 • సూపర్ కార్స్ లిమిటెడ్ ప్రిన్సిపల్ ఇంకా శర్మ ఏజెన్సీ వారికి ఏజెంట్.
 • సూపర్ కార్స్ లిమిటెడ్ ద్వారా శర్మ ఏజెన్సీకి విడిభాగాల సరఫరా అనేది పన్ను విధించబడవలసిన సరఫరా
 • సూపర్ కార్స్ లిమిటెడ్ తరఫున శర్మ ఏజెన్సీ ద్వారా ముడి పదార్థం అందుకోబడటం మరియు శర్మ ఏజెన్సీ ద్వారా సూపర్ కార్స్ లిమిటెడ్ కు తదుపరి సరఫరా అనేది పన్ను విధించబడవలసిన సరఫరా

పై దాని బాధ్యత సూపర్ కార్స్ లిమిటెడ్ మరియు శర్మ ఏజెన్సీల ద్వారా సంయుక్తంగా పంచుకోబడటం లేదా వ్యక్తిగతంగా వారిద్దరిలో ఎవరిద్వారానైనా భరించబడటంగాని జరుగుతుంది.

గమనిక: ఒకసారి పూర్తి నియమాలు ప్రకటించబడితే, పన్ను చెల్లించవలసిన బాధ్యత పై మరింత స్పష్టత అందుబాటులో ఉంటుంది.
.

3. వ్యాపారం కోర్సులో లేదా విస్తరణ కోసం ఒక సంబంధిత వ్యక్తి నుండి లేదా భారతదేశం వెలుపల అతని ఇతర సంస్థలు వేటినుండైనా ఒక పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి ద్వారా సేవల దిగుమతి.

అవి వ్యాపారం కోర్సులో లేదా విస్తరణ కోసం అయి ఉంటే మాత్రమే భారతదేశం వెలుపల ఉన్న సంబంధిత వ్యక్తుల నుంచి పరిగణ లేకుండా దిగుమతి చేసుకోబడిన సేవలు జీఎస్టీ విధించబడటానికి లోబడి ఉంటాయి అని ఇది సూచిస్తుంది.
ఉదాహరణ 1

సింగపూర్ లో ఉన్న తమ ప్రధాన కార్యాలయం నుండి వారి యొక్క ఒక శాఖ అందుకున్న ఇంటీరియర్ డిజైన్ సేవ. ఇంటీరియర్ డిజైన్ పన్ను విధించబడతగినది మరియు రివర్స్ ఛార్జి పై జిఎస్టి కట్టవలసిన బాధ్యత కలిగి ఉంటుంది.
అందువల్ల, వ్యాపార విస్తరణ కోసం సంబంధంలేని వ్యక్తులు నుండి పరిగణ లేకుండా దిగుమతి చేసుకోబడిన సేవ, మరియు వ్యక్తిగత ఉపయోగం పరిగణ లేకుండా దిగుమతి చేసుకోబడిన సేవ అనేవి సరఫరా కావు, మరియు పర్యవసానంగా, జిఎస్టి పరిధిలోకి రావు.

ఉదాహరణ 2

సింగపూర్ లో ఉన్న తమ ప్రధాన కార్యాలయం నుండి ఏ పరిగణన లేకుండా వ్యక్తిగత నివాసం కోసం ఇంటీరియర్ డిజైన్ సేవ.. సేవ ఉచితం మరియు వ్యక్తిగత ఉపయోగం కోసం కనుక, ఇది జిఎస్టి పరిధిలోకి రాదు.
.

వ్యాపరం కోర్సులో లేదా విస్తరణ కోసం అయినా కాకపోయినా ఒక పరిగణన కోసం చేయబడిన సరఫరాలు.

GST supply whether or not in the course or for furtherance of business

వ్యాపరం కోర్సులో లేదా విస్తరణ కోసం అయినా కాకపోయినా ఒక పరిగణన కోసం చేసుకోబడిన సేవ యొక్క దిగుమతిని పన్ను పరిధిలోకి వచ్చే సరఫరాగా పరిగణిస్తారు. దీని అర్ధం ఏమిటంటే వ్యాపార ప్రయోజనం కోసం లేదా వ్యక్తిగత ఉపయోగం కోసం గాని, సేవలు గనక ఒక పరిగణన కోసం దిగుమతి చేసుకోబడి ఉంటే, మీరు జిఎస్టి చెల్లించవలసిన బాధ్యత ఉంటుంది అని.

ఉదాహరణ

సూపర్ కార్స్ లిమిటెడ్ ఎస్జిడి (సింగపూర్ డాలర్లు) 20,000 ఒక పరిగణన కోసం సింగపూర్ లోని ఒక విక్రేత నుండి నావిగేషన్ డిజైన్ సేవలు దిగుమతి చేసుకున్నారు.
ఇప్పుడు, సూపర్ కార్స్ లిమిటెడ్ వారు రివర్స్ ఛార్జ్ పై పైన పేర్కొన్న సేవ దిగుమతిపై జిఎస్టి చెల్లింపుకు బాధ్యులు.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

84,399 total views, 240 views today

Yarab A

Author: Yarab A

Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.