పన్ను రిఫండ్ అనేది పన్ను శాఖ నుండి పన్ను చెల్లింపుదారుడికి తిరిగి చెల్లించబడవలసిన లేదా తిరిగి చెల్లించదగిన ఏదైనా మొత్తాన్ని సూచిస్తుంది. ఒక రిఫండ్ అనుమతించబడే ప్రత్యేక సందర్భాలున్నాయి మరియు ఎక్కువ పన్నుల చెల్లింపు, అవుట్పుట్ సరఫరా ఎగుమతులు కావడం వలన వినియోగించుకోబడని ఇన్పుట్ పన్ను క్రెడిట్, అవుట్పుట్లపై పన్ను కంటే ఇన్పుట్ల పై పన్ను రేటు అధికంగా ఉండటం (విలోమ సుంకం నిర్మాణం), మొదలైన సందర్భాల్లో మాత్రమే డీలర్లు పన్ను రిఫండ్ క్లెయిమ్ చేయగలరు.

ముందుగా మనం ప్రస్తుత వ్యవస్థలో పన్ను రిఫండ్ అనుమతించబడే సందర్భాలని క్లుప్తంగా చూద్దాం.

ప్రస్తుత వ్యవస్థ

ప్రస్తుత పన్ను వ్యవస్థలో, క్రింది సందర్భాల్లో రిఫండ్ అనుమతించబడుతుంది:

ఎక్సైజ్

ఈ సందర్భాల్లో రిఫండ్ అనుమతించబడుతుంది:
1. ఎగుమతి చేయబడిన వస్తువుల కొనుగోలుపై లేదా ఎగుమతి చేసిన వస్తువుల తయారీకి ఉపయోగించబడిన ఇన్పుట్లపై చెల్లించబడిన పన్ను
2. అవుట్పుట్ సరఫరాలు ఎగుమతులు మాత్రమే లేదా సున్నా రేట్ సరఫరాలు అయి ఉండటం వలన పోగుపడిన ఇన్పుట్ పన్ను క్రెడిట్

వాట్ (VAT)
ఈ సందర్భాల్లో రిఫండ్ అనుమతించబడుతుంది:
1. ఎగుమతి చేసిన వస్తువుల కొనుగోలుకు చెల్లించబడిన వేట్
2. అధిక ఇన్పుట్ పన్ను క్రెడిట్ – చాలా రాష్ట్రాల్లో, ఒక నెలలో అమ్మకాలపై చెల్లించదగిన పన్నుని గనక ఇన్పుట్ పన్ను క్రెడిట్ మించినట్లయితే, అదనపు క్రెడిట్ ఆర్ధిక సంవత్సరం చివరి వరకు ముందుకు తీసుకుని పోబడుతుంది. ఆర్థిక సంవత్సరం చివరలో, మొత్తాన్ని రిఫండ్ గా క్లెయిమ్ చేయడానికి లేదా ఇన్పుట్ పన్ను క్రెడిట్ను ముందుకు తీసుకువెళ్లడానికి డీలర్ కు ఒక ఎంపిక ఉంటుంది

సర్వీస్ టాక్స్

ఈ సందర్భాల్లో రిఫండ్ అనుమతించబడుతుంది:
1. అధిక చెల్లింపును భవిష్యత్ పన్ను బాధ్యతకు వ్యతిరేకంగా సర్దుబాటు చేయలేని చోట అధికంగా చెల్లించబడిన సర్వీస్ టాక్స్
2. సర్వీస్ టాక్స్ చెల్లించకుండా ఎగుమతి చేయబడిన ఒక అవుట్పుట్ సేవను అందించడంలో పేరుకున్న ఇన్పుట్ పన్ను క్రెడిట్ వినియోగించుకోబడిన సందర్భంలో
మనం ఇప్పుడు జిఎస్టి కింద పన్ను రిఫండ్ అర్థం చేసుకుందాం.

జిఎస్టి వ్యవస్థ

జిఎస్టి వ్యవస్థలో, పన్ను రిఫండ్ అనుమతించబడే సందర్భాలు ప్రస్తుత వ్యవస్థలో ఉన్నట్లుగానే ఉంటాయి. జిఎస్టి కింద రీఫండ్ అనుమతించబడే అత్యంత సాధారణ సందర్భాలు క్రింది విధంగా ఉంటాయి:
• ఎగుమతి చేయబడిన వస్తువులు మరియు / లేదా సేవల లోపలికి సరఫరాపై లేదా ఎగుమతి చేయబడిన వస్తువులు మరియు/లేదా సేవల్లో ఉపయోగించిన ఇన్పుట్లు లేదా ఇన్పుట్ సేవలపై చెల్లించబడిన పన్ను. వస్తువులు గనక ఎగుమతికి సుంకానికి లోనైనట్లయితే, రిఫండ్ అనుమతించబడదని గమనించండి.
• అవుట్పుట్ సరఫరాలు ఎగుమతులు మాత్రమే లేదా సున్నా రేట్ చేయబడిన సరఫరాలు అయి ఉండటం వలన వినియోగించుకోకుండా ఉండిపోయిన ఇన్పుట్ పన్ను క్రెడిట్
• విలోమ సుంకం నిర్మాణం కారణంగా వినియోగించుకోకుండా ఉండిపోయిన ఇన్పుట్ పన్ను క్రెడిట్. అవుట్పుట్లపై పన్ను కంటే ఇన్పుట్ల పై పన్ను రేటు అధికంగా ఉన్నప్పుడు ఇది కలుగుతుంది.
ప్రస్తుత పన్ను వ్యవస్థలో, రిఫండ్ కోసం ఇది అనుమతించబడదు. అయితే, జిఎస్టి వ్యవస్థలో, ఈ దృష్టాంతం పన్ను రిఫండ్ క్లెయిమ్ కు అర్హత కలిగి ఉంటుంది. ఈ సందర్భంలో, సరఫరాలు శూన్య (NIL) రేట్ కలిగిఉన్నా లేదా పూర్తిగా మినహాయింపు ఉన్నా రిఫండ్ వర్తించదని గమనించండి

జిఎస్టి రిఫండ్ క్లెయిమ్ చేయడానికి ప్రక్రియ

1. రిఫండ్ కోసం దరఖాస్తు

పన్ను లేదా వడ్డీ లేదా చెల్లించిన ఏదైనా ఇతర మొత్తం రిఫండ్ కోసం క్లెయిమ్ చేస్తున్న వ్యక్తి, ‘సంబంధిత తేది’ నుండి 2 సంవత్సరాల గడువు తీరక ముందే తప్పనిసరిగా ఫారం జిఎస్టి ఆర్ఎఫ్ డి-1 లో రిఫండ్ కోసం దరఖాస్తు దాఖలు చేయాలి.
ప్రతి రిఫండ్ దృష్టాంతంలో ‘సంబంధిత తేదీ’ క్రింద ఇవ్వబడింది:

దృష్టాంతం సంబంధిత తేది
సముద్రం లేదా వాయుమార్గాన ఎగుమతి చేయబడిన వస్తువులు వస్తువులని లోడ్ చేసిన నౌక లేదా విమానం భారతదేశాన్ని వదిలి బయలుదేరే తేదీ
భూమార్గాన ఎగుమతి చేయబడిన వస్తువులు వస్తువులు సరిహద్దుని దాటే తేది
తపాలా మార్గాన ఎగుమతి చేయబడిన వస్తువులు సంబంధిత పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తువులు పంపబడే తేదీ
చెల్లింపు అందుకోవడానికి పూర్వమే సేవల సరఫరా పూర్తిఅయిన చోట ఎగుమతి చేయబడిన సేవలు. చెల్లింపు అందుకున్న తేది
ఇన్వాయిస్ జారీ చేసే తేదీకి పూర్వమే, ముందుగానే చెల్లింపుని అందుకున్న చోట, ఎగుమతి చేయబడిన సేవలు. ఇన్వాయిస్ జారీ చేసిన తేది
వినియోగించుకోబడని ఇన్పుట్ పన్ను క్రెడిట్ పన్ను రిఫండ్ కోసం క్లెయిమ్ తలెత్తే ఆర్థిక సంవత్సరం ముగింపు

గమనిక: ఎలక్ట్రానిక్ నగదు లెడ్జర్లో బ్యాలెన్స్ రిఫండ్ కోసం ఒక క్లెయిమ్ సంబంధిత నెలసరి రిటర్న్ ద్వారా చేయవలసి ఉంటుంది, అనగా, ఒక సాధారణ డీలర్ విషయంలో ఫారం జిఎస్టిఆర్-3, మరియు ఒక కాంపొజిట్ డీలర్ విషయంలో ఫారం జిఎస్టిఆర్-4.

జిఎస్టి క్రింద రిఫండ్ క్లెయిమ్ చేసేందుకు అవసరమైన పత్రాలు

పన్ను రిఫండ్ గా క్లెయిమ్ చేయబడిన మొత్తం గనక రు. 5 లక్షల కంటే తక్కువైతే – రిఫండ్ గా క్లెయిమ్ చేయబడుతున్న పన్ను లేదా వడ్డీ సంభవించడం అనేది మరొక వ్యక్తికి పాస్ చేయబడలేదని ధృవీకరిస్తూ తన వద్ద అందుబాటులో ఉన్న పత్రాలు లేదా ఇతర సాక్ష్యం ఆధారంగా ఆ వ్యక్తి ఒక డిక్లరేషన్ ఫైల్ చేయవలసి ఉంటుంది.
రిఫండ్ గా క్లెయిమ్ చేయబడిన మొత్తం గనక రు. 5 లక్షల కంటే ఎక్కువైతే- రిఫండ్ కోసం దరఖాస్తు వీటిని కలిగి ఉండాలి:
రిఫండ్ గా క్లెయిమ్ చేయబడిన మొత్తం గనక రు. 5 లక్షల కంటే ఎక్కువైతే- రిఫండ్ కోసం దరఖాస్తు వీటిని కలిగి ఉండాలి:

2. రిఫండ్ కోసం ఉత్తరువు

ఎగుమతి కారణంగా రిఫండ్
రిఫండ్ గనక వస్తువుల మరియు/లేదా సేవల ఎగుమతి కారణంగా అయిఉంటే, లపై వాపసు చెల్లించినట్లయితే, అధీకృత అధికారి తాత్కాలిక ప్రాతిపదికన ఫారం జిఎస్టి ఆర్ఎఫ్ డి-4 లో క్లెయిమ్ చేయబడిన మొత్తం యొక్క 90% ను రిఫండ్ చేస్తారు. ఆ తరువాత, సమర్పించబడిన పత్రాలను తగువిధంగా తనిఖీ చేసిన తర్వాత, క్లెయిమ్ యొక్క తుది సెటిల్మెంట్ కోసం అధికారి ఒక ఉత్తర్వును జారీ చేస్తారు.
తాత్కాలిక రిఫండ్ అనేది క్రింది షరతులకు లోబడి ఉంటుంది:
• రిఫండ్ క్లెయిమ్ చేస్తున్న వ్యక్తి పై, అంతకుముందు 5 సంవత్సరాలలో రూ. 250 లక్షలకు మించిన మొత్తం పన్నుఎగవేత కోసం చట్టపరమైన చర్య తీసుకోబడి ఉండకూడదు
• వ్యక్తి యొక్క సమ్మతి రేటింగ్ ఒక 10 ఉండే స్కేలుపై ఆ వ్యక్తి యొక్క జిఎస్టి అనువర్తనం రేటింగ్ 5 కంటే తక్కువ కాకుండా ఉండాలి.
• రిఫండ్ కు సంబంధించి పెండింగ్లో ఉన్న ఏ అప్పీల్, సమీక్ష లేదా రివిజన్ ఉండకూడదు.

నా కేసులో రిఫండ్
రిఫండ్ గా క్లెయిమ్ చేయబడిన మొత్తం లేదా భాగం తిరిగిచెల్లించదగినది అని గనక అధికారి సంతృప్తి చెందినట్లయితే, అతను ఫారం జిఎస్టి ఆర్ఎఫ్ డి-5 లో రిఫండ్ కోసం ఒక ఉత్తర్వు జారీ చేస్తారు. ఇది దరఖాస్తు అందుకున్న తేదీ నుండి 60 రోజులలోపు చేయబడుతుంది. రిఫండ్ గనక 60 రోజుల్లో మంజూరు చేయబడకపోతే, 60 రోజుల గడువు ముగిసిన తర్వాత నుంచి వాస్తవంగా పన్ను రిఫండ్ తేది వరకు వ్యవధి కోసం రిఫండ్ మొత్తం పై వడ్డీ చెల్లించబడుతుంది.

గమనిక: రిఫండ్ గా క్లెయిమ్ చేయబడిన మొత్తం గనక రు. 1,000 కంటే తక్కువ అయినట్లయితే, ఏ రిఫండ్ చెల్లించబడదు.

జిఎస్టి రిఫండ్ కోసం అనూహ్యమైన దృష్టాంతాలు

జిఎస్టి కింద రిఫండ్ అనుమతించబడే కొన్ని అసాధారణ పరిస్థితులు ఇవి:
1. ఎగుమతి చేయబడినట్లుగా భావించబడే వస్తువుల సరఫరాపై పన్ను. ఉదాహరణకు: ఒక సెజ్ (ప్రత్యేక ఆర్థిక మండలం) లేదా ఇఒయు (ఎగుమతి ఓరియంటెడ్ యూనిట్) కు వస్తువుల లేదా సేవల సరఫరా.
2. ఒక తీర్పు, డిక్రీ, ఉత్తర్వు లేదా ఒక అప్పీలేట్ అథారిటీ, అప్పిలేట్ ట్రిబ్యునల్ లేదా ఏదైనా కోర్టు యొక్క నిర్దేశం పరిణామంగా పన్ను రిఫండ్ చేయదగినదై ఉంటుంది.
3. పూర్తిగా లేదా పాక్షికంగా అందజేయబడని, మరియు ఒక ఇన్వాయిస్ జారీ చేయబడని ఒక సరఫరాపై పన్ను చెల్లించబడింది. ఉదాహరణకు: 20 డిసెంబర్ 17 న చేయవలసిన, కాని చివరికి ఒక భిన్నాభిప్రాయం కారణంగా జరగని సరఫరా కోసం 28 నవంబర్ 17 న గ్రహీత నుండి ఒక సరఫరాదారు ముందుగానే చెల్లింపు పుచ్చుకున్నారు. నవంబర్ 17 కి రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు అందుకున్న ముందస్తు చెల్లింపు పై పన్నుని సరఫరాదారు చెల్లించాలి. ఈ పన్ను రిఫండ్ కోసం అర్హత కలిగి ఉంటుంది.
4. తప్పుగా వసూలు చేయబడి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వంతో జమా చేయబడిన పన్ను- ఒక అంతరాష్ట్ర సరఫరాలో ఒక వ్యక్తి గనక సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి చెల్లించినట్లయితే, లేదా రాష్ట్రం లోపల సరఫరా పై ఐజిఎస్టి చెల్లించినట్లయితే, ఒకసారి ఆ పన్ను సరిగ్గా చెల్లింపు చేయబడిన తర్వాత ఆ మొత్తం రిఫండ్ కు ఆ వ్యక్తి అర్హత కలిగి ఉంటారు.
5. వస్తువులు గనక భారతదేశం బయటికి తీసుకుని వెళ్ళడం జరిగితే, భారతదేశం బయటికి ప్రయాణించే పర్యాటకులకు వస్తువుల సరఫరా పై చెల్లించబడిన ఐజిఎస్టి,.
ఈ దృష్టాంతాలలో రిఫండ్ యొక్క ‘సంబంధిత తేదీ’ క్రింద ఇవ్వబడింది:

దృష్టాంతం సంబంధిత తేది
ఎగుమతి చేయబడినట్లుగా భావించబడే వస్తువులు భావించబడిన ఎగుమతులకు సంబంధించి రిటర్న్ ఫైల్ చేయబడిన తేది
ఒక తీర్పు, డిక్రీ, ఉత్తర్వు లేదా ఒక అప్పీలేట్ అథారిటీ, అప్పిలేట్ ట్రిబ్యునల్ లేదా ఏదైనా కోర్టు యొక్క నిర్దేశం పరిణామంగా రిఫండ్ చేయదగినదైన పన్ను తీర్పు, డిక్రీ, ఉత్తర్వు లేదా నిర్దేశం తేది
తాత్కాలికంగా చెల్లించబడిన పన్ను తుది అంచనా తర్వాత పన్ను సవరణ తేది
సరఫరాదారు కాకుండా వేరెవరైనా వ్యక్తి అయిన సందర్భంలో ఆ వ్యక్తి వస్తువులని లేదా సేవలని అందుకున్న తేది
ఏదైనా ఇతర కేసు పన్ను చెల్లింపు తేది

ఈ అసాధారణ పరిస్థితులలో రిఫండ్ కోసం క్లెయిమ్ చేసే ప్రక్రియ పైన రిఫండ్ క్లెయిమ్ చేసేందుకు ప్రక్రియ విభాగంలో చర్చించిన విధంగా అలాగే ఉంటుంది.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

135,763 total views, 324 views today