పాయింట్ ఆఫ్ టాక్సేషన్ (పీఓటీ) పన్ను చెల్లించాల్సిన సమయ బిందువుని సూచిస్తుంది. పన్ను బాధ్యత ఉత్పన్నమయ్యే సమయం బిందువుని నిర్ణయించడానికి ఉపయోగించే ఒక యంత్రాంగం ఇది.
ప్రస్తుత పరోక్ష పన్ను వ్యవస్థలో, ప్రతి పన్ను రకానికి పన్ను విధింపు బిందువు భిన్నంగా ఉంటుంది.

దృష్టాంతం పన్ను రకం పన్ను విధింపు బిందువు
వస్తువుల తయారీ సెంట్రల్ ఎక్సైజ్భారతదేశంలో వస్తువుల తయారీపై ఎక్సైజ్ సుంకం సంభవించడం ఉత్పన్నమవుతుంది, మరియు ఎక్సైజ్ యూనిట్ నుండి ఎక్సైజ్ విధించబడగల వస్తువుల తొలగింపు సమయంలో ఎక్సైజ్ సుంకం చెల్లించవలసిన బాధ్యత పుడుతుంది. ఉదాహరణకు, 28 ఏప్రిల్, 2016 న తయారైన వస్తువులు, మరియు 5 మే 2016 నాడు అమ్మకం కోసం ఎక్సైజ్ యూనిట్ నుండి తొలగించబడతాయి. ఎక్సైజ్ యొక్క బాధ్యత 5 మే 2016 న ఉద్భవిస్తుంది.
సేవలు అందించడం సర్వీస్ పన్నుస్థూలంగా, పన్ను చెల్లించవలసిన సమయం (ఎ) చెల్లింపు అందుకున్న తేదీ లేదా (బి) ఇన్వాయిస్ జారీచేసిన తేదీల్లో ముందుగా ఏది వస్తే అది అయి ఉంటుంది.
వస్తువుల అమ్మకం
వాట్/సిఎస్టి (VAT/CST)రాష్ట్రంలోపల మరియు అంతరాష్ట్ర లావాదేవీలపై వాట్/సిఎస్టి, సందర్భానుసారంగా, వస్తువుల విక్రయాలపై ఉద్భవిస్తుంది.

జిఎస్టి కింద, పన్ను పరిధిలోకి వచ్చే సంఘటన అనేది వస్తువుల మరియు సేవల యొక్క ‘సరఫరా’. వస్తువుల లేదా సేవల సరఫరా చేయబడిన సమయపు బిందువు అనేది ‘సరఫరా సమయం (టైమ్ ఆఫ్ సప్లై)’ నిబంధనల ప్రకారం నిర్ణయించబడుతుంది.

ఇది కూడా చదవండి

వస్తువుల మరియు సేవల సరఫరా: దాని అర్థం ఏమిటి?

ఈ బ్లాగ్లో, వస్తువులకు సరఫరా సమయం గురించి మనం చర్చించుకుందాం.

మెరుగైన అవగాహన కోసం, మనం వస్తువుల కోసం సరఫరా సమయాన్నిఈ విధంగా విభజించుకుందాం:

      • వస్తువుల సరఫరాపై ఫార్వర్డ్ ఛార్జ్

 

    • వస్తువుల సరఫరాపై రివర్స్ ఛార్జ్

వస్తువుల సరఫరాపై ఫార్వర్డ్ ఛార్జ్

ఫార్వర్డ్ ఛార్జ్ అనేది సరఫరాదారు పన్నును విధించి మరియు దానిని కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వానికి క్రెడిట్ చేయవలసిన ఒక యంత్రాంగం. ప్రస్తుత పన్ను వ్యవస్థలో, ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం (డైరెక్ట్ ఛార్జ్ అని కూడా పిలుస్తారు) ఉపయోగించి అనేక లావాదేవీలపై పన్ను విధించబడుతుంది మరియు సేకరించబడుతుంది.

Forward Charge (also called direct charge) is a mechanism in which the supplier has to levy tax and remit the same to the credit of the Central or State Government. Click To Tweet

ఉదాహరణకు, సూపర్ కార్స్ లిమిటెడ్ రవీంద్ర ఆటోమొబైల్స్ కు రూ .1,00,000 / – విలువగల విడిభాగాలను అమ్మింది మరియు 14.5% రేట్ చొప్పున రూ .14,500 వాట్ సేకరించింది.

సూపర్ కార్స్ లిమిటెడ్ ద్వారా సేకరించబడిన వేట్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం క్రింద ఉంటుంది.

జిఎస్టి కింద ఫార్వర్డ్ ఛార్జ్ పై ‘వస్తువుల సరఫరా సమయం’ మనం అర్థం చేసుకుందాం

జిఎస్టి (సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి లేదా ఐజిఎస్టి, వర్తించే విధంగా) యొక్క బాధ్యత క్రింద చూపిన విధంగా ఉత్పన్నమవుతుంది:

క్రింది వాటిల్లో అన్నింటి కంటే ముందు వచ్చేది

ఇన్వాయిస్ తేది

సరఫరాదారు ఇన్వాయిస్ జారీ చేసిన తేది..

ఇన్వాయిస్ జారీ చేసేందుకు గడువుతేది

వస్తువుల సరఫరాకు సంబంధించి సరఫరాదారు ఇన్వాయిస్ జారీ చేయవలసిన ఆఖరి తేది. వస్తువుల తరలింపుకి సంబంధించిన వస్తువుల సరఫరా విషయంలో, తొలగింపు సమయంలో ఇన్వాయిస్ జారీ చేయాలి. ఇతర సందర్భాల్లో, గ్రహీతకు వస్తువుల పంపిణీ సమయంలో.

చెల్లింపు అందుకోవడం

చెల్లింపు అందుకున్న తేదీ. ఈ కేసులో పన్ను విధింపు బిందువు అనేది, గ్రహీత యొక్క ఖాతాల పుస్తకంలో చెల్లింపు లెక్కచూపబడిన తేది లేదా అతని బ్యాంకు ఖాతాకు చెల్లింపు క్రెడిట్ చేయబడిన తేదీలలో ముందుగా వచ్చేది అయి ఉంటుంది.

దీనిని మనం ఉదాహరణలతో మరింతగా అర్థం చేసుకుందాం.

దృష్టాంతం 1
ఇన్వాయిస్ తేది చెల్లింపు అందుకున్న తేది వస్తువులు సరఫరా సమయం
20 జులై, 201710 ఆగస్ట్, 201720 జులై, 2017

పై దృష్టాంతంలో, సరఫరా సమయం 20 జూలై, 2017 అయి ఉంటుంది. దీనికి కారణం, సరఫరా సమయం అనేది ఇన్వాయిస్ తేదీ లేదా చెల్లింపు అందుకున్న తేదీల్లో ముందుగా వచ్చేది అయి ఉంటుంది. ఈ సందర్భంలో, ఇన్వాయిస్ తేదీ చెల్లింపు అందుకున్న తేదీ కంటే ముందు ఉంది.

దృష్టాంతం 2
ఇన్వాయిస్ తేది చెల్లింపు అందుకున్న తేది వస్తువులు సరఫరా సమయం
5 సెప్టెంబర్, 201725 ఆగస్ట్, 201725 ఆగస్ట్, 2017

పై దృష్టాంతంలో, సరఫరా సమయం 25 ఆగస్ట్ 2017 అయి ఉంటుంది. దీనికి కారణం, సరఫరా సమయం అనేది ఇన్వాయిస్ తేదీ లేదా చెల్లింపు అందుకున్న తేదీల్లో ముందుగా వచ్చేది అయి ఉంటుంది. ఈ సందర్భంలో, ఇన్వాయిస్ తేదీ కంటే చెల్లింపు అందుకున్న తేదీ (ముందుగా అందుకోవడం (అడ్వాన్స్ రసీట్) ముందు ఉంది.

దృష్టాంతం 3
ఇన్వాయిస్ తేది ఖాతా పుస్తకంలో ప్రవేశపెట్టబడిన అందుకోబడిన చెల్లింపు బ్యాంక్ ఖాతాకు క్రెడిట్ చేయబడిన అందుకోబడిన చెల్లింపు వస్తువులు సరఫరా సమయం
10 సెప్టెంబర్, 201729 ఆగస్ట్, 20173 సెప్టెంబర్, 201729 ఆగస్ట్, 2017

పై దృష్టాంతంలో, సరఫరా సమయం 29 ఆగస్ట్, 2017 అయి ఉంటుంది. దీనికి కారణం, సరఫరా సమయం అనేది ఇన్వాయిస్ తేదీ లేదా చెల్లింపు అందుకున్న తేదీల్లో ముందుగా వచ్చేది అయి ఉంటుంది. అందుకోబడిన చెల్లింపు తేదీ వీటిల్లో ముందు వచ్చేది అయి ఉంటుంది:

      • ఖాతాల పుస్తకాలలో చెల్లింపు నమోదు చేయబడిన తేదీ లేదా

 

    • బ్యాంకు ఖాతాకు చెల్లింపు క్రెడిట్ చేయబడిన తేదీ.

ఈ సందర్భంలో, ఖాతా పుస్తకాలలో చెల్లింపు అందుకున్నట్లుగా నమోదు చేసిన తేదీ, చెల్లింపు బ్యాంకు ఖాతాకు క్రెడిట్ చేయబడిన తేదీ కంటే ముందు ఉంది. అందువల్ల, సరఫరా సమయం 29 ఆగస్ట్, 2017 అయి ఉంటుంది.

దృష్టాంతం 4
ఇన్వాయిస్ తేది ఖాతా పుస్తకంలో ప్రవేశపెట్టబడిన అందుకోబడిన చెల్లింపు బ్యాంక్ ఖాతాకు క్రెడిట్ చేయబడిన అందుకోబడిన చెల్లింపు వస్తువులు సరఫరా సమయం
10 సెప్టెంబర్5 సెప్టెంబర్, 201731 ఆగస్ట్, 201731 ఆగస్ట్, 2017

పై దృష్టాంతంలో, సరఫరా సమయం 31 ఆగస్ట్, 2017 అయి ఉంటుంది. దీనికి కారణం, సరఫరా సమయం అనేది ఇన్వాయిస్ తేదీ లేదా చెల్లింపు అందుకున్న తేదీల్లో ముందుగా వచ్చేది అయి ఉంటుంది. ఈ సందర్భంలో, ఖాతా పుస్తకాలలో చెల్లింపు నమోదు చేయబడిన తేదీ కంటే బ్యాంక్ ఖాతాకు చెల్లింపు క్రెడిట్ చేయబడిన తేది ముందుగా ఉంది.

దృష్టాంతం 5
సరఫరా కోసం తొలగించబడిన వస్తువులుచెల్లింపు అందుకున్నది వస్తువులు సరఫరా సమయం
25 ఆగస్ట్, 20175 సెప్టెంబర్, 201725 ఆగస్ట్, 2017

పై దృష్టాంతంలో, ఇన్వాయిస్ తేదీ అందుబాటులో లేదు. ఇక్కడ, సరఫరా సమయం అనేది ఇన్వాయిస్ జారీచేసేందుకు ఆఖరి తేది మరియు చెల్లింపు అందుకున్న రోజుల్లో ముందు వచ్చేది అయి ఉంటుంది. వస్తువుల తరలింపుకు సంబంధించి ఇన్వాయిస్ జారీ చేసేందుకు ఆఖరి తేదీ, వస్తువుల తొలగింపు సమయం వద్ద ఉంటుంది. అందువల్ల, సరఫరా సమయం 25 ఆగస్ట్, 2017 అయి ఉంటుంది. ఇది ఎందుకంటే వస్తువుల తొలగింపు తేదీ చెల్లింపు పొందిన తేదీ కంటే ముందుగా ఉంది కాబట్టి.

త్వరలో వస్తోంది

రివర్స్ ఛార్జ్ పై వస్తువుల కోసం సరఫరా సమయం ఏమిటి

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

90,092 total views, 6 views today

Yarab A

Author: Yarab A

Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.