మా ఇంతకు పూర్వపు బ్లాగ్ పోస్ట్ ఫార్వర్డ్ ఛార్జి పై వస్తువులకు సరఫరా సమయం ఏది

లో మేము వస్తువుల సరఫరా సమయం చర్చించాం. ఈ బ్లాగ్ లో, మేము ఫార్వర్డ్ ఛార్జి పై సేవలకు సరఫరా సమయం చర్చిస్తాం.

ప్రస్తుత వ్యవస్థలో
ప్రస్తుత పరోక్ష పన్ను వ్యవస్థలో, పన్ను విధించదగిన సేవలను అందించడం పై, సేవా పన్ను వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి సేవా పన్ను చెల్లించాల్సిన సమయ బిందువు పాయింట్ ఆఫ్ టాక్సేషన్ (పిఒటి)కి అనుగుణంగా నిర్ణయించబడుతుంది.
పిఒటి ప్రకారం, ఫార్వర్డ్ ఛార్జ్ పై సేవా పన్ను చెల్లించవలసిన బాధ్యత క్రింద చూపిన విధంగా నిర్ణయించబడుతుంది:

క్రింది వాటిల్లో అన్నింటి కంటే ముందు వచ్చేది
ఇన్వాయిస్ జారీ చేసిన తేదీ సేవను పూర్తి చేయబడిన నాటి నుండి 30 రోజుల్లో ఇన్వాయిస్ జారీ చేయబడితే
సేవ పూర్తి చేయబడిన తేది సేవను పూర్తి చేయబడిన నాటి నుండి 30 రోజుల్లో ఇన్వాయిస్ జారీ చేయబడి ఉండకపోతే
చెల్లింపు అందుకున్న తేది Earliest of ఖాతాల పుస్తకాలలో నమోదుచేయబడిన చెల్లింపు తేది లేదా బ్యాంకు ఖాతాకు చెల్లింపు క్రెడిట్ చేయబడిన తేదీలలో ముందుగా వచ్చేది

మనం ఉదాహరణలతో అర్ధం చేసుకుందాం.


సేవ పూర్తిచేయబడిన తేది
సేవ పూర్తిచేయబడిన తేది చెల్లింపు అందుకున్న తేది పిఒటి వివరణ
15 అక్టోబర్, 201620 అక్టోబర్, 201610 నవంబర్, 201620 అక్టోబర్, 2016 సేవ పూర్తి చేయబడిన 30 రోజుల్లో ఇన్వాయిస్ జారీ చేయబడుతుంది మరియు ఇన్వాయిస్ తేదీ చెల్లింపు అందుకున్న తేదీ కంటే ముందరిది.
1 డిసెంబర్, 20165 డిసెంబర్, 201625 నవంబర్, 201625 నవంబర్, 2016సేవ పూర్తి చేయబడిన 30 రోజుల్లో ఇన్వాయిస్ జారీ చేయబడుతుంది మరియు చెల్లింపు అందుకున్న తేదీ ఇన్వాయిస్ తేదీ కంటే ముందరిది.
1 నవంబర్, 20165 డిసెంబర్, 201610 డిసెంబర్, 20161 నవంబర్, 2016 సేవ పూర్తి చేయబడిన 30 రోజుల్లో ఇన్వాయిస్ జారీ చేయబడుతుంది అందువల్ల, వీటిల్లో ముందు వచ్చేది; సేవ పూర్తి చేయబడటం లేదా చెల్లింపు అందుకున్న తేది పిఒటి అవుతుంది అంటే, ఈ సందర్భంలో, సేవ పూర్తి చేయబడిన తేదీ అయిన 1 నవంబర్, 2016 అవుతుంది.

జిఎస్టి కింద

జిఎస్టి లో, పన్ను చెల్లించాల్సిన సమయ బిందువు నిర్ణయం ‘టైమ్ ఆఫ్ సప్లై’ నిబంధనల కింద వివరించబడింది. సేవలకు సరఫరా సమయం నిర్ణయం అనేది వస్తువుల కోసం సరఫరా సమయం నిర్ణయించడాన్ని పోలి ఉంటుంది. వస్తువులలాగా కాకుండా, సేవలు అనేవి కొలవబడలేనివి అయినప్పటికీ, వస్తువులు మరియు సేవల మధ్య ఖాళీని పూరించడానికి మరియు సరళమైన సూత్రాలను నిర్ధారించడానికి, వస్తువులు మరియు సేవలకు సరఫరా సమయం నిర్ణయించడానికి నిబంధనలు ఒకే రీతిగా ఉంటాయి.

ఫార్వర్డ్ ఛార్జ్ ఆధారంగా జిఎస్టి కింద సేవల సరఫరా సమయం మనం అర్ధం చేసుకుందాం

జిఎస్టి (సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి లేదా ఐజిఎస్టి, వర్తించే విధంగా) యొక్క బాధ్యత క్రింద చూపిన విధంగా ఉత్పన్నమవుతుంది:

క్రింది వాటిల్లో అన్నింటి కంటే ముందు వచ్చేది

ఇన్వాయిస్ తేది

సరఫరాదారు ఇన్వాయిస్ జారీచేసే తేదీ.

ఇన్వాయిస్ జారీ చేసేందుకు గడువు తేది

సరఫరాదారు ఇన్వాయిస్ జారీ చేయవలసిన ఆఖరి తేదీ ఏదంటే, సేవల సరఫరా తేదీ నుండి 30 రోజులు. ఒక బ్యాంకింగ్ సంస్థ విషయంలో, సేవల సరఫరా తేదీ నుండి 45 రోజుల లోపల ఇన్వాయిస్ జారీ చేయాలి.

చెల్లింపు అందుకోవడం

చెల్లింపు అందుకున్న తేది. ఖాతాల పుస్తకంలో చెల్లింపు లెక్కచూపబడిన తేది లేదా అతని బ్యాంకు ఖాతాకు చెల్లింపు క్రెడిట్ చేయబడిన తేదీలలో ముందుగా వచ్చేది అయి ఉంటుంది.

దీనిని మనం ఉదాహరణలతో అర్ధం చేసుకుందాం.

ఇన్వాయిస్ తేది చెల్లింపు అందుకున్న తేది సరఫరా సమయం వివరణ
20 అక్టోబర్, 201710 నవంబర్, 201720 అక్టోబర్, 2017 ఈ సందర్భంలో, చెల్లింపు అందుకున్న తేదీ కంటే ఇన్వాయిస్ తేది ముందరిది. అందువలన, సరఫరా సమయం అనేది 20 అక్టోబర్, 2017 అయి ఉంటుంది.
5 డిసెంబర్, 201725 నవంబర్, 201725 నవంబర్, 2017ఈ సందర్భంలో, చెల్లింపు అందుకున్న తేదీ (అడ్వాన్స్ రసీట్) అనేది ఇన్వాయిస్ తేది కంటే ముందరిది. అందువలన, సరఫరా సమయం అనేది 25 నవంబర్, 2017 అయి ఉంటుంది.
5 డిసెంబర్, 2017 పుస్తకంలో నమోదు తేది: : 20 నవంబర్, 2017

బ్యాంకు ఖాతాకు చెల్లింపు క్రెడిట్ చేయబడిన తేదీ: : 25 నవంబర్, 2017

20 నవంబర్, 2017ఇన్వాయిస్ తేది లేదా చెల్లింపు అందుకున్న తేదీల్లో ఏది ముందు వస్తే అది సరఫరా సమయం అవుతుంది. చెల్లింపు అందుకునే తేదీ వీటిల్లో ఏది ముందు వస్తే అది:
• ఖాతా పుస్తకంలో చెల్లింపు నమోదు చేయబడిన తేది లేదా
• బ్యాంకు ఖాతాకు చెల్లింపు క్రెడిట్ చేయబడిన తేదీ
ఈ సందర్భంలో, చెల్లింపు అందుకున్నట్లుగా ఖాతా పుస్తకాల్లో నమోదు చేయబడిన తేదీ బ్యాంకు ఖాతాకు చెల్లింపు క్రెడిట్ చేయబడిన తేదీ
కంటే ముందరిది.
5 డిసెంబర్, 2017 పుస్తకాలలో నమోదు తేది: 15 నవంబర్, 2017
బ్యాంకు కు చెల్లింపు క్రెడిట్ చేయబడిన తేదీ: 10 నవంబర్, 2017

10 నవంబర్, 2017ఇన్వాయిస్ తేది లేదా చెల్లింపు అందుకున్న తేదీల్లో ఏది ముందు వస్తే అది సరఫరా సమయం అవుతుంది. చెల్లింపు అందుకునే తేదీ వీటిల్లో ఏది ముందు వస్తే అది:

• ఖాతా పుస్తకంలో చెల్లింపు నమోదు చేయబడిన తేది లేదా
• బ్యాంకు ఖాతాకు చెల్లింపు క్రెడిట్ చేయబడిన తేదీ
ఈ సందర్భంలో, బ్యాంకు ఖాతాకు చెల్లింపు క్రెడిట్ చేయబడిన తేదీ చెల్లింపు అందుకున్నట్లుగా ఖాతా పుస్తకాల్లో నమోదు చేయబడిన తేదీ
కంటే ముందరిది.

ఇన్వాయిస్ అందుబాటులో లేని సందర్భాల్లో సరఫరా సమయం

సేవ పూర్తిచేయబడిన తేది
చెల్లింపు అందుకోవడం సేవల సరఫరా సమయం వివరణ
1 నవంబర్, 20175 డిసెంబర్, 201730 నవంబర్, 2017 ఇన్వాయిస్ జారీచేసేందుకు ఆఖరి తేదీ మరియు చెల్లింపు అందుకున్న తేదీల్లో ఏది ముందు వస్తే అది సరఫరా సమయం. సేవల సరఫరా తేదీ నుండి 30 రోజులు ఇన్వాయిస్ జారీ చేయవలసిన ఆఖరి తేదీ అయి ఉంటుంది. అందువలన సరఫరా సమయం 30 నవంబర్, 2017 అవుతుంది. ఇది ఎందుకంటే, సేవలు పూర్తిచేసిన 30 రోజులు చెల్లింపు అందుకునే తేదీ కంటే ముందరిది.

రానున్నవి
మాకు మీ సహాయం కావాలి

కింది వ్యాఖ్యలని ఉపయోగించి ఈ బ్లాగ్ పోస్ట్ పై మీ అభిప్రాయాన్ని దయచేసి పంచుకోండి రివర్స్ ఛార్జ్ యంత్రాంగం పై వస్తువుల సరఫరా సమయం
అలాగే ఏ జిఎస్టి సంబంధిత విషయాలని గురించి మీరు మరింత తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నారో మాకు తెలియజేయండి, మేము మా కంటెంట్ ప్రణాళికలో వాటిని సంతోషంగా చేర్చుతాము.
ఇది సహాయకారిగా అనిపించిందా? క్రింద సోషల్ షేర్ బటన్ను ఉపయోగించి దీన్ని ఇతరులతో పంచుకోండి.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

77,827 total views, 66 views today

Yarab A

Author: Yarab A

Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.