1జులై, 2017 నాడు జిఎస్టి ప్రవేశపెట్టబడటంతో, జిఎస్టి పన్ను ఇన్వాయిస్లకు కేటాయించిన ప్రమాణాలకు సరితూగే ఖచ్చితమైన ఇన్వాయిస్లను రూపొందించడం అనేది మీ చేతుల్లో ఉన్న ఒక తక్షణ కర్తవ్య్యం. జిఎస్టి పన్ను ఇన్వాయిస్ యొక్క ముఖ్యమైన భాగం ఏమిటంటే సరఫరాపై సేకరించిన పన్ను.

ఒక సరఫరాపై సేకరించవలసిన పన్ను యొక్క సరైన విలువను లెక్కించడానికి, సరఫరా చేయబడిన వస్తువులు లేదా సేవలకు వర్తించే జిఎస్టి రేటును నిర్ధారించడం చాలా ముఖ్యం. సూచించిన రేటు వద్ద పన్ను విధించబడవలసిన సరైన విలువను నిర్ణయించడం కూడా అంతే ముఖ్యం. ఇది గనక చేయబడకపోతే, ఇది అనవసరమైన వ్యాజ్యం, వడ్డీ విధింపుగా పరిణమించగలదు, మరియు గ్రహీత సరఫరాపై ఇన్పుట్ క్రెడిట్ ను కూడా కోల్పోవచ్చు.
ఒక సరఫరాపై పన్ను విధించవలసిన సరైన విలువను నిర్ణయించటానికి ఇది మీకు ఒక మార్గదర్శకం. జిఎస్టి విధించబడవలసిన ఈ విలువని లావాదేవీ విలువ అంటారు.

ఇది కూడా చదవండి వస్తువులు మరియు సేవల సరఫరా; దాని అర్ధం ఏమిటి?

ఒక ఇన్వాయఎస్టి ఛార్జ్ చేయవలసిన విలువను లెక్కించడానికి దశలు

1. సరఫరా చేయబడిన వస్తువులు లేదా సేవ యొక్క ధర నిర్ణయించండి
2. కమిషన్, ప్యాకింగ్ వంటి ఏవైనా అదనపు ఛార్జీలు జోడించండి
3. జిఎస్టి కాకుండా ఇతరమైన, సరఫరాపై వర్తించే ఏదైనా ఇతర పన్నును జోడించండి
4. ఇన్వాయిస్ లో చూపిన రాయితీ మినహాయించండి

ఉదాహరణ: కర్ణాటకలో రోహన్ ప్రైవేట్ లిమిటెడ్ కర్ణాటకలో డిసూజా & సన్స్ అనే డీలర్ కు 100 వాషింగ్ మెషీన్లని సరఫరా చేస్తుంది. 1 వాషింగ్ మెషీన్ ధర రూ. 30,000. రోహన్ ప్రైవేట్ లిమిటెడ్ వాషింగ్ మెషీన్ల ప్యాకింగ్ కోసం రూ. 2,000 మరియు సరుకు రవాణా కోసం రూ.8,000 ఛార్జి చేస్తుంది. డిసూజా & సన్స్ కు రూ.10,000 రాయితీ ఇవ్వబడుతుంది. వాషింగ్ మెషీన్లకు వర్తించే జిఎస్టి రేటు 28%.

ఈ సరఫరాలో జిఎస్టిని ఛార్జ్ చేయాల్సిన విలువకి మనం చేరుకుందాం.

వివరాలుపరిమాణంరేటుమొత్తం
వాషింగ్ మెషీన్లు10030,00030,00,000
Add: జోడించండి; ప్యాకింగ్ ఛార్జీలు2,000
Add: జోడించండి; ప్యాకింగ్ ఛార్జీలు8000
Less: మినహాయించండి : రాయితీ(-)10,000
పన్నువిధించదగిన విలువ30,00,000
సిజిఎస్టి @14%4,20,000
ఎస్జిఎస్టి @ 14%4,20,000
మొత్తం ఇన్వాయిస్ విలువ38,40,000

దీని కోసం ఇన్వాయిస్ క్రింద చూపిన విధంగా కనిపిస్తుంది:

tax-invoice-calculation

సరఫరా తర్వాత అదనపు ఛార్జీలు లేదా డిస్కౌంట్లను ఎలా నిర్వహించాలి

విలువకు జోడింపులు
      • అదనపు ఛార్జీలు

 

      • రవాణా వంటి మీరు (సరఫరాదారు) చెల్లించే కానీ గ్రహీత ద్వారా భరించబడే ఏదైనా మొత్తం

 

    • ఆలస్యం చెల్లింపు చేసినందుకు గ్రహీతపై వసూలు చేయబడే వడ్డీ/ఆలస్యపు రుసుము / జరిమానా

ఈ సందర్భాలలో, ఒక డెబిట్ నోట్ చేసి, అసలు ఇన్వాయిస్ కు లింక్ చేయబడాలి మరియు ఆ విలువపై జిఎస్టి చార్జ్ చేయాలి.

ఉదాహరణ: పై ఉదాహరణలో సరఫరా పై, అంగీకరించిన 30 రోజుల కాలంలో చెల్లింపు చేయడంలో డిసూజా & సన్స్ విఫలమైనందుకు, రోహన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ 60,000 జరిమానా విధిస్తుంది. ఇక్కడ, క్రింద చూపిన విధంగా లెక్కించి జిఎస్టి @ 18% (వాషింగ్ మెషీన్లకు వర్తించే రేటు) ఛార్జి చేస్తూ పైన చూపించిన ఇన్వాయిస్ కు వ్యతిరేకంగా రోహన్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక డెబిట్ నోట్ చేయాలి:

వివరాలుమొత్తం t
ఆలస్యంగా చెల్లించినందుకు విధించబడిన జరిమానా60,000
సిజిఎస్టి @ 14%8400
ఎస్జిఎస్టి @ 14%8400
మొత్తం డెబిట్ నోట్ విలువ76,800

డెబిట్ నోట్ క్రింద చూపిన విధంగా కనిపిస్తుంది:

debit-note-values
విలువ నుండి మినహాయింపులు

సరఫరా తర్వాత ఇచ్చిన రాయితీ. సరఫరా తరువాత గనక రాయితీ ఇచ్చినట్లయితే, అది సరఫరా చేయడానికి ముందు అంగీకరించబడేలాగా మరియు ఒక నిర్దిష్ట ఇన్వాయిస్ కు లింక్ చేయబడవచ్చని నిర్ధారించుకోండి. అలాంటి రాయితీ లావాదేవీ విలువ నుండి తీసివేయబడవచ్చు. దీని కోసం, డిస్కౌంట్ మొత్తం మరియు వర్తించే జిఎస్టి కోసం ఒక క్రెడిట్ నోట్ తయారు చేయండి.
ఉదాహరణ : రోహన్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు డిసుజా & సన్స్ ఒప్పందం ప్రకారం, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా డిసుజా & సన్స్ సరఫరా కోసం చెల్లింపు చేస్తే, రోహన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్వాయిస్ విలువ పై రూ 2,000 రాయితీ ఇస్తారు. దీని ప్రకారం, మిస్టర్ డిసూజా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేస్తారు. ఇవ్వబడిన రూ. 2,000 రాయితీ కోసం, ఈ క్రింద ఇచ్చిన విధంగా వివరాలతో అసలు ఇన్వాయిస్ కు వ్యతిరేకంగా మిస్టర్ రోహన్ క్రెడిట్ నోట్ తయారు చేయాలి:

వివరాలువివరాలు
రాయితీ2000
సిజిఎస్టి @ 14%280
ఎస్జిఎస్టి @ 14%280
మొత్తం క్రెడిట్ నోట్ విలువ2560

క్రెడిట్ నోట్ క్రింద చూపిన విధంగా కనిపిస్తుంది:
revised-invoice-updated

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

217,299 total views, 252 views today