వస్తువుల మరియు సేవల యొక్క వెలకట్టడం అనేది చెల్లించవలసిన పన్ను మొత్తాన్ని నిర్ణయించే ఒక ముఖ్యమైన అంశం. వస్తువులు మరియు సేవలు గనక తక్కువగా వెలకట్టబడినట్లయితే, ఇది తక్కువ పన్ను చెల్లింపుకు దారితీస్తుంది, ఇది అసంబద్ధతకు మరియు ఫలితంగా చట్టబద్ధమైన చిక్కులకు దారితీస్తుంది. మితిమీరి వెలకట్టడం అనేది అదనపు పన్నుల రూపంలో వ్యాపారాలకు ఆదాయం కోల్పోవడంగా పరిణమిస్తుంది. వస్తువులు మరియు సేవల యొక్క సరికాని లేదా దోషపూరిత వెలకట్టడం కారణంగా అస్పష్టతలను తొలగించడం మరియు చట్టపరమైన చర్యలను నివారించడం కోసం ఖచ్చితమైన పన్ను విధించదగిన విలువను నిర్ణయించేటప్పుడు వ్యాపారాలకు మార్గదర్శకాల వలె వ్యవహరించే వెలగట్టే పద్ధతులు చట్టం ద్వారా అందించబడ్డాయి.
మా పూర్వపు బ్లాగ్ వస్తువులు & సేవల విలువ జిఎస్టి కింద ఎలాగ నిర్ధారించబడుతుంది? లో మేము ప్రస్తుత వ్యవస్థలోని వివిధ వెలకట్టే పద్ధతులను గురించి, మరియు జిఎస్టి కింద లావాదేవీ ప్రాతిపదికన పన్ను విధించదగినది అయిన సరఫరా యొక్క విలువను నిర్ణయించడం గురించి కూడా చర్చించాము. సరఫరా కోసం ధర అనేది ఏకైక పరిగణనగా ఉన్నప్పుడు మరియు సరఫరాదారు మరియు గ్రహీత ఇద్దరికీ మధ్య సంబంధం లేనప్పుడు లావాదేవీ విలువని వెలగట్టే విధానంగా వర్తింపజేయవచ్చు. (ఈ బ్లాగ్ పోస్ట్ ని జిఎస్టి కింద సంబంధిత పక్షాల లావాదేవీలు పై చదవండి).
అయితే, ధర అనేది ఏకైక పరిగణనగా లేని సందర్భాల్లో లేదా సంబంధిత వ్యక్తులు లేదా విభిన్న వ్యక్తులు (అదే పాన్(PAN)కు చెందిన 2 యూనిట్ల మధ్య) మధ్య సరఫరా జరిగి ఉన్నచోట, లావాదేవీ విలువ పద్ధతి వర్తింపజేయడం వీలుకాదు. అటువంటి సందర్భాల్లో, సరఫరా యొక్క పన్ను పరిధిలోకి వచ్చే విలువను నిర్ణయించడానికి వెలకట్టడం నియమాల క్రింద వివిధ కొలమానాలు నిర్వచించబడ్డాయి. ఈ క్రిందివి వివిధ దృష్టాంతాలు:
1. పరిగణన అనేది పూర్తిగా డబ్బుగా లేని చోట వస్తువులు లేదా సేవల సరఫరా విలువ
2. వేర్వేరు లేదా సంబంధిత వ్యక్తుల మధ్య వస్తువుల లేదా సేవలు లేదా రెండింటి సరఫరా విలువ
3. ఒక ఏజెంట్ ద్వారా చేయబడిన వస్తువుల సరఫరా విలువ
ఈ బ్లాగులో, పరిగణన అనేది పూర్తిగా డబ్బుగా లేని చోట వస్తువులు లేదా సేవల సరఫరా విలువ

Valuation of supply of goods or services where the consideration is not wholly in moneyClick To Tweetసరఫరా కోసం పరిగణన పూర్తిగా డబ్బుగా లేకపోవడాన్ని’ మనం భావించే ముందు, వర్తకం అనేది, ప్రముఖంగా ‘బార్టర్ సిస్టమ్’ అని పిలువబడే వస్తువుల మార్పిడి కోసం చేయబడిన నాగరికత ప్రారంభ రోజులలోకి మనం వెనక్కి వెళ్దాము.. ‘ఈ విధానంలో, ప్రజలు డబ్బుపరంగా ఎలాంటి పరిగణన లేకుండా, వస్తువులను లేదా/మరియు సేవలను అందుకు బదులుగా ఇతర వస్తువులను లేదా/మరియు సేవల కోసం మార్పిడి చేసుకునేవారు. ఈ రోజు శతాబ్దం క్రితపు మార్పిడి వ్యవస్థ అధునాతన మార్గం -” ఎక్స్చేంజ్ ఆఫర్” లో మళ్ళీ తిరిగొచ్చింది. ఈ పథకం కింద, వస్తువులు పాక్షికంగా డబ్బుని పరిగణనగా మరియు పాక్షికంగా పాత వస్తువుల మార్పిడికి వస్తువులు విక్రయించబడతాయి. ఉదాహరణకు, ఒక పాత వాషింగ్ మెషిన్ తో మార్పిడి చేసిన తర్వాత ఒక వాషింగ్ మెషీన్ రూ.25,000 కు విక్రయించబడింది.
పైన చెప్పిన ఉదాహరణలో రూ.25,000 లావాదేవీ విలువ అని మీరు అనుకుంటే, మీరు ఇబ్బందుల్లో ఉంటారు మరియు ఇది సంభావ్యంగా వ్యాజ్యానికి దారి తీయవచ్చు. ఇది ఎందుకంటే వాషింగ్ మెషీన్ సరఫరా కోసం పరిగణనలోకి తీసుకున్న ధరలో రూ.25,000 కేవలం ఒక భాగం మాత్రమే మరియు అది లావాదేవీ విలువను వర్తింపచేయడానికి అవసరమైన సంపూర్ణ ధర కాదు.అందువల్ల, అటువంటి రకాలైన సరఫరాల కోసం, క్రింది విలువలను వర్తింపజేయడం ద్వారా సరఫరా విలువను పొందాలి:
1. అటువంటి సరఫరా యొక్క ఓపెన్ మార్కెట్ విలువ
2. ఓపెన్ మార్కెట్ విలువ అందుబాటులో లేనట్లయితే, సరఫరా సమయంలో అటువంటి డబ్బుపరమైన విలువ గనక తెలిసి ఉన్నట్లయితే, డబ్బుపరంగా పరిగణన మరియు డబ్బుపరంగా లేని పరిగణన యొక్క డబ్బుపరమైన విలువ మొత్తాల యొక్క మొత్తం.
దశలు 1 మరియు 2 వర్తింపజేయడం ద్వారా విలువ గనక నిర్ణయించబడలేకపోతే, అటువంటి రకమైన మరియు నాణ్యతగల వస్తువుల లేదా/ మరియు సేవల సరఫరా విలువ పరిగణించబడుతుంది

ఉదాహరణలతో సరఫరా విలువను కట్టేందుకు మనం ఈ కొలమానాల్లో ప్రతి ఒక్కదాన్ని అర్థం చేసుకుందాం.

1. సరఫరా యొక్క ఓపెన్ మార్కెట్ విలువ

వస్తువులు లేదా సేవల సరఫరా యొక్క ఓపెన్ మార్కెట్ విలువ అనేది జిఎస్టి మరియు లావాదేవీ కోసం ఒక వ్యక్తి చెల్లించదగిన సుంకాన్ని మినహాయించి డబ్బుపరంగా పూర్తి విలువ అయి ఉంటుంది.
మనం ఒక వాషింగ్ మెషీన్ ఉదాహరణను పరిశీలిద్దాం. ఒక వాషింగ్ మెషీన్ తో మార్పిడితో రూ. 25,000కు ఒక వాషింగ్ మెషీన్ సరఫరా చేయబడింది. మార్పిడి లేకుండా వాషింగ్ మెషీన్ ధర రూ.30,000 రూపాయలు ఉంటే, అప్పుడు ఓపెన్ మార్కెట్ విలువ రూ .30,000 ఉంటుంది, అందువలన, ఈ విలువపై జిఎస్టి విధించబడుతుంది.

2. డబ్బులో పరిగణన యొక్క పూర్తి మొత్తం మరియు డబ్బులో కాకుండా పరిగణన యొక్క డబ్బుపరమైన విలువ

వస్తువుల లేదా సేవల యొక్క ఓపెన్ మార్కెట్ విలువ అందుబాటులో లేనప్పుడు ఈ వెలకట్టే పద్ధతి వర్తిస్తుంది. పన్ను విధించదగిన విలువకు రావడానికి, డబ్బులో అందుకున్న మొత్తం పరిగణనగా తీసుకున్న ఉత్పత్తులు లేదా సేవల యొక్క డబ్బుపరమైన విలువతో జోడించబడుతుంది.

పన్ను పరిధిలోకి వచ్చే విలువ = డబ్బులో పరిగణన + డబ్బులో లేని పరిగణన యొక్క డబ్బుపరమైన విలువ

ఉదాహరణ

ప్రెస్టీజ్ ఇన్నోవేటర్స్ ఒక పాత ఎసి మార్పిడి చేసుకునే ఒక ఆఫర్ తో ఒక విశ్వసనీయ వినియోగదారునికి ఒక కొత్త ఇన్వర్టర్ ఎసిని అది లాంచ్ చేయబడటానికి పూర్వం రూ.45,000 కి సరఫరా చేసింది. సరఫరా సమయంలో పాత ఎసి యొక్క విలువ రూ.10,000, కానీ సరఫరా చేయబడిన ఇన్వర్టర్ ఎసి యొక్క ఓపెన్ మార్కెట్ విలువ అందుబాటులో లేదు.
పన్ను విధించబడదగిన విలువకు చేరడం కోసం, ప్రెస్టీజ్ ఇన్నోవేటర్స్ లావాదేవీ విలువను వర్తింపజేయలేదు ఎందుకంటే ధర ఒక్కటే పరిగణన కాదు కాబట్టి. మార్కెట్ విలువ అందుబాటులో లేనందున ఓపెన్ మార్కెట్ విలువ కూడా వర్తింపజేయబడలేదు. అటువంటి సందర్భంలో, పన్ను పరిధిలోకి వచ్చే విలువ అనేది డబ్బులో స్వీకరించిన పరిగణన మొత్తం యొక్క మొత్తం ప్లస్ పరిగణనగా పొందబడిన ఉత్పత్తి లేదా సేవల యొక్క డబ్బుపరమైన విలువ అయి ఉంటుంది. అందువల్ల, ఎసి యొక్క సరఫరా చేయదగిన పన్ను విలువ ఇలా ఉంటుంది:

డబ్బులో పరిగణన అనేది రూ 45,000 + ఎసి యొక్క డబ్బుపరమైన విలువ రూ 10,000 = రూ.55,000

3. అదే రకం మరియు నాణ్యత గల వస్తువుల మరియు/లేదా సేవల సరఫరా విలువ

వస్తువులు లేదా సేవల యొక్క ఓపెన్ మార్కెట్ విలువ అందుబాటులో లేనప్పుడు మరియు డబ్బులో పరిగణనను వర్తింపజేయడం ద్వారా విలువ నిర్ధారించబడలేనప్పుడు మరియు పరిగణన యొక్క విలువ డబ్బుపరమైన విలువ డబ్బుగా లేనప్పుడు ఈ పద్ధతి వర్తిస్తుంది. అటువంటి సందర్భంలో, వస్తువుల మరియు / లేదా సేవల సరఫరా విలువ అనేది సరఫరా చేయబడుతున్న ఉత్పత్తి యొక్క ‘ అదే రకమైన మరియు నాణ్యతగల’ ఉత్పత్తుల ధరల ఆధారంగా నిర్ణయించబడుతుంది. సరఫరా చేయబడే వస్తువులు మరియు సేవలు అదే రకం అదే లక్షణాలు, నాణ్యత, పరిమాణం, పనిచేసే భాగాలు, పదార్థాలు మరియు ఖ్యాతిని కలిగి ఉండాలి లేదా సదరు వస్తువులు లేదా సేవలతో సన్నిహితంగా లేదా గణనీయంగా సమానంగా ఉండాలి అనే లాంటి కారకాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ‘అదే రకమైన మరియు నాణ్యత గల’ ఉత్పత్తుల విలువ నిర్ణయించబడుతుంది.

ఉదాహరణ

మోడరన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఒక కొత్త ఉత్పత్తి ‘ఐఒటి-యూనివర్సల్ రిమోట్ ఆర్గనైజర్’ ను ప్రవేశపెట్టింది, ఇది ఉత్పత్తి ప్రమోషన్లో భాగంగా వినియోగదారులకు అందించబడుతోంది. ఈ సందర్భంలో, ఉత్పత్తి మొదటిసారిగా ప్రవేశపెట్టబడుతోంది కాబట్టి, ‘ఓపెన్ మార్కెట్ విలువ’ పద్ధతిని ఉపయోగించడం ద్వారా లేదా ‘డబ్బులో పరిగణన మరియు డబ్బులో లేని పరిగణన యొక్క డబ్బుపరమైన విలువ’ను పరిగణించడం ద్వారా విలువ నిర్ణయించబడలేదు. ఈ సందర్భంలో, విలువను నిర్ణయించడానికి, చివరి పద్ధతి – ‘అదేరకం మరియు నాణ్యత గల’ ఒక ఉత్పత్తితో సరిపోల్చడం వర్తింపజేయవచ్చు.
ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ వద్ద రూ. 10,000 కు విక్రయించబడుతున్న ఒక ఉత్పత్తి ఉంది, ఇది అదేరకం ఆకృతీకరణ మరియు పనితీరుతో అదనపు యుఎస్బి పోర్టు కలిగి ఉంది. అందువల్ల, ‘’ఐఒటి-యూనివర్సల్ రిమోట్ ఆర్గనైజర్’ యొక్క విలువ పన్ను మదింపు అవసరాల కోసం రూ .10,000 గా వెలకట్టబడుతుంది.

ఉపయోగించడం ద్వారా నిర్ణయించబడుతుంది. ఇది మా రాబోయే బ్లాగ్లలో మరింత వివరంగా వివరించబడుతుంది.

రాబోయే బ్లాగులు

1. వేర్వేరు లేదా సంబంధిత వ్యక్తుల మధ్య వస్తువులు లేదా సేవలు లేదా రెండింటి సరఫరా యొక్క విలువ
2. ఏజెంట్ ద్వారా చేయబడిన వస్తువుల సరఫరా విలువ

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

200,254 total views, 211 views today

Yarab A

Author: Yarab A

Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.