ఈ బ్లాగ్లో, మేము ఫారం జిఎస్టిఆర్ 3బి ని మరియు జిఎస్టిఆర్ 3బి ని ఫైల్ చేసే ప్రక్రియను సులభతరం చేసేందుకు టాలీ యొక్క జిఎస్టి రెడీ సాఫ్ట్వేర్ అందించే పరిష్కారం గురించి చర్చిస్తాము.

కవర్ చేయబడిన శీర్షికలు

ఫారం జిఎస్టిఆర్ 3బికు పరిచయం
జిఎస్టి-రెడీ టాలీ.ఇఆర్ పి 9 రిలీజ్ 6 లో ఫారం జిఎస్టిఆర్ 3బి కు కేటాయింపు ఉన్నదా?

జిఎస్టి-రెడీ టాలీ.ఇఆర్ పి 9 రిలీజ్ 6 యొక్క అత్యంత ఇటీవలి సమర్పణకు నేను అప్గ్రేడ్ చేసుకోకపోతే ఏమి జరుగుతుంది? ఫారం జిఎస్టిఆర్ 3బి నేను ఇప్పటికీ ఫైల్ చేయగలనా?
టాలీ.ఇఆర్ పి 9 లో ఫారం జిఎస్టిఆర్-3బి ( ) ()

ఫారం జిఎస్టిఆర్-3బికు పరిచయం

ఇప్పటికల్లా, ప్రభుత్వము జిఎస్టిఆర్ 1 మరియు జిఎస్టిఆర్ 2 సమయపాలనలను సడలించిందనే విషయం మనందరికీ తెలుసు. మొదటి జిఎస్టిఆర్ 1 అప్లోడ్, 2017 యొక్క జూలై మరియు ఆగస్టు నెలల కోసం బహుశా, సెప్టెంబర్ నెల 2017లో ఉంటుంది, మరియు మిగిలిన కార్యకలాపాలు మరియు లాంఛనాలు తర్వాత అనుసరిస్తాయి.
అయితే, దీని అర్ధం జిఎస్టి యొక్క సేకరణ మరియు చెల్లింపు ఆ సమయం వరకు జరగవలసిన అవసరం లేదని కాదు. జిఎస్టి కింద నమోదైన క్రమబధ్ధమైన రిజిస్టర్ చేసుకోబడిన పన్నుచెల్లింపుదారులు, జూలై మరియు ఆగస్టు, 2017 నెలల కోసం వారి బయటికి మరియు లోపలికి సరఫరాల వివరాలను, జిఎస్టిఆర్-3బి అని పిలవబడే ఒక సరళమైన ఫారంలో దాఖలు చేస్తారు అని భావించబడుతోంది.

ఇది కూడా చదవండి: ఫారం జిఎస్టిఆర్-3బిని పూరించడం ఎలాగ

టాలీ వారి జిఎస్టి సాఫ్ట్ వేర్లో ఫారం జిఎస్టిఆర్ 3బి కు కేటాయింపు ఉన్నదా?

శుభవార్త ఏమిటంటే ఫారం జిఎస్టిఆర్ 3బి కోసం జిఎస్టి- రెడి టాలీ.ఇఆర్ పి 9 రిలీజ్ 6 ఒక ప్రత్యేక విడుదల కలిగి ఉంటుంది. ఈ విడుదల 2017 ఆగష్టు మొదటి వారంలో ప్రణాళిక చేయబడింది.
అప్డేట్: టాలీ.ఇఆర్ పి 9 ఇప్పుడు జిఎస్టిఆర్-3బి తో సిద్ధంగా ఉంది. మీరు ఇప్పుడు దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఈ విడుదలను పొందడానికి టాలీ.ఇఆర్ పి 9 యొక్క సమాచార ప్యానెల్లో వర్షన్ మరియు అప్డేట్లల విభాగంలో క్లిక్ చేయవచ్చు..

మా వినియోగదారుల కోసం, మేము వర్డ్ డాక్యుమెంట్ ను రూపొందించే జిఎస్టిఆర్ 3బి ఫారంను ప్రింట్ చేయడానికి సామర్ధ్యం కల్పించాలని ప్రణాళిక చేసాము. జిఎస్టిఎన్ పోర్టల్ లో అవసరమైన విధంగా అవే క్షేత్రాలను ఈ డాక్యుమెంట్ కలిగి ఉంటుంది, ఇది జిఎస్టిఎన్ పోర్టల్ లో వివరాలను పూరించడానికి వినియోగదారునికి అనుకూలమైనదిగా ఉంటుంది. ఇది మీరు జిఎస్టిఆర్ 3బిని వీక్షించడానికి, దానిని సమీక్షించడానికి మరియు జిఎస్టిఎన్ ద్వారా అవసరమైనట్లుగా పోర్టల్ పై ఆ విలువలను ఆగస్టు 20 నాటికి పూరించడానికి మీకు గొప్ప విశ్వాసాన్ని ఇస్తుంది.

ఫారం జిఎస్టిఆర్ 3బిని పూరించడానికి మరియు ఫైల్ చేయడానికి జిఎస్టిఎన్ ఒక ఎక్సెల్ టెంప్లేట్ తో పాటుగా ఒక ఆఫ్ లైన్ యుటిలిటిని అందించవచ్చు. అది అలాగ చేసిన సందర్భంలో, మేము దానికోసం కూడా మద్దతు అందిస్తాము.

ఈ రోజు నాటికి, 2017 జులై మరియు ఆగస్టు నెలల కోసం, జిఎస్టిఆర్1 అప్లోడ్ చేయవలసి ఉంటుందని, మరియు జిఎస్టిఆర్2 లో ఇన్వాయిస్ మ్యాచింగ్ కూడా సెప్టెంబరు నెలలో చేయవలసి ఉంటుందని కూడా ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
ఏది ఏమయినప్పటికీ, జూలై మరియు ఆగస్ట్ 2017 నాటికి దాఖలు చేయబడే మీ ఫారం జిఎస్టిఆర్ 3బి, జూలై మరియు ఆగస్టు నెలల కోసం జిఎస్టిఎన్ ద్వారా ఉత్పన్నం చేయబడే జిఎస్టిఆర్-3 తో మ్యాచ్ అవడం అనేది అంతకంటే ముఖ్యమైనదిగా అనిపిస్తుంది.
జిఎస్టి-రెడీ టాలీ.ఇఆర్ పి రిలీజ్ 6 నుండి చేసినట్లయితే, డేటా యొక్క మూలం ఒకటే అయి ఉంటుంది కాబట్టి ఫారం జిఎస్టిఆర్ 3బిని జిఎస్టిఆర్-3 తో మ్యాచ్ చేయడం మీకు సులభంగా ఉంటుంది. లేకపోతే, జిఎస్టిఆర్ 1 మరియు 2 దాఖలు చేసే లాంఛనాన్ని పూర్తి చేసిన తర్వాత, ఒకసారి జిఎస్టిఆర్ 3 ఉత్పత్తి చేయబడినప్పుడు, ఏదైనా సరిపోలని విషయం గనక ఉంటే, పన్ను చెల్లించేవారి ద్వారా అదనపు పన్ను చెల్లించబడవలసి ఉంటుంది. లేదా రిఫండ్ (వాపసు) విషయంలో, అది ఐటిసిగా అందుబాటులోకి వస్తుంది, ఇది భవిష్యత్ బాధ్యతకు వ్యతిరేకంగా సర్దుబాటు కోసం క్లెయిమ్ చేయబడవచ్చు.

టాలీ.ఇఆర్ పి 9 రిలీజ్ 6.0.3లో జిఎస్టిఆర్-3బి గురించి మరింత తెలుసుకునేందుకు, దయచేసి సందర్శించండి టాలీహెల్ప్

జిఎస్టి-రెడీ టాలీ.ఇఆర్ పి 9 రిలీజ్ 6 యొక్క అత్యంత ఇటీవలి సమర్పణకు నేను అప్గ్రేడ్ చేసుకోకపోతే ఏమి జరుగుతుంది? ఫారం జిఎస్టిఆర్ 3బి నేను ఇప్పటికీ ఫైల్ చేయగలనా?

అది అందుబాటులోకి వచ్చిన వెంటనే జిఎస్టి- రెడీ టాలీ.ఇఆర్ పి యొక్క తాజా సమర్పణకు మీరు తరలిపోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము. ఒకే రిపోర్ట్ నుండి ఫారం జిఎస్టిఆర్ 3బి ను ఫైల్ చేయడానికి అవసరమైన సమాచారం అంతా మీకు లభించేలాగా ఇది నిర్ధారిస్తుంది. అయినప్పటికీ, మీరు అత్యంత ఇటీవలి సమర్పణకు వెంటనే తరలి వెళ్ళలేకపోవడానికి అనేకమైన కారణాలు మరియు ఆధారపడిఉండటాలు ఉండవచ్చు. చింతించ వలసిన పని ఏమీ లేదు. మీ ఫారం జిఎస్టిఆర్ 3బిని ఫైల్ చేయడానికి అవసరమైన డేటా టాలీ.ఇఆర్ పి 9 లోనే అందుబాటులో ఉంది.

మీరు టాలీ.ఇఆర్ పి 9 యొక్క తక్కువ విడుదలని ఉపయోగిస్తున్నట్లయితే మరియు ఫారం జిఎస్టిఆర్ 3బిని ఫైల్ చేయాలని చూస్తున్నట్లయితే, గతంలో విడుదల చేయబడినదానిలో అందజేయబడిన జిఎస్టిఆర్ 1 మరియు జిఎస్టిఆర్ 2 లో సంబంధిత సమాచారం మొత్తం అందుబాటులో ఉంటుంది.

• కేవలం జిఎస్టిఆర్ 1/ జిఎస్టిఆర్2 నివేదిక తెరవండి మరియు క్లిక్ చేయండి V: డిఫాల్ట్ వ్యూ. వర్గీకరణ వారీగా సమాచారం పొందడానికి F1: డిటెయిల్డ్ క్లిక్ చేయండి.
• మీకు రాష్ట్రం వారీగా లేదా ఇన్వాయిస్ వారీగా ఉన్న మరింత సమాచారం అవసరమైతే, సంబంధిత వర్గీకరణపై Enter నొక్కండి.

సమాచారం అంతా, విభిన్న పట్టికల వ్యాప్తంగా విస్తరించబడి ఉన్నప్పటికీ, మీ జిఎస్టి-రెడీ సాఫ్ట్వేర్ టాలీ.ఇఆర్ పి 9 లో మీకు అందుబాటులో ఉంటుంది.

దీనిపై మరిన్ని వివరాలు త్వరలో help.tallysolutions.com లో అందుబాటులో ఉంటాయి.

టాలీ.ఇఆర్ పి 9 లో ఫారం జిఎస్టిఆర్-3బి

ముగింపు

ఈ జిఎస్టి యొక్క ప్రయాణంలో మేము మీ వెంట నడుస్తాము మరియు ప్రతి దశలో మీ జిఎస్టి అనువర్తన అవసరాలన్నింటికీ మద్దతునిచ్చేందుకు టాలీ.ఇఆర్ పి 9 ఉండేట్లుగా నిర్ధారిస్తాము మరియు ప్రభుత్వం తాజా సూచనలు సూచించినప్పుడు వెంటనే మేము మీకు పోస్ట్ చేస్తాము.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

249,545 total views, 68 views today

Avatar

Author: Shailesh Bhatt