జిఎస్టిఆర్-3బి ఫైల్ చేసేందుకు 20 ఆగస్ట్, 2017 దగ్గరికి వచ్చేయ్యడంతో, గడువు సమయాన్ని చేరుకోవడానికి వ్యాపారాలు పూర్తిస్థాయిలో సన్నధ్ధమవుతున్నాయి. మా పూర్వపు బ్లాగ్ ‘‘ ఫారం జిఎస్టిఆర్-3బి ఫైల్ చేయడం ఎలాగ’, ఫారం జిఎస్టిఆర్-3బి అనేది మొదటి 2 నెలలు: జులై మరియు ఆగస్ట్, 2017 కోసం ఫైల్ చేయవలసిన ఒక తాత్కాలిక రిటర్న్ అని చెప్పి ఉన్నాము. అయితే, దీని అర్ధం వ్యాపారాలు ఈ జిఎస్టిఆర్-1, ఫారం జిఎస్టిఆర్-2 మరియు ఫారం జిఎస్టిఆర్-3 ను ఫైల్ చేయనవసరంలేదు అని కాదు. దీని అర్థం, జిఎస్టిఆర్-1, జిఎస్టిఆర్-2 మరియు జిఎస్టిఆర్-3 లను ఫైల్ చేయడానికి గడువు మాత్రమే పొడిగించబడిందని మరియు దిగువ పేర్కొన్న సవరణ తేదీల ప్రకారం వ్యాపారాలు ఇప్పటికీ వీటిని ఫైల్ చేయవలసిన అవసరం ఉన్నది అని:

జిఎస్టిఆర్-1, జిఎస్టిఆర్-2 మరియు జిఎస్టిఆర్-3 లను ఫైల్ చేయవలసిన గడువు తేదీ

జిఎస్టి రిటర్న్ ఫైల్ చేసేందుకు గడువు తేది
నెల జిఎస్టిఆర్-1 జిఎస్టిఆర్-2 జిఎస్టిఆర్-3
జులై, 201710 అక్టోబర్, 201731 అక్టోబర్, 201710 నవంబర్, 2017

పై తేదీలు జూలై మరియు ఆగస్టు, 2017 రిటర్నుల కోసం మాత్రమే. తరువాతి నెలల కోసం రిటర్నుల తేది (సెప్టెంబరు నుండి) రిటర్న్ నిబంధనల ప్రకారం, అంటే తదుపరి నెల 10 వ తేదీ నాటికి జిఎస్టిఆర్-1, 15 వ తేదీనాటికి జిఎస్టిఆర్-2 మరియు 20 వ తేదీ నాటికి జిఎస్టిఆర్-3 ఫైల్ చేయవలసి ఉంటుంది.

ముందస్తుగా సిధ్ధం అయ్యేందుకు ఒక చర్యగా మరియు జిఎస్టిఆర్-1 ఫైల్ చేయడాన్ని సులభం చేసేందుకు, 24 జులై, 2017 నుండి జిఎస్టి పోర్టల్ పై ఫారం జిఎస్టిఆర్-1 సృష్టించడానికి మరియు సేవ్ చేసేందుకు వికల్పం అందుబాటులో ఉంది. తరువాత, వస్తువుల లేదా సేవల గ్రహీతగా, ఫారం జిఎస్టిఆర్-2ఎలో మీ సరఫరాదారులు అప్లోడ్ చేసిన డేటాను వీక్షించే వికల్పం అందుబాటులో ఉంటుంది. ఈ బ్లాగ్లో, మేము జిఎస్టిఆర్-1 ను ఎలా ఫైల్ చేయాలనే దాని గురించి చర్చిస్తాము. సెప్టెంబర్ నుండి, జిఎస్టిఆర్-1 ను ఫైల్ చేయవలసిన గడువు తేదీ, 20 ఆగస్టు 2017 అయి ఉంటుంది.
మేము జిఎస్టిఆర్-1 ను ఎలా ఫైల్ చేయాలో చర్చించే ముందు, ఫారం జిఎస్టిఆర్-1 అసలు దేనిదాని గురించి అనేది మనం అర్థం చేసుకుందాం.

జిఎస్టిఆర్-1 అంటే ఏమిటి

ఫారం జిఎస్టిఆర్-1 అనేది ఒక సాధారణ డీలర్ ఆ నెలలో చేసిన అన్ని బాహ్య సరఫరాలను చేర్చవలసిన అవసరంగల ఒక స్టేట్మెంట్. విస్తృతంగా, నమోదైన వ్యాపారాలకు చేసిన అన్ని బాహ్య సరఫరాలు (బి2బి) ఇన్వాయిస్ స్థాయిలో చేర్చబడాలి మరియు నమోదు చేయబడని వ్యాపారాలు లేదా అంతిమ వినియోగదారులకు చేసిన సరఫరాలు రేటు-వారీగా చేర్చవలసిన అవసరం ఉంటుంది.
అయినప్పటికీ, కొన్ని ప్రత్యేక దృష్టాంతంలో, బి2సి లావాదేవీలని కూడా ఇన్వాయిస్ స్థాయిలో చేర్చవలసి ఉంటుంది.

విభిన్న రకాలైన ఫారంల యొక్క అన్వయం గురించి తెలుసుకోవడానికి, దయచేసి చదవండి జిఎస్టి క్రింద ఉన్న రిటర్నుల రకాలు ఏమిటి?

File టాలీ.ఇఆర్పి 9 ఉపయోగించి 100% ఖచ్ఛితమైన ఫారం జిఎస్టిఆర్-1 ఫైల్ చేయండి

జిఎస్టిఆర్-1 ను ఫైల్ చేయడం ఎలాగ?

జిఎస్టిఆర్-1 ఫార్మాట్లో 13 పట్టికలు ఉంటాయి, ఇందులో బాహ్య సరఫరా వివరాలను చేర్చవలసి ఉంటుంది. అన్ని వ్యాపారాల కోసం అన్ని పట్టికలు వర్తించవు కాబట్టి మీరు చింతించవలసిన అవసరం లేదు. వ్యాపార స్వభావం మరియు నెలలో ప్రభావితం అయిన సరఫరాల స్వభావం ఆధారంగా, అన్నీ కాకుండా, జిఎస్టిఆర్-1 యొక్క సంబంధిత భాగాలు మాత్రమే వర్తిస్తాయి. సవివరంగా మనం జిఎస్టిఆర్-1 ఫార్మాట్ యొక్క భాగాలను చర్చించుకుందాం.

1. జిఎస్టిఐఎన్ మరియు మునుపటి సంవత్సరంలో మొత్తం టర్నోవర్ వివరాలు.
form gstr1

పైన పట్టిక 1 లో, మీకు కేటాయించిన జిఎస్టిఐఎన్ ను మీరు చేర్చవలసి ఉంటుంది.. జిఎస్టిఐఎన్ ఆధారంగా, పట్టిక 2 (a) మరియు 2 (b) రిజిస్ట్రేషన్ లేదా నమోదు సమయంలో సమకూర్చిన వివరాలతో వాటంతట అవే నింపబడతాయి. టేబుల్ 3 (a)లో, గత ఆర్థిక సంవత్సరం మొత్తం టర్నోవర్ ని మీరు చేర్చాలి మరియు 3(b)లో, చివరి త్రైమాసికం (ఏప్రిల్ నుండి జూన్, 2017 వరకు) మొత్తంగా టర్నోవర్ ని మానవీయంగా చేర్చవలసిన అవసరం ఉంటుంది.
తదుపరి రిటర్నుల్లో త్రైమాసిక టర్నోవర్ సమాచారాన్ని చేర్చవలసిన పని లేదు మరియు గత ఆర్థిక సంవత్సరం యొక్క మొత్తం టర్నోవర్ మొదటి సంవత్సరంలో మాత్రమే పన్నుచెల్లింపుదారుల ద్వారా సమర్పించబడవలసి ఉంటుంది. తదుపరి సంవత్సరాల నుండి, ఇది దానంతట అదే నింపబడుతుంది.

2.శూన్య (జీరో) రేటెడ్ సరఫరాలు మరియు ఎగుమతులుగా భావించబడినవి (డీమ్డ్ ఎక్పోర్ట్స్) కాకుండా రిజిస్టర్డ్ వ్యక్తులకు (యుఐఎన్(UIN)- హోల్డర్లతో సహా)చేసిన పన్నుపరిధిలోకి వచ్చే బాహ్య సరఫరా.

taxable-outward-supply

పై పట్టికలో, అన్ని బి2బి సరఫరాలు (ఒక రిజిస్టర్డ్ వ్యక్తికి చేసిన బాహ్య సరఫరా) రాష్ట్రాల-మధ్య మరియు రాష్ట్రం-లోపల, రెండింటిలో బాహ్య సరఫరాలు ఇన్వాయిస్ స్థాయి రేటు-వారీ వివరాలతో చేర్చబడాలి. ఈ పట్టికలో 3 విభాగాలున్నాయి: 4A, రివర్స్ ఛార్జ్ ఆకర్షించేవి మరియు ఇ-కామర్స్ ఆపరేటర్ ద్వారా చేయబడినవి మినహా అన్ని బాహ్య సరఫరాలు; రివర్స్ ఛార్జ్ ఆకర్షించే సరఫరాలని 4B లో రేటు-వారీగా చేర్చాలి, మరియు ఇ-కామర్స్ ఆపరేటర్ ద్వారా నిర్వహించబడిన మూలం వద్ద పన్ను సేకరణను ఆకర్షించేవాటిని ఆపరేటర్-వారీగా మరియు రేటు-వారీగా వరుసగా 4C లో చేర్చాలి.

3. ఇన్వాయిస్ విలువ రూ 2.5 లక్షలకు పైగా ఉన్నచోట రిజిస్టర్ చేయబడని వ్యక్తులకు పన్ను పరిధిలోకి వచ్చే బాహ్య రాష్ట్రాల మధ్య సరఫరాలు.

taxable-outward-inter-state-supply
పై పట్టికలో, ఇంటర్-స్టేట్ బి2సి సరఫరాలు అన్నింటికీ (నమోదుకాని డీలర్ లేదా తుది వినియోగదారుకు సిన సరఫరాలు), ఇన్వాయిస్ విలువ రూ. 2,50,000 కంటే ఎక్కువగా ఉన్నచోట, మీరు ఇన్వాయిస్-వారీ మరియు రేట్-వారీ వివరాలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. పట్టిక 4 లాగానే, మీరు 5-B లో ఇ-కామర్స్ ఆపరేటర్ ద్వారా చేయబడిన సరఫరాలను ప్రత్యేకంగా చేర్చాలి మరియు ఇన్వాయిస్ విలువ రూ. 2,50,000 ఉన్న అన్ని రాష్ట్రాల-మధ్య సరఫరాలను 5A లో చేర్చాలి. ఈ రకమైన సరఫరాలను బి2సి లార్జ్ గా సూచిస్తారు.

జిఎస్టిఆర్-1 టాలీ.ఇఆర్పి 9 తో జిఎస్టిఆర్-1 ఫైల్ చేయడం సులభం మరియు ఖచ్ఛితం
4. జీరో రేట్ సరఫరా మరియు భావించబడిన ఎగుమతుల వివరాలు

zero-rated-supply
పై పట్టికలో 6లో, భారతదేశం నుండి బయటికి ఎగుమతికి సంబంధించిన సమాచారం 6A లో, ఎస్ఇజడ్ (SEZ) యూనిట్ లేదా ఎస్ఇజడ్ డెవలపర్ కు సరఫరాలను 6 B లో మరియు భావించబడిన ఎగుమతులని 6C లో చేర్చవలసి ఉంటుంది. ఈ సరఫరాల వివరాలు ఇన్వాయిస్-వారీగా మరియు రేట్-వారీగా చేర్చబడవలసిన అవసరం ఉంటుంది. ఈ వివరాలను ప్రకటించడంలో, ఈ క్రింది విషయాలను గురించి శ్రధ్ధ వహించవలసి ఉంటుంది:

  1. షిప్పింగ్ బిల్లు మరియు దాని తేదీ. . షిప్పింగ్ బిల్ యొక్క వివరాలను పోర్ట్ కోడ్ (ఆరు అంకెలు) ఆ తర్వాత షిప్పింగ్ బిల్లు యొక్క ప్రత్యేక రిఫరెన్స్ సంఖ్య చేర్చడం ద్వారా 13 అంకెలలో సమకూర్చాలి. షిప్పింగ్ బిల్లు వివరాలు జిఎస్టిఆర్-1 ఫైల్ చేసే సమయంలో అందుబాటులో లేనట్లయితే, అదేదానిని ఖాళీగా వదిలిపెట్టవచ్చు మరియు వివరాలు అందుబాటులో ఉండే తరువాతి పన్ను వ్యవధిలో కానీ పేర్కొన్న ఇన్వాయిస్ కు సంబంధించిన ఏదైనా రిఫండ్ / రిబేట్ క్లెయిమ్ చేయడానికి ముందు పట్టిక 9 లో సవరణగా అప్డేట్ చెయ్యవచ్చు.
  1. ఎస్ఇజడ్ ద్వారా డొమెస్టిక్ టారిఫ్ ఏరియా (డిటిఎ) కు ఎంట్రీ బిల్ యొక్క కవర్ లేకుండా చేయబడిన ఏదైనా సరఫరా ఎస్ఇజడ్ యూనిట్ ద్వారా జిఎస్టిఆర్-1 లో నివేదించబడవలసి ఉంటుంది. ఎస్ఇజడ్ ద్వారా ఎంట్రీ బిల్ యొక్క కవర్ పై చేయబడిన సరఫరాలు డిటిఎ యూనిట్ ద్వారా జిఎస్టిఆర్- 2లో దిగుమతులుగా తమ జిఎస్టిఆర్-2 లో నివేదించబడాలి.
  1. ఎగుమతి లావాదేవీల విషయంలో, గ్రహీత యొక్క జిఎస్టిఐఎన్ వర్తించదు మరియు దానిని ఖాళీగా వదిలిపెట్టవలసి ఉంటుంది.
    .
  1. ఐజిఎస్టి చెల్లింపు (బాండ్/లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ (ఎల్ యుటి)కింద) లేకుండా అమలుచేయబడిన ఎగుమతి లావాదేవీలు టేబుల్ 6A మరియు 6B లలో పన్ను మొత్తం శీర్షిక కింద “0” గా నివేదించబడాలి.
5. ట్టిక 5 లో కవర్ చేయబడిన సరఫరాలు కాకుండా ఇతరమైన నమోదుకాని వ్యక్తులకు పన్ను పరిధిలోకి వచ్చే సరఫరాల వివరాలు (డెబిట్ నోట్ల మరియు క్రెడిట్ నోట్ల నికరం)

taxable-supplies

ముందు పట్టికలో, అంటే, నెం. 5లో, పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి నమోదు చేయబడని వ్యక్తి (బి2సి లార్జ్) కి చేసిన రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ ఇన్వాయిస్ విలువ కలిగిన రాష్ట్రాల మధ్య చేసిన బాహ్య సరఫరాలను మాత్రమే వెల్లడించారు. ఈ పట్టికలో, అంటే పట్టిక 7లో, మీరు నమోదు చేయబడని వ్యక్తికి చేసిన అన్ని ఇతర సరఫరాలను సమకూర్చవలసి ఉంటుంది, అనగా 7A లో అన్ని రాష్ట్రం లోపల చేసిన సరఫరాలు మరియు రూ. 2.5 లక్షల వరకుగల ఇన్వాయిస్ విలువ కలిగిన రాష్ట్రాల మధ్య ఒక నమోదుచేయబడని డీలర్ కు చేసిన సరఫరాలను 7B లో మీరు చేర్చవలసి ఉంటుంది. పట్టిక 7A(1) లో, ఇ-కామర్స్ ఆపరేటర్ ద్వారా చేయబడిన సరఫరాలతో సహా మీరు నమోదు చేయబడని వ్యక్తులకు చేసిన అన్ని రాష్ట్రంలోపలి బాహ్య సరఫరాల యొక్క ఏకీకృత రేట్-వారీగా వివరాలను చేర్చవలసి ఉంటుంది. 7A (2) లో, మీరు 7A (1) లో నివేదించిన స్థూల సరఫరాల నుండి మూలం వద్ద పన్ను సేకరణను ఆకర్షించే ఇ-కామర్స్ ఆపరేటర్ ద్వారా చేయబడిన ఉత్పత్తుల వివరాలను ప్రత్యేకంగా చూపించాలి.

అదేవిధంగా, రూ. 2.5 లక్షల వరకు ఇన్వాయిస్ విలువ కలిగి ఉన్న రాష్ట్రాల మధ్య బాహ్య సరఫరాల వివరాలు, 7B (1) లో రాష్ట్రం-వారీగా మరియు రేటు వారీగా చేర్చవలసి ఉంటుంది. 7B (2) లో, మీరు 7B (1) లో నివేదించిన స్థూల సరఫరాల నుంచి ఇ-కామర్స్ ఆపరేటర్ ద్వారా సరఫరా చేయబడిన మూలం-వద్ద-పన్ను సేకరణను ఆకర్షించే సరఫరాల వివరాలను ప్రత్యేకంగా చూపించవలసి ఉంటుంది.

దయచేసి గమనించండి, పై విలువలు అన్నీ డెబిట్ నోట్ మరియు క్రెడిట్ నోట్

6. నిల్ రేటెడ్, మినహాయింపు కలిగిన మరియు జిఎస్టి కాని బాహ్య సరఫరా యొక్క వివరాలు

nill-rated

పై పట్టిక 8 లో, మీరు ఆ వ్యవధిలో చేయబడిన నిల్ రేటెడ్, మినహాయింపు కలిగిన మరియు జిఎస్టి కాని బాహ్య సరఫరాలను చేర్చాలి. ఈ వివరాలను పైన పేర్కొన్న పట్టికలో చూపిన విధంగా నమోదుచేయబడిన వ్యక్తికి చేయబడిన రాష్ట్రంలోపలి సరఫరా మరియు నమోదుచేయబడని వ్యక్తికి చేయబడిన రాష్ట్రంలోపలి సరఫరాగా 8A నుండి 8D లో వర్గీకరించాలి.

7. ప్రస్తుత వ్యవధిలో జారీచేయబడిన డెబిట్ నోట్సు, క్రెడిట్ నోట్సు, రీఫండ్ వౌచర్ల మరియు పట్టిక 4, 5 మరియు 6 లో మునుపటి పన్ను వ్యవధులకు ఫైల్ చేసిన జిఎస్టిఆర్-1 లో ఏదైనా సవరణ వివరాలు.

amendments-taxable-outward-supply

పై పట్టికలో, మీరు ఈ క్రిందివాటిల్లో ఇప్పటికే నివేదించిన సరఫరాలపై జారీ చేయబడిన డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ మరియు రిఫండ్ వౌచర్ (ముందుగానే అందుకున్న సొమ్ముకు రిటర్న్) యొక్క వివరాలను చేర్చవలసి ఉంటుంది:
బి2బి సరఫరాలు, పట్టిక 4లో నివేదించబడిన
బి2సి పెద్ద సరఫరాలు r పట్టిక 5లో నివేదించబడిన
• టేబుల్ 6 లో నివేదించబడిన ఎగుమతులు/ ఎస్ఇజడ్ యూనిట్ లేదా ఎస్ఇజడ్ డెవలపర్/ ఎగుమతులుగా భావించబడినవాటితో ప్రమేయంగల సరఫరాలు.
ఈ వివరాలు జారీచేయబడిన డెబిట్ నోట్ లేదా క్రెడిట్ నోట్ కు వ్యతిరేకంగా అసలైన ఇన్వాయిస్ నంబర్ తో పాటు, రేటు-వారీగా చేర్చబడవలసి ఉంటుంది. మొదటి మూడు నిలువు వరుసలలో, మీరు అసలు ఇన్వాయిస్ యొక్క వివరాలను పేర్కొనాలి, తర్వాత రిటర్న్ వ్యవధిలో జారీచేయబడిన క్రెడిట్ నోట్ / డెబిట్ నోట్ / రిఫండ్ వౌచర్ యొక్క రేటు-వారీగా వివరాలను చేర్చాలి.

9A పట్టికలో, షిప్పింగ్ బిల్లు సంఖ్య మరియు తేదీ అందుబాటులో లేని కారణంగా మీ మునుపటి రిటర్నుల్లో వెల్లడించబడిలేకపోతే, మునుపటి రిటర్న్ సమయంలో జరిపిన ఎగుమతి లావాదేవీలకు సంబంధించిన అటువంటి వివరాలను సవరణలుగా సమకూర్చవచ్చు. ఎగుమతి లావాదేవీలు గనక ప్రస్తుత నెలకి సంబంధించినవి అయితే, షిప్పింగ్ వివరాలను పట్టిక 6 లో నమోదు చేయాలి.

పట్టిక 9Bలో, రిటర్న్ వ్యవధిలో జారీచేయబడిన క్రెడిట్ నోట్/డెబిట్ నోట్/రిఫండ్ వౌచర్ యొక్క వివరాలను రేటు-వారీగా మరియు, ఇంతకు ముందరి రిటర్న్ వ్యవధికి సంబంధించిన ఇన్వాయిస్/అడ్వాన్సు రసీదు పై క్రెడిట్ నోట్/డెబిట్ నోట్/రిఫండ్ వౌచర్ ద్వారా చేసిన సవరణల వివరాలను పట్టిక 9C లోనూ చేర్చవలసి ఉంటుంది. అంతేకాక, నియమిత రోజుకు ముందు జారీచేయబడిన ఇన్వాయిస్లకు సంబంధించిన ఏవైనా క్రెడిట్ నోట్/ డెబిట్ నోట్ కూడా ఈ పట్టికలో నివేదించబడాలి.

8. నమోదుచేయబడని వ్యక్తికి జారీ చేయబడిన డెబిట్ నోట్ మరియు క్రెడిట్ నోట్ వివరాలు

amendments-taxable-outward-supply-unregistered
పై పట్టికలో, మీరు నమోదు చేయబడని వ్యక్తికి చేసిన రాష్ట్రం లోపలి సరఫరాలపై జారీచేయబడిన క్రెడిట్ నోట్/ డెబిట్ నోట్ వివరాలను మరియు మునుపటి రిటర్న్ వ్యవధిలో నమోదుచేయబడని వ్యక్తికి చేసిన రూ. 2.5 లక్షల కన్నా తక్కువ ఇన్వాయిస్ కలిగిన రాష్ట్రాల మధ్య సరఫరాలను ఏకీకృత రేటు-వారీగా చేర్చవలసి ఉంటుంది . ఇది ఇంతకు పూర్వపు రిటర్నులో పట్టిక 7 లో వెల్లడించిన వివరాలకు ఒక సవరణ. పట్టిక 10A మరియు 10Bలో, మీరు వరుసగా రాష్ట్రం లోపలి సరఫరాల మరియు రాష్ట్రాల మధ్య సరఫరాల రేటు-వారీ వివరాలను చేర్చవలసి ఉంటుంది. 10A మరియు 10B లలో చేర్చిన విలువలో నుంచి, రాష్ట్రంలోపలి సరఫరా కోసం 10 -A (1) మరియు రాష్ట్రాల మధ్య సరఫరాల కోసం 10B (1) లలో ఇ-కామర్స్ ఆపరేటర్ ద్వారా చేయబడిన సరుకుల వివరాలను ప్రత్యేకంగా మీరు చేర్చాలి.

9. . ప్రస్తుత పన్ను వ్యవధిలో అందుకున్న అడ్వాన్సులు/ సర్దుబాటు చేయబడిన అడ్వాన్సు లేదా మునుపటి పన్ను వ్యవధిలో సమకూర్చిన జిఎస్టిఆర్-1 కు సవరణ వివరాలు

consolidated-advance-recieved

పై పట్టిక 11 లో, మీరు ప్రస్తుత వ్యవధిలో అందుకున్న అడ్వాన్సులకు సంబంధించిన వివరాలను మరియు ఇంతకుముందు వ్యవధిలో అందుకున్న కానీ ప్రస్తుత వ్యవధిలో సర్దుబాటు చేయబడిన అడ్వాన్సుల యొక్క వివరాలను కూడా ఏకీకృత రాష్ట్రం- వారీగా మరియు రేటు- వారీగా అందజేయాలి.. పట్టిక 11Aలో, ఇన్వాయిస్ జారీ చేయబడని అడ్వాన్స్ వివరాలను చేర్చండి. ఈ వివరాలు పట్టిక 11A (1) రాష్ట్రం లోపలి సరఫరాలుగా మరియు పట్టిక 11A (2) లో రాష్ట్రాల మధ్య సరఫరాలుగా వర్గీకరించబడాలి.

పట్టిక 11B లో మరియు ప్రస్తుత పన్ను వ్యవధిలో జారీ చేయబడిన ఇన్వాయిస్ లపై మునుపటి పన్ను వ్యవధుల్లో అందుకున్న మరియు నివేదించబడిన అడ్వాన్స్ పై చెల్లించిన పన్ను సవరణకు సంబంధించిన సమాచారాన్ని కూడా మీరు చేర్చాలి..11Aలో లాగానే, ఈ వివరాలు కూడా పట్టిక 11B (1) లో రాష్ట్రం లోపలి సరఫరాలుగా మరియు పట్టిక 11B (2) లో రాష్ట్రాల మధ్య సరఫరాలుగా వర్గీకరించబడాలి.

ఇంతకు పూర్వపు రిటర్నులో పట్టిక 11A నుంచి 11B లో వెల్లడించిన వివరాలకు సంబంధించి ఏవైనా మార్పులు ఉంటే, ఆ మార్పులను పట్టిక 11 యొక్క పార్ట్ II లో సమకూర్చడం ద్వారా అవి సవరించబడవచ్చు.

దయచేసి గమనించండి, అడ్వాన్స్ అందుకున్న అదే పన్ను వ్యవధిలో ఇన్వాయిస్ జారీ చేయబడకపోతే మాత్రమే అందుకున్న అడ్వాన్సులకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అదే నెలలో గనక అడ్వాన్స్ మరియు ఇన్వాయిస్ జారీ చేయబడితే, వివరాలు పట్టిక 11 లో చేర్చవలసిన అవసరం ఉండదు.

10. బాహ్య సరఫరాల యొక్క హెచ్ఎస్ఎన్- వారీ సారాంశం

hsn-summary-outward-supplies
పై పట్టికలో, అనగా పట్టిక 12, ఒక నిర్దిష్ట హెచ్ఎస్ఎన్ కోడ్ పై సంభవించే సరఫరా యొక్క సారాంశం నివేదించబడాలి. రూ. 1.50 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ కలిగి ఉండే పన్నుచెల్లింపుదారులకు ఇది ఐఛ్ఛికంగా ఉంటుంది. అయితే, వస్తువుల వివరణ తప్పనిసరి.
మునుపటి సంవత్సరంలో వార్షిక టర్నోవర్ రూ. 1.5 కోట్లకు పైగా కానీ రూ. 5 కోట్ల వరకు ఉండే పన్ను చెల్లింపుదారులకు రెండు అంకెల స్థాయి వద్ద; మరియు రూ. 5 కోట్లకు మించిన వార్షిక టర్నోవర్ గల పన్ను చెల్లింపుదారులకు నాలుగు అంకెల స్థాయి వద్ద హెచ్ఎస్ఎన్ కోడ్ నివేదించడం తప్పనిసరి.

నాలుగవ నిలువు వరుస యుక్యుసి (UQC) యూనిట్ పరిమాణం కోడ్ ని సూచిస్తుంది మరియు పోర్టల్ సూచించిన యూనిట్ కొలత (UOM) మాత్రమే ఆమోదించబడుతుంది. అందువలన, పన్ను చెల్లింపుదారుచే నిర్వహించబడే UOM తో సంబంధం లేకుండా, క్రింద పట్టికగా ఇవ్వబడిన సూచించబడిన UQC ఉపయోగించి పరిమాణానికి సంబంధించిన వివరాలను అందజేయవలసి ఉంటుంది:

యుక్యుసి (UQC) పట్టిక
BAG- బాగ్స్CTN- కార్టన్స్MTS- మెట్రిక్ టన్TGM- టెన్ గ్రోస్
BAL- బేల్DOZ- డజన్స్NOS- నంబర్స్THD- థౌజెండ్స్
BDL- బండల్స్DRM-D డ్రమ్స్PAC- పాక్స్TON- టన్స్
BKL-కల్స్GGK-G గ్రేట్ గ్రోస్PCS-సెస్td>TUB- ట్యూబ్స్
BOU- బిలియన్ ఆఫ్ యూనిట్స్GMS- గ్రామ్స్PRS- పెయిర్స్UGS- యుఎస్ గాలన్స్
BOX- బాక్స్GRS- గ్రోస్QTL- క్వింటల్UNT- యూనిట్స్
BTL- బాటిల్స్ td>GYD- గ్రోస్ యార్డ్స్ROL- రోల్స్YDS- యార్డ్స్
BUN- బంచెస్KGS- కిలోగ్రామ్స్SET- సెట్స్OTH- అదర్స్
CAN- క్యాన్స్KLR- కిలో లీటర్SQF- స్క్వేర్ ఫీట్
CBM- క్యూబిక్ మీటర్స్KME- కిలోమీటర్SQM- స్క్వేర్ మీటర్స్
CCM- క్యూబిక్ సెంటీమీటర్స్MLT- మిల్లీమీటర్SQY- స్క్వేర్ యార్డ్స్
CMS- సెంటీమీటర్స్MTR- మీటర్స్TBS- టాబ్లెట్స్
11. పన్ను వ్యవధిలో జారీ చేయబడిన పత్రాలు

documents-issued-tax-period

పై పట్టికలో, పత్రం యొక్క ప్రారంభ మరియు ముగింపు నంబర్, రద్దు చేయబడిన పత్రం మరియు జారీచేయబడిన నికరంతో పాటు, రిటర్న్ సమయంలో జారీ చేయబడిన పత్రాల వివరాలను మీరు చేర్చవలసి ఉంటుంది.

జిఎస్టిఆర్-1 ఫారం డౌన్ లోడ్ చేసుకునేందుకు, దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి

ముగింపు

విస్తృతంగా, జిఎస్టిఆర్-1 లో చేర్చవలసిన అవసరంగల వివరాలు ఇన్వాయిస్-వారీగా, రేట్-వారీగా లేదా రాష్ట్రం-వారీగాగాని ఆ నెలలో చేసిన బాహ్య సరఫరాల వివరాలు అయి ఉంటాయి. ఈ పాటికి మీకు, జిఎస్టిఆర్-1 ను ఫైల్ చేయడంలో సమకూర్చవలసిన సమాచారం పరిమాణం గురించి కొంత అవగాహన కలిగి ఉండాలి, అలాగే ఆ విధంగా చేయడానికి అవసరమయ్యే ప్రయత్నం మరియు సమయాన్ని కూడా కొలిచి ఉండాలి. ఏవో కారణాల వలన, రిటర్నులను సకాలంలో ఫైల్ చేయకపోతే, అది మీ వ్యాపారం యొక్క ప్రతిష్ట (క్రెడిటబిలిటీ) మీద ప్రభావం చూపుతుంది. ఆ తర్వాత, ఐటిసి అనేది సరఫరాదారు కట్టుబడి ఉండటంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది మీ వినియోగదారులను కూడా ప్రభావితం చేస్తుంది. కట్టుబడి ఉండే అవసరాలను తీర్చడం వ్యాపారాలను సులభం చేసే సాఫ్ట్ వేర్ కోసం చూసేందుకు సమయం వచ్చేసింది.

ఇది కూడా చదవండి : టాలీ. ఇఆర్పి 9 ఉప

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

212,346 total views, 363 views today

Yarab A

Author: Yarab A

Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.