నవంబరు 26 , 2016 న ప్రచురితమైన సవరించబడిన డ్రాఫ్ట్ మోడల్ జిఎస్టి చట్టంలో జిఎస్టిలో ట్రాన్సిషన్ (మార్పు) నిబంధనల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సవరణచేయబడిన డ్రాఫ్ట్ చట్టంలో మార్పులతో ఈ పోస్ట్ అప్డేట్ చేయబడింది.

 

జిఎస్టి కి మార్పు చెందే తేదీన, విస్తారంగా క్రింది కేటగిరీల్లో ఏదో ఒకదాని కిందికి వచ్చే వ్యాపారాలు ఉంటాయి:

 1. ప్రస్తుత చట్టం కింద నమోదు చేసుకోవలసిన బాధ్యత లేని, కానీ జిఎస్టి కింద నమోదు చేసుకోవలసిన బాధ్యతగల వ్యాపారాలు
 2. మినహాయించబడిన సరుకు లేదా సేవల తయారీ లేదా అమ్మకంలో నిమగ్నమై ఉన్న వ్యాపారాలు
 3. మొదటి దశ డీలర్ లేదా రెండో దశ డీలర్ లేదా ఒక నమోదు చేసుకోబడిన దిగుమతిదారు

1. ప్రస్తుత చట్టం కింద నమోదు చేసుకోవలసిన బాధ్యత లేని, కానీ జిఎస్టి కింద నమోదు చేసుకోవలసిన బాధ్యతగల వ్యాపారాలు

ఒక తయారీ యూనిట్ యొక్క సరాసరి క్లియరెన్స్ విలువ గనక రూ .1.5 కోట్లు అధిగమిస్తే, సెంట్రల్ ఎక్సైజ్ చట్టం మరియు నియమాల ప్రకారం, అది నమోదు చేసుకోవడం అవసరం మరియు ఆ బాధ్యతను నిర్వర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా, వేట్ కింద, ఆర్థిక సంవత్సరంలో మీ టర్నోవర్ గనక ప్రారంభ (థ్రెష్హోల్డ్) పరిమితి దాటితే మీరు నమోదు చేసుకోవలసిన బాధ్యత ఉంటుంది. ప్రారంభ పరిమితి రాష్ట్రం నుంచి రాష్ట్రానికి భిన్నంగా ఉంటుంది.

నేడు, మీ ప్రారంభ పరిమితి సూచించిన పరిమితి మించదు కాబట్టి మీకు నమోదు చేసుకునేందుకు బాధ్యులు కాకపోవచ్చు. అయితే, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు (అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్మూ కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్) కోసం మీ ప్రారంభ పరిమితి గనక రూ.10 లక్షలు మరియు మిగితా భారతదేశం కోసం రూ. 20 లక్షలు దాటితే మీరు జిఎస్టి కింద నమోదు చేసుకోవలసిన బాధ్యత ఉంటుంది.

2. మినహాయించబడిన సరుకు లేదా సేవల తయారీ లేదా అమ్మకంలో నిమగ్నమై ఉన్న వ్యాపారాలు

ప్రస్తుతం మీరు మినహాయించబడిన సరుకు లేదా సేవల తయారీ, అమ్మకంలో నిమగ్నమై ఉండవచ్చు, కానీ జిఎస్టికి మారిన మీదట, వాటికి పన్ను విధించబడుతుంది.

3. మొదటి దశ డీలర్ లేదా రెండో దశ డీలర్ లేదా ఒక నమోదు చేసుకోబడిన దిగుమతిదారు

ఒక డీలర్ గా మీరు ఎక్సైజ్ విధించదగిన సరుకులో గనక వాణిజ్యం జరుపుతూ ఉన్నట్లయితే, మీరు సెంట్రల్ ఎక్సైజ్ కింద నమోదు చేసుకునేందుకు బాధ్యులై ఉంటారు. నేడు, ఒక మొదటి దశ లేదా రెండవ దశలో డీలర్ చెల్లించిన ఎక్సైజ్ సుంకాన్ని ఉత్పత్తి ధరకు జోడిస్తాడు కాబట్టి, మీరు చెల్లించే ఎక్సైజ్ సుంకం మీకు క్రెడిట్ గా అందుబాటులో వుండదు. అది గనక ఒక తయారీదారుకి అమ్మబడి ఉంటే, పాస్ ఆన్ చేయబడిన ఎక్సైజ్ సుంకం, కొనుగోలు చేస్తున్న తయారీదారు ద్వారా సెన్వాట్ (CENVAT) క్రెడిట్ గా క్లెయిమ్ చేయబడుతుంది.

అదేవిధంగా, మీరు గనక సరుకుని దిగుమతి చేసుకుంటూ ఉంటే ఒక దిగుమతిదారుగా మీరు సెంట్రల్ ఎక్సైజ్ క్రింద నమోదు చేసుకుని మరియు వర్తించే దిగుమతి సుంకం చెల్లించవలసి ఉంటుంది.

పైన పేర్కొన్న దృశ్యం క్రింద, ప్రతి వ్యాపారానికి ఉండగల సాధారణ ప్రశ్న ఏమిటంటే “నేను జిఎస్టి అమలుకు ముందు చివరి రోజున కలిగి ఉన్న స్టాక్ పై ఇన్పుట్ పన్ను క్రెడిట్ పొందగలుగుతానా?”

అవును, మీరు ఇన్పుట్ల క్లోజింగ్ స్టాక్ (ముడి- పదార్థాలు) లో ఉన్న సగం-తయారైన సరుకు, మరియు తయారైన సరుకు పై ఇన్పుట్ పన్ను క్రెడిట్ (సెన్వాట్, ఇన్పుట్ వేట్, ఎంట్రీ పన్ను మరియు సేవా పన్ను) పొందేందుకు అనుమతించబడతారు. అయితే, మీ క్లోజింగ్ స్టాక్ లో మీరు కలిగి ఉన్న ఇన్పుట్ పన్ను క్రెడిట్ పొందడానికి అర్హులు కావడానికి మీరు నెరవేర్చవలసిన కొన్ని పరిస్థితులు ఉన్నాయి.

మీ క్లోజింగ్ స్టాక్ లో మీరు కలిగి ఉన్న ఇన్పుట్ పన్ను క్రెడిట్ పొందడానికి అర్హత నియమాలు

మీరు మీ క్లోజింగ్ స్టాక్ లో కలిగి ఉన్న ఇన్పుట్ పన్ను క్రెడిట్ పొందవచ్చు, ఒకవేళ

  • ముగింపు స్టాక్ ముడి పదార్థాలు, సగం తయారైన సరుకులు, లేదా తయారైన సరుకుల రూపంలో గాని ఉండి పన్ను విధించదగిన సరఫరాలకు ఉపయోగించాలి లేదా ఉపయోగించడానికి ఉద్దేశించబడి ఉండాలి.
   taxable supply
  • అటువంటి క్రెడిట్ యొక్క ప్రయోజనం తగ్గింపు ధరల రూపంలో గ్రహీత కు పాస్ ఆన్ చేయబడుతుంది. ప్రస్తుత పన్ను వ్యవస్థలో ఇన్పుట్ పన్ను క్రెడిట్ అనుమతించబడదు కాబట్టి, సుంకం/ పన్ను ఉత్పత్తి ధరగా జోడించబడుతుంది. జిఎస్టికిమారిన మీదట , ఐటిసి అనుమతించబడుతుంది, మరియు ఇది సహజంగా బేస్ ధర తగ్గింపుగా మరియు ఆ తరువాత వినియోగదారులకు తగ్గించబడిన తుది ధరగా ఫలించాలి.
   Price reduction due to gst
  • మీరు జిఎస్టి కింద ఇన్పుట్ పన్ను క్రెడిట్ కి అర్హులు. జిఎస్టి లో, మీరు ఒక క్రమబధ్ధంగా పన్ను చెల్లింపుదారు అయి ఉంటే మాత్రమే ఇన్పుట్ పన్ను క్రెడిట్ కు అర్హులు కాగలరు. జిఎస్టి కింద కాంపొజిషన్ లెవీ కోసం ఎంపిక చేసుకునే ఒక పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి ఇన్పుట్ పన్ను క్రెడిట్ క్లెయిమ్ చేయడానికి అనుమతించబడరు.
   your business
  • మీ దగ్గర ఇన్పుట్ క్లోజింగ్ స్టాక్ (సగం తయారైన సరుకు మరియు తయారైన సరుకుతో సహా)కు సంబంధించి ఇన్వాయిస్లు లేదా ఏవైనా ఇతర సూచించబడిన డ్యూటి / పన్ను చెల్లింపు పత్రాలు ఉండి
   credit/debit note
  • ఇన్వాయిస్లు లేదా ఏవైనా ఇతర సూచించబడిన డ్యూటి / పన్ను చెల్లింపు పత్రాలు తేదీ జిఎస్టి కి మార్పు చెందిన తేదీ నుండి 12 నెలల లోపల ఉండాలి
   before after
  • సేవల సరఫరాదారు చట్టం కింద ఎటువంటి తగ్గింపుకోసం ( abatement) లేనివారై ఉండాలి.

 

దీనిని మనం ఒక ఉదాహరణతో అర్దం చేసుకుందాం.

రవీంద్ర ఆటోమొబైల్స్ కార్లు మరియు కారు స్పేర్ పార్ట్స్ లో ఒక నమోదిత ఎక్సైజ్ డీలర్. మార్చి 1, 2017 నాడు రవీంద్ర ఆటోమొబైల్స్ స్పేర్ పార్ట్స్ కొనుగోలు చేసింది, మరియు లావాదేవీ వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:

తేది స్టాక్ వస్తువు పరిమాణం రేటు/పరిమాణం మొత్తం విలువ వేట్ @ 14.5%ఎక్సైజ్ సుంకం 12.5%
01-03-2017స్పేర్లు50 నెంబర్లు1500 / నెంబర్లు75,00010,8759,375

 

31 మార్చి, 2017 నాటికి, రవీంద్ర ఆటోమొబైల్స్ వద్ద ఉన్న స్పేర్ల క్లోజింగ్ స్టాక్ 30 నెంబర్లు.

     • ప్రస్తుత పన్ను విధానం ప్రకారం, రవీంద్ర ఆటోమొబైల్స్ రూ 10.875 ఇన్పుట్ వేట్ ను క్రెడిట్ గా వినియోగించుకోవచ్చు, మరియు ఈ మొత్తాన్ని అవుట్పుట్ వేట్ కు వ్యతిరేకంగా సెట్ చేయవచ్చు. అయితే, ఎక్సైజ్ సుంకం అనేది ఇన్పుట్ పన్ను క్రెడిట్ గా అనుమతించబడదు. అందువలన, దానిని ఉత్పత్తి ఖర్చుకు జోడిస్తారు. ఇప్పుడు, జిఎస్టి కి మారిన మీదట రవీంద్ర ఆటోమొబైల్స్ ఎక్సైజ్ సుంకం ఇన్పుట్ పన్ను క్రెడిట్ ను వారి వద్ద ఉన్న క్లోజింగ్ స్టాక్ పై వినియోగించుకునేందుకు అనుమతించబడతారు.

మనం పై ఉదాహరణని పరిగణించి ఇన్పుట్ పన్ను క్రెడిట్ గా వినియోగించుకోదగిన క్లోజింగ్ స్టాక్ పై ఎక్సైజ్ సుంకాన్ని లెక్కిద్దాం.

31-3-2017 నాటికి క్లోజింగ్ స్టాక్30 నెంబర్లు
ప్రతి యూనిట్ కు సుంకం ( మొత్తం ఎక్సైజ్ సుంకం 9,375 / పరిమాణం 50 నెంబర్లు )187.5 / యూనిట్
క్లోజింగ్ స్టాక్ పై బ్యాలెన్స్ సుంకం (ప్రతి యూనిట్ కు సుంకం 187.5 * క్లోజింగ్ స్టాక్ 30 నెంబర్లు)5,625

 

ఇప్పుడు, రవీంద్ర ఆటోమొబైల్స్ కి వారి వద్ద ఉన్న క్లోజింగ్ స్టాక్ పై రూ 5.625 ఎక్సైజ్ సుంకాన్ని వినియోగించుకోవచ్చు అని తెలుసు, కానీ దాన్ని వినియోగించుకునేందుకు వారికి అర్హత ఉందా?

అర్హత పొందేందుకు, రవీంద్ర ఆటోమొబైల్స్ క్రింది షరతులను నెరవేర్చవలసి ఉంటుంది:

 1. దగ్గర ఉన్న క్లోజింగ్ స్టాక్ తప్పక పన్ను పరిధిలోకి వచ్చే సరఫరా కోసం ఉపయోగించాలి లేదా ఉపయోగించేందుకు ఉద్దేశించబడినదై ఉండాలి.
  అవును, క్లోజింగ్ స్టాక్ అయిన 30 నెంబర్లు, పన్ను పరిధిలోకి వచ్చే సరఫరాలకు ఉపయోగించబడతాయి.
 2. అటువంటి క్రెడిట్ యొక్క ప్రయోజనం, తగ్గిన ధరల రూపంలో, గ్రహీతకు పాస్ ఆన్ చేయబడాలి.
  ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ అందుబాటులో ఉంది కనుక, రవీంద్ర ఆటోమొబైల్స్ ఇక ఎంతమాత్రమూ దీనిని ఉత్పత్తి ఖర్చుకు జోడించదు. ఫలితంగా బేస్ ధర తగ్గుతుంది, తత్ఫలితంగా ధరలో తగ్గింపుగా పరిణమిస్తుంది.
 3. వారు జిఎస్టి కింద ఇన్పుట్ పన్ను క్రెడిట్ కు అర్హులు.
 4. వారి దగ్గర ఇన్పుట్ల క్లోజింగ్ స్టాక్ (సగం తయారైన సరుకు మరియు తయారైన సరుకుతో సహా)కు సంబంధించి ఇన్వాయిస్లు లేదా ఏవైనా ఇతర సూచించబడిన డ్యూటి / పన్ను చెల్లింపు పత్రాలు ఉండాలి.
  రవీంద్ర ఆటోమొబైల్స్ దగ్గర, 30 నెంబర్లకి సంబంధించి వారి సరఫరాదారు (తయారీదారు) ద్వారా జారీచేయబడిన రూల్ 11 ఇన్వాయిస్ ఉంది. వారి ఉత్పత్తుల సరఫరా జారీ ముగింపు స్టాక్ ఉంది.
 5. ఇన్వాయిస్లు లేదా ఏవైనా ఇతర సూచించబడిన డ్యూటి / పన్ను చెల్లింపు పత్రాలు తేదీ జిఎస్టి కి మార్పు చెందిన తేదీ నుండి 12 నెలల లోపల ఉండాలి
  వారి దగ్గర ఉన్న 30 నెంబర్ల క్లోజింగ్ స్టాక్ అనేది 1-3-2017 తేదినాడు చేసిన కొనుగోలుకు ప్రతిగా ఉన్నది, ఇది 12 నెలల్లోపలే ఉంది, జిఎస్టి 1-4-2017 నాడు అమలులోకి వస్తుందని భావిస్తూ.

రవీంద్ర ఆటోమొబైల్స్ పై అన్ని షరతులని నెరవేర్చుతుంది మరియు రూ 5.625 ఎక్సైజ్ సుంకాన్ని సిజిఎస్టి ఇన్పుట్ పన్ను క్రెడిట్ గా వినియోగించుకోగల అర్హత కలిగి ఉంది.

 

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

287,707 total views, 1 views today