ఉత్పాదక రంగం అనేది మన జిడిపికి రెండవ అతిపెద్ద దోహదకారి. జాతీయ ఇ-పాలన పథకం కింద మేక్-ఇన్-ఇండియా, ఇన్వెస్ట్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా మరియు ఇ-బిజ్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ రూపంలో ప్రభుత్వం ద్వారా చేపట్టబడిన అనేక కొత్త ప్రతిపాదనలు దేశంలో పెట్టుబడి పెట్టడానికి మరియు వ్యాపారం చేయడం సులభతరం చేయటానికి దోహదపడుతున్నాయి. అనేక రంగాలలో భారతీయ తయారీ కంపెనీలు గ్లోబల్ మార్కెట్లను లక్ష్యంగా పెట్టుకున్నాయి మరియు ప్రపంచవ్యాప్తంగా అదరగొట్టే పోటీదారులుగా తయారవుతున్నాయి.

ఉద్యోగ పని అనేది తయారీ పరిశ్రమలో ఒక సమగ్ర అంశం. తయారీదారులు సాధారణంగా తమ కార్యకలాపాలలో ఒక భాగాన్ని తృతీయ వ్యక్తికి అవుట్సోర్స్ చేస్తారు. ఇది ఖర్చు తక్కువగా మారుతుంది మరియు వారి ప్రధాన కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించి వారిని మరింత ఉత్పాదకరంగా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. తృతీయ వ్యక్తికి పని మొత్తం లేదా కొంత భాగాన్ని అవుట్సోర్సింగ్ చేసే ప్రక్రియను ‘ఉద్యోగ పని’ అని పిలుస్తారు. ఈ కార్యకలాపం అనేది ఉత్పాదక చక్రంలో ఏ దశలోనైనా ఉండవచ్చు, మరియు ఉద్యోగ పని కోసం పంపిన వస్తువులు ముడి పదార్థాలు లేదా పాక్షికంగా పూర్తయిన వస్తువులు లేదా క్యాపిటల్ సరుకు అయి ఉండవచ్చు. ఉద్యోగపని కోసం వస్తువులను పంపే తయారీదారుని సాధారణంగా ‘ప్రిన్సిపల్’ అని సూచిస్తారు మరియు ఉద్యోగ పని కార్యకలాపాన్ని నిర్వర్తిస్తున్న వ్యక్తిని ‘ఉద్యోగ కార్మికుడు’ అని పిలుస్తారు.
ప్రస్తుత పన్ను వ్యవస్థలో ఉద్యోగ పని ఎలా వ్యవహరించబడుతుందో మరియు జిఎస్టి వ్యవస్థ లో అది ఎలా విభిన్నంగా ఉంటుందో మనం అర్థం చేసుకుందాం.

ప్రస్తుత వ్యవస్థ

అర్ధం

ఉద్యోగ పని అంటే ప్రక్రియకు అత్యంత ముఖ్యమైన ఏదైనా వస్తువు లేదా కార్యకలాపాన్ని తయారుచేయడం లేదా ఫినిషింగ్ చేయడంగా ఫలించే ఒక ప్రక్రియ యొక్క ఒక భాగం లేదా మొత్తాన్ని పూర్తి చేయటానికి ఒక ఉద్యోగకార్మికుని సరఫరా చేయబడే ముడి పదార్థం లేదా పాక్షికంగా పూర్తిచేయబడిన వస్తువులపై ప్రాసెస్ చేయడం లేదా పని చేయడం అని అర్థం. దీని అర్ధం ఇంకా ఇలా ఉంటుంది:

  1. 1.తయారీదారుచే కార్యకలాపం పూర్తయిన వస్తువుల తయారీ లేదా పూర్తి చేయటంగా ఫలించాలి లేదా ఉత్పత్తి ప్రక్రియలో ముఖ్యమైన కార్యకలాపం అయి ఉండాలి.
  2. 2. ప్రిన్సిపల్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది అసంబద్ధమైనది. పంపించబడిన వస్తువులు ఒక నమోదుకాని వ్యక్తికి చెందినప్పటికీ, ఈ పని ఉద్యోగ పనిగా పరిగణించబడుతుంది.
ఇన్పుట్ పన్ను క్రెడిట్

ఉద్యోగం పని కోసం పంపబడిన ఇన్పుట్లు (వస్తువులు) లేదా మూలధన వస్తువులు, వాటిని ఉద్యోగపని కోసం పంపిన వరుసగా 180 రోజుల్లోపు లేదా 1 సంవత్సరానికి అవి గనక తిరిగి వస్తే, ప్రిన్సిపల్ కు ఇన్పుట్ పన్ను క్రెడిట్ కు అర్హత ఉంటుంది.

వర్తించే పన్నులు

కార్యకలాపం గనక ఉత్పత్తి చేయడంతో సమానమైనదై ఉంటే, ఉద్యోగ కార్మికుని ద్వారా ఎక్సైజ్ సుంకం చెల్లించబడవలసి ఉంటుంది. అయితే, ప్రిన్సిపల్ ద్వారా ఒక ప్రకటన సమకూర్చినప్పుడు, ఉద్యోగ కార్మికుడు ఎక్సైజ్ సుంకం నుండి మినహాయించబడతారు.
కార్యకలాపం గనక ఉత్పత్తి చేయడంతో సమానమైనది కాకపోతే, సేవా పన్ను వర్తిస్తుంది. అయితే, ఉద్యోగ కార్మికుడు సేవా పన్ను నుండి మినహాయింపు పొందటానికి అర్హులు.

ఉద్యోగ కార్మికుడి ద్వారా వసూలు చేయబడే ప్రాసెసింగ్ ఛార్జీలు – ఉద్యోగ కార్మికుడు వసూలు చేసే ప్రాసెసింగ్ ఛార్జీలపై సేవాపన్ను వర్తించదు.

ఉద్యోగ కార్మికునికి పంపిన అచ్చులు మరియు రంగులు, కూర్చేవి మరియు బిగించేవి లేదా ఉపకరణాలు – ఉద్యోగ కార్మికునికి పంపిన అచ్చులు మరియు రంగులు, కూర్చేవి మరియు బిగించేవి లేదా ఉపకరణాలపై ఏ పన్ను వర్తించదు.

ఉద్యోగం పని సమయంలో ఉత్పత్తి అయిన వ్యర్ధం లేదా తుక్కు – ఉద్యోగం పని సమయంలో ఉత్పత్తి అయిన ఏదైనా వ్యర్ధం లేదా తుక్కు, అతను / ఆమె గనక రిజిస్టర్ చేసుకుని ఉంటే పన్ను చెల్లింపుతో, నేరుగా తన వ్యాపార స్థలం నుండి ఉద్యోగం కార్మికుని ద్వారా, లేదా ఉద్యోగ కార్మికులు గనక రిజిస్టర్ చేసుకుని ఉండకపోతే ప్రిన్సిపల్ ద్వారా సరఫరా చేయబడవచ్చు.

జిఎస్టి వ్యవస్థ

అర్ధం

జిఎస్టి కింద, ఉద్యోగం పని అంటే మరొక రిజిస్టర్ చేయబడిన వ్యక్తికి చెందిన వస్తువులపై ఒక వ్యక్తి ద్వారా చేపట్టబడిన ఏదైనా ట్రీట్మెంట్ లేదా ప్రక్రియ. నిర్వచనంలో మార్పు 2 విషయాలను సూచిస్తుంది:

  1. ఆ కార్యకలాపం తయారీగా పరిణమించిందా లేదా తయారీ కార్యక్రమాలను పూర్తి చేయటానికి ఒక అతి ముఖ్య కార్యకలాపమా అనేదానితో సంబంధం లేకుండా, ఉద్యోగ కార్మికుని ద్వారా చేయబడే ఏదైనా ట్రీట్మెంట్ లేదా ప్రక్రియని కలిగి ఉండేందుకు, ఉద్యోగ పనిని మరింత విశాల దృష్టితో నిర్వచిస్తారు.
  2. ఒక ఉద్యోగ కార్మికుని ద్వారా చేపట్టబడే ట్రీట్మెంట్ లేదా ప్రక్రియ అనేది నమోదు చేయబడిన వ్యక్తికి చెందిన వస్తువులపై పని చేసినప్పుడు మాత్రమే అది ఉద్యోగపని అవుతుంది. అందువల్ల, వస్తువులు పన్ను విధించదగినవి అయినప్పటికీ, నమోదుకాని వ్యక్తికి చెందినవి అయితే, ఈ పని ఉద్యోగ పనిగా పరిగణించబడదు. ఇది, ప్రిన్సిపల్ నమోదు చేసుకోవడం అనేది అసంబధ్ధమైన ప్రస్తుత వ్యవస్థ నుండి ఒక ప్రధాన మార్పు.
ఇన్పుట్ పన్ను క్రెడిట్ (ఐటిసి)

ఉద్యోగపని కోసం పంపిన ఇన్పుట్స్ మరియు క్యాపిటల్ వస్తువులపై ఐటిసికి ప్రిన్సిపల్ అర్హులై ఉంటారు.

వర్తించే పన్నులు

ఉద్యోగ పనుల కోసం ఇన్పుట్స్ లేదా మూలధన వస్తువులు పంపినప్పుడు ఏ పన్ను వర్తించదు. ఉద్యోగ పని కోసం వస్తువులను తొలగించే సమయంలో, ప్రిన్సిపాల్ ఒక డెలివరీ చలాన్ జారీ చేయవచ్చు. జారీచేయవలసిన డెలివరీ చలాన్ యొక్క నమూనా ఫార్మాట్ ఇక్కడ ఇవ్వబడింది.

ఉద్యోగ పని కోసం పంపిన ఇన్పుట్స్ లేదా క్యాపిటల్ వస్తువులు వరుసగా 1 సంవత్సరము లేదా 3 సంవత్సరాలలో తిరిగి తీసుకురాబడినప్పుడు

ఉద్యోగ పని కోసం పంపిన ఇన్పుట్స్ లేదా క్యాపిటల్ వస్తువులు అవి ఉద్యోగపని కోసం పంపించబడిన దగ్గర్నుంచి వరుసగా 1 సంవత్సరము లేదా 3 సంవత్సరాలలో ప్రిన్సిపల్ యొక్క వ్యాపార స్థానానికి తిరిగి తీసుకురాబడినప్పుడు ఏ పన్ను వర్తించదు.

ఉదాహరణ: ఒక నమోదిత దుస్తులు తయారీదారు రాజేష్ అప్పారెల్స్, ఒక నమోదిత ఉద్యోగ కార్మికుడైన, రమేష్ ఎంబ్రాయిడర్స్ కు దుస్తుల పై ఎంబ్రాయిడరీ పని కోసం 100 కుర్తాలను ఆగష్టు 1, ’17, నాడు పంపుతారు. ఎంబ్రాయిడరీ పని పూర్తయిన తర్వాత 10 అక్టోబరు’17 వ తేదీన రమేష్ ఎంబ్రాయిడర్స్ రాజేష్ అప్పారెల్స్ కి కుర్తాలను తిరిగి ఇస్తారు.
ఇక్కడ, పంపించబడిన 1 సంవత్సరం లోపల రాజేష్ అప్పారల్స్ వారి వ్యాపార స్థలానికి కుర్తాలు తిరిగి తీసుకుని రాబడ్డాయి కాబట్టి ఏ పన్ను వర్తించదు.

ఉద్యోగ పని కోసం పంపించబడిన ఇన్పుట్లు లేదా క్యాపిటల్ వస్తువులు ఉద్యోగ కార్మికుని స్థానం నుండి వరుసగా 1 సంవత్సరం లేదా 3 సంవత్సరాల్లో సరఫరా చేయబడినప్పుడు.

ఉద్యోగ పని కోసం పంపించబడిన ఇన్పుట్లు లేదా క్యాపిటల్ వస్తువులు ఉద్యోగ కార్మికుని స్థానం నుండి వరుసగా 1 సంవత్సరం లేదా 3 సంవత్సరాల్లో సరఫరా చేయబడినప్పుడు, సరఫరా గనక భారతదేశం లోపల అయితే పన్ను వర్తిస్తుంది. సరఫరా గనక ఎగుమతి నిమిత్తం అయితే, ఏ పన్ను వర్తించదు.
ఉద్యోగి కార్మికుని వ్యాపార స్థలం నుండి ఇన్పుట్లను లేదా క్యాపిటల్ వస్తువులను సరఫరా చేయడానికి, ఉద్యోగ కార్మికుని వ్యాపార స్థలాన్ని ప్రిన్సిపల్ తన అదనపు వ్యాపార స్థానంగా ప్రకటించాల్సి ఉంటుంది, ఇలా అయితే తప్ప –

  1. ఉద్యోగ కార్మికుడు రిజిస్టర్ చేయబడినవారు లేదా
  2. సరఫరా సూచించబడిన (నోటిఫైడ్) వస్తువులది
ఉదాహరణ: రాజేష్ అప్పారెల్స్ వారు 15 సెప్టెంబర్ ‘17 నాడు ‘దుస్తులపై ఎంబ్రాయిడరీ పని కోసం రమేష్ ఎంబ్రాయిడర్స్ కు 200 కుర్తాలు పంపుతారు, 17’. ఎంబ్రాయిడరీ పని తర్వాత, తమిళనాడులోని రమేష్ ఎంబ్రాయిడర్స్ యొక్క వ్యాపార స్థలం నుండి తమిళనాడులోని ఒక కస్టమర్ కు డిసెంబర్ 25 వ తేదీన కుర్తాలు సరఫరా చేయబడ్డాయి.
ఇక్కడ, రమేష్ ఎంబ్రాయిడర్స్ వ్యాపార స్థలం నుండి కుర్తాలు సరఫరా చేయబడినప్పుడు, రాజేష్ అప్పారల్స్ కు వర్తించే రేటులో పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది.
ఉద్యోగ కార్మికుల వ్యాపార స్థలం నుండి వస్తువులు సరఫరా చేయబడినప్పుడు, ఉద్యోగ కార్మికుడు రిజిస్టర్ చేయబడి ఉన్నప్పటికీ, సరఫరా అనేది ప్రిన్సిపల్ ద్వారా సరఫరాగా వ్యవహరించబడుతుంది మరియు వస్తువుల విలువ ఉద్యోగ కార్మికుల సమిష్టి టర్నోవర్లో చేర్చబడదు.

ఉద్యోగ కార్మికుల వ్యాపార స్థలం నుండి వస్తువులు సరఫరా చేయబడినప్పుడు, ఉద్యోగ కార్మికుడు రిజిస్టర్ చేయబడి ఉన్నప్పటికీ, సరఫరా అనేది ప్రిన్సిపల్ ద్వారా సరఫరాగా వ్యవహరించబడుతుంది మరియు వస్తువుల విలువ ఉద్యోగ కార్మికుల సమిష్టి టర్నోవర్లో చేర్చబడదు.

ఉద్యోగ పని కోసం పంపించబడిన ఇన్పుట్లు లేదా క్యాపిటల్ వస్తువులు వరుసగా 1 సంవత్సరం లేదా 3 సంవత్సరాలలో ఉద్యోగ కార్మికుని యొక్క స్థానం నుండి తిరిగి తీసుకుని రాబడకపోయి లేదా సరఫరా చేయబడనప్పుడు

ఉదాహరణ రాజేష్ అప్పారెల్స్, దుస్తుల పై ఎంబ్రాయిడరీ పని కోసం , రమేష్ ఎంబ్రాయిడర్స్ కు 10 అక్టోబర్, ‘17నాడు 150 కుర్తాలు పంపుతారు. ఆ కుర్తాలు 10 అక్టోబర్ ’18 నాటి వరకు రాజేష్ అప్పారెల్స్ వారి వ్యాపార స్థానానికి తీసుకుని రాబడలేదు.
ఇక్కడ, 10 అక్టోబర్, ‘17నాడు రాజేష్ అప్పారల్స్ ద్వారా ఈ కుర్తాలు రమేష్ ఎంబ్రాయిడర్స్ కు సరఫరా చేయబడినవిగా పరిగణించబడతాయి, మరియు రాజేష్ అప్పారల్స్ కు వడ్డీతో సహా సరఫరాపై పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది.

ఉద్యోగ పని కోసం పంపించబడిన ఇన్పుట్లు, ఉద్యోగ పని కోసం పంపించబడినప్పటినుంచి 1 సంవత్సరంలోపల ఉద్యోగ కార్మికుని యొక్క వ్యాపార స్థానం నుండి తిరిగి తీసుకుని రాబడకపోయి లేదా సరఫరా చేయబడనప్పుడు లేదా ఉద్యోగ పని కోసం పంపించబడిన క్యాపిటల్ వస్తువులు 3 సంవత్సరాలలో ఉద్యోగ కార్మికుని యొక్క వ్యాపార స్థానం నుండి తిరిగి తీసుకుని రాబడకపోయినా లేదా సరఫరా చేయబడకపోయినా వాటిని బయటికి పంపించిన రోజున అవి ఉద్యోగ కార్మికునికి ప్రిన్సిపల్ ద్వారా సరఫరా చేయబడినట్లుగా పరిగణిస్తారు. అందువల్ల, వడ్డీతో సహా పన్ను చెల్లించవలసిన బాధ్యత ప్రిన్సిపల్ కు ఉంటుంది.

గమనిక:  మొదట వాటిని ప్రిన్సిపల్ యొక్క వ్యాపార స్థానానికి తీసుకురాకుండా ఇన్పుట్లు లేదా క్యాపిటల్ వస్తువులను ఉద్యోగ కార్మికుని వద్దకు పంపవచ్చు. ఈ సందర్భంలో, వరుసగా 1 సంవత్సరం మరియు 3 సంవత్సరాల వ్యవధి అనేది, ఉద్యోగ కార్మికుడు ఇన్పుట్లను లేదా క్యాపిటల్ వస్తువులని అందుకున్న తేదీ నుండి లెక్కించబడుతుంది.

ఉద్యోగ కార్మికుని ద్వారా వసూలు చేయబడే ప్రాసెసింగ్ ఛార్జీలు

ఉద్యోగ కార్మికుని ద్వారా వసూలు చేయబడే ప్రాసెసింగ్ ఛార్జీలపై జిఎస్టి వర్తిస్తుంది.

ఉదాహరణ:: రాజేష్ అప్పారల్స్ నుండి ఆగష్టు 17 న అందుకున్న ఉద్యోగ పని ఆర్డర్ కోసం రమేష్ ఎంబ్రాయిడర్స్ రూ .10,000 వసూలు చేస్తారు.
ఇక్కడ, రమేష్ ఎంబ్రాయిడర్స్ ఎంబ్రాయిడరీ ఛార్జీల మీద 5% (వస్త్ర ఉద్యోగ పని ఛార్జీలకు వర్తించే రేటు) జిఎస్టి ని వసూలు చేయాలి.

ఉద్యోగ పని నిమిత్తం పంపించబడిన అచ్చులు మరియు రంగులు, కూర్చేవి మరియు బిగించేవి లేదా ఉపకరణాలు –

ఉద్యోగ పని నిమిత్తం ఉద్యోగ కార్మికునికి పంపించబడిన అచ్చులు మరియు రంగులు, కూర్చేవి మరియు బిగించేవి లేదా ఉపకరణాలపై ఏ పన్ను వర్తించదు.

ఉద్యోగ పనిలో ఉత్పన్నం చేయబడిన వ్యర్ధం లేదా తుక్కు

ఉద్యోగం పని సమయంలో ఉత్పత్తి అయిన ఏదైనా వ్యర్ధం లేదా తుక్కు, అతను / ఆమె గనక రిజిస్టర్ చేసుకుని ఉంటే పన్ను చెల్లింపుతో, నేరుగా తన వ్యాపార స్థలం నుండి ఉద్యోగం కార్మికుల ద్వారా సరఫరా చేయబడవచ్చు. ఉద్యోగ కార్మికులు గనక రిజిస్టర్ చేసుకుని ఉండకపోతే ప్రిన్సిపల్ పన్ను చెల్లించడం ద్వారా అదే దానిని సరఫరా చేయవచ్చు.

 ముగింపు

జిఎస్టి కింద ఉద్యోగ పని యొక్క పన్ను వ్యవహరింపు చాలావరకు ప్రస్తుత వ్యవస్థలో లాగానే ఉంటుంది.
గమనించదగ్గ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉద్యోగ కార్మికుని స్థలం నుంచి ఇన్పుట్లను తిరిగి తీసుకురావలసిన లేదా సరఫరా చేయబడవలసిన కాలం ఇప్పుడు 180 రోజులకు బదులుగా 1 సంవత్సరం అయింది. అదేవిధంగా, క్యాపిటల్ వస్తువులు తిరిగి తీసుకురావలసిన లేదా సరఫరా చేయబడవలసిన కాలం ఇప్పుడు ఇంతకు ముందులాగా 1 సంవత్సరం కాక 3 సంవత్సరాలు అయింది. అంతేగాక, ఉద్యోగ కార్మికులు వసూలు చేసిన ప్రాసెసింగ్ ఛార్జీలపై జిఎస్టి ఇప్పుడు విధించబడుతుంది.
ఉత్పాదక పరిశ్రమ కోసం, ఈ నిబంధనలు సానుకూలంగా ఉంటాయి మరియు ఈ రంగానికి ప్రభుత్వం యొక్క స్పష్టమైన మద్దతుకు అనుగుణంగా ఉంటాయి.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

209,802 total views, 218 views today