వీరికి బిల్లు చేయండి-వీరికి షిప్ చేయండి నమూనాలో, బిల్లింగ్ మరియు షిప్పింగ్ రెండు రాష్ట్రాలు మరియు రెండు ఎంటిటీలకు చేయబడుతుంది. లావాదేవీ క్రమం ద్వారా అనేక పన్నులు ఒకదానిపై ఒకటి దొంతరగా పడిపోవడాన్ని నివారించేందుకు, మొదటి అమ్మకం పన్ను పరిధిలోకి వచ్చేదై ఉంటుంది, మరియు వస్తువుల తరలింపు సమయంలో ఏదైనా తర్వాతి అమ్మకం పన్ను నుంచి మినహాయించబడి ఉంటుంది. నేడు, వీరికి బిల్ చేయండి -వీరికి షిప్ చేయండి లావాదేవీలు సర్వసాధారణంగా సంభవిస్తున్నాయి.

‘వీరికి బిల్ చేయండి -వీరికి షిప్ చేయండి’ లావాదేవీలను మనం ఒక ఉదాహరణతో అర్ధం చేసుకుందాం.

మహారాష్ట్రలో ఉన్న హార్డ్వేర్ సరుకుల్లో ఒక డీలర్ అయిన గణేష్ ట్రేడర్స్, కర్ణాటక రాష్ట్రంలోని మారుతి ట్రేడర్స్ నుండి ఒక ఆర్డర్ పొందుతుంది. 100 అల్యూమినియం నిచ్చెనల సరఫరా కోసం అది ఒక ఆర్డర్, దాని వెంట తమిళనాడులోని ప్రైమ్ హార్డ్ వేర్స్ కు నిచ్చెనలను షిప్ చేయవలసిందిగా ఒక సూచన కూడి ఉంది. ప్రైమ్ హార్డ్ వేర్స్ వారు మారుతి ట్రేడర్స్ కు ఒక వినియోగదారులు.

ఈ లావాదేవీకి రెండు భాగాలు ఉన్నాయి:

  • లావాదేవీ మొదటి భాగం – గణేష్ ట్రేడర్స్ మరియు మారుతి ట్రేడర్స్ మధ్య: : గణేష్ ట్రేడర్స్ నిచ్చెనల సరఫరాదారు మరియు మారుతి ట్రేడర్స్ వాటికి కొనుగోలుదారు. దీని ప్రకారంగా, గణేష్ ట్రేడర్స్ లావాదేవీలని మారుతి ట్రేడర్స్ కు బిల్లింగ్ చేస్తారు, మరియు సూచనల ప్రకారం, సరుకును తమిళనాడులో ప్రైమ్ హార్డ్ వేర్స్ కు షిప్పింగ్ చేస్తారు.
  • లావాదేవీ యొక్క రెండవ భాగం – మారుతి ట్రేడర్స్ మరియు ప్రైమ్ హార్డ్ వేర్స్ మధ్య: మారుతి ట్రేడర్స్ సరఫరాదారు మరియు ప్రైమ్ హార్డ్ వేర్స్ కొనుగోలుదారు. మారుతి ట్రేడర్స్ లావాదేవీని ప్రైమ్ హార్డ్ వేర్స్ కు బిల్లింగ్ చేస్తారు, మరియు ప్రైమ్ హార్డ్ వేర్స్ కు అనుకూలంగా లారీ రశీదు (గణేష్ ట్రేడర్స్ ద్వారా ఒక లారీలో సరుకు రవాణా చేయబడింది) ఆమోదిస్తారు. ఈ లారీ రసీదు (ఎల్ఆర్) ప్రైమ్ హార్డ్ వేర్స్ సరుకు డెలవరీ అందుకునేందుకు వీలుకల్పిస్తుంది.

జిఎస్టిలో ‘వీరికి బిల్ చేయండి -వీరికి షిప్ చేయండి’ లావాదేవీలను మనం అర్ధం చేసుకునేందుకు సాగే ముందు, ఈ లావాదేవీలు ప్రస్తుత విధానంలో ఏ విధంగా పన్ను విధించబడతాయో మనం అర్ధం చేసుకుందాం.

ప్రస్తుత విధానం: వీరికి బిల్ చేయండి -వీరికి షిప్ చేయండి’ లావాదేవీలు ఏ విధంగా పన్ను విధించబడతాయి.

వీరికి బిల్ చేయండి -వీరికి షిప్ చేయండి లావాదేవీల్లో, ఒక మొదటి అమ్మకం మరియు ఆ తర్వాత మరొక అమ్మకం ఉంటుంది. ప్రస్తుత విధానంలో, లావాదేవీ యొక్క రెండు భాగాలపైన పన్ను విధించవలసి ఉంటుంది – గణేష్ ట్రేడర్స్ ద్వారా మారుతి ట్రేడర్స్ కు మొదటి అమ్మకం పైన, మరియు ఆ తర్వాత మారుతి ట్రేడర్స్ నుంచి ప్రైమ్ హార్డ్ వేర్స్ కు జరిగిన అమ్మకం పైన.
అయితే, లావాదేవీ సమయంలో పన్ను అనేకసార్లు లెక్కించబడటాన్ని నివారించేందుకు తదుపరి అమ్మకాలపై మినహాయింపులు అందించబడ్డాయి. అయితే ఈ మినహాయింపులు, సూచించబడిన ఫారంలను అందజేయడానికి లోబడి ఉంటాయి. తదుపరి అమ్మకంపై మినహాయింపును పొందేందుకు, మొదటి విక్రేత ద్వారా ఒక డిక్లరేషన్ ఫారం ఇ1 జారీ చేయబడవలసి ఉంటుంది, మరియు 2% తగ్గించబడిన ధర వద్ద సిఎస్టి విధించబడేందుకు కొనుగోలుదారు ద్వారా సి-ఫారం జారీ చేయబడవలసి ఉంటుంది.

దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం.

Bill to ship to transactions in GST

పై ఉదాహరణలో, గణేష్ ట్రేడర్స్ మారుతీ ట్రేడర్స్ కు బిల్లు చేసి, సరుకుని ప్రైమ్ హార్డ్ వేర్స్ కు రవాణా చేస్తారు. గణేష్ ట్రేడర్స్ మారుతి ట్రేడర్స్ కు ఫారం ఇ1 జారీచేస్తారు, మరియు సిఎస్టిని @ 2% వినియోగించుకునేందుకు మారుతి ట్రేడర్స్ ద్వారా సి ఫారం అందజేయబడుతుంది. తదనంతరం, పన్ను వసూలు విధించకుండా, మారుతి ట్రేడర్స్ వారు ప్రైమ్ హార్డ్ వేర్స్ కు బిల్లు చేస్తారు, మరియు ప్రైమ్ హార్డ్ వేర్స్ కు అనుకూలంగా లారీ రసీదుని ఎండార్స్ చేస్తారు.

జిఎస్టి కింద వీరికి బిల్ చేయండి -వీరికి షిప్ చేయండి లావాదేవీలని వ్యవహరించడం

జిఎస్టి కింద, లావాదేవీ అంతర్రాష్టమైనదా లేదా రాష్ట్రంలోపల జరిగినదా అనేది గుర్తించడానికి వస్తువుల సరఫరాచేయబడిన స్థానం అనేది అత్యంత కీలకం. దీని ప్రకారం, వర్తించే పన్నులు విధింపచేయబడవచ్చు. మేము మా బ్లాగ్ జిఎస్టిలో సరఫరా ప్రదేశం ఏది అనేదానిలో.సరఫరా చేయబడిన ప్రదేశం గురించి చర్చించాము.

జిఎస్టి కింద, లావాదేవీ రాష్ట్రాలమధ్య జరిగినదా లేదా రాష్ట్రంలోపల జరిగినదా అనేది గుర్తించడానికి వస్తువుల సరఫరాచేయబడిన స్థానం అనేది అత్యంత కీలకం.Click To Tweet

జిఎస్టి లో, సరుకు గనక ఒక తృతీయ పక్షం నిర్దేశం పై సరఫరాదారు ద్వారా అందుకునేవారికి సరఫరాచేయబడి ఉన్నట్లయితే, తృతీయ పక్షం సరుకుని అందుకున్నట్లుగా భావించబడుతుంది, మరియు సరఫరా ప్రదేశం అనేది అటువంటి తృతీయ పక్షం యొక్క ప్రధాన వ్యాపార ప్రదేశం అయి ఉంటుంది. దీనిని మనం ఒక ఉదాహరణతో అర్ధం చేసుకుందాం.

గణేష్ ట్రేడర్స్ అనేవారు మహారాష్ట్రలో ఉన్న హార్డ్వేర్ సరుకుల్లో ఒక డీలర్. వీరు తమిళ నాడులో ఉన్న ప్రైమ్ హార్డ్ వేర్స్ కు నిచ్చెనలు రవాణాచేయవలసింది అనే ఒక సూచనతో, కర్ణాటకలో ఉన్న మారుతీ ట్రేడర్స్ నుంచి 100 అల్యూమినియం నిచ్చెనలు సరఫరా చేయవలసిందిగా ఒక ఆర్డర్ అందుకుంటారు.

Managing bill to ship to transactions under GST

ఉదాహరణలో, మారుతీ ట్రేడర్స్ నుండి సూచన పై, గణేష్ ట్రేడర్స్ అల్యూమినియం నిచ్చెనలను తమిళనాడులోని ప్రైమ్ హార్డ్ వేర్స్ కు రవాణా చేస్తారు. ఇక్కడ, మారుతీ ట్రేడర్స్ ని తృతీయపక్షంగా భావించడం జరుగుతుంది. అందువలన, సరఫరా స్థానం అనేది తృతీయ పక్షం యొక్క ప్రధాన వ్యాపార ప్రాంతం అయి ఉంటుంది, అంటే కర్ణాటక. దీని ప్రకారంగా, గణేష్ ట్రేడర్స్ మారుతి ట్రేడర్స్ కు బిల్లింగ్ లో ఐజిఎస్టి వసూలు చేస్తారు. మారుతి ట్రేడర్స్ మరియు ప్రైమ్ హార్డ్ వేర్స్ మధ్య లావాదేవి యొక్క రెండవ భాగం కూడా అంతర్రాష్ట్రమైనదై ఉంటుంది, మరియు ఐజిఎస్టి వసూలు చేయబడుతుంది.

విభిన్న ఉదాహరణల ద్వారా మనం దీనిని మరింతగా చర్చిద్దాం.

ఉదాహరణ 1
వివరాలుసరఫరాదారుతృతీయ పక్షంఅందుకునేవారుసరఫరా ప్రదేశంలావాదేవీ రకం
రాష్ట్రంమహారాష్ట్రమహారాష్ట్రకర్ణాటకమహారాష్ట్రరాష్ట్రంలోపల
పక్షం పేరుగణేష్ ట్రేడర్స్మారుతీ ట్రేడర్స్ప్రైమ్ హార్డ్ వేర్స్

Calculation of GST on bill to ship to transactions

ఉదాహరణలో, మారుతీ ట్రేడర్స్ నుండి సూచన మేరకు, గణేష్ ట్రేడర్స్ కర్ణాటక రాష్ట్రంలోని ప్రైమ్ హార్డ్ వేర్స్ కు అల్యూమినియం నిచ్చెనలు రవాణా చేస్తారు. ఇక్కడ, మారుతీ ట్రేడర్స్ తృతీయ పక్షంగా భావించడం జరుగుతుంది. అందువలన, సరఫరా స్థానం అనేది తృతీయ పక్షం యొక్క ప్రధాన వ్యాపార ప్రాంతం అయి ఉంటుంది, అనగా మహారాష్ట్ర. దీని ప్రకారంగా, గణేష్ ట్రేడర్స్ మారుతి ట్రేడర్స్ కు చేసే బిల్లింగ్ లో సిజిఎస్టి+ఎస్జిఎస్టి ఛార్జీలు విధిస్తుంది. మారుతి ట్రేడర్స్ మరియు ప్రైమ్ హార్డ్ వేర్స్ మధ్య జరిగిన లావాదేవి యొక్క రెండవ భాగం అంతర్రాష్ట్రమైనదై ఉంటుంది, మరియు ఐజిఎస్టి వసూలు చేయబడుతుంది.

ఉదాహరణ 2
వివరాలుసరఫరాదారుతృతీయ పక్షంఅందుకునేవారుసరఫరా ప్రదేశంలావాదేవీ రకం
రాష్ట్రంమహారాష్ట్రకర్ణాటకకర్ణాటకకర్ణాటకఅంతర్రాష్ట్ర
పక్షం పేరుగణేష్ ట్రేడర్స్మారుతీ ట్రేడర్స్ప్రైమ్ హార్డ్ వేర్స్

Bili to ship to examples

పై దృష్టాంతంలో తృతీయ పక్షం యొక్క ప్రధాన వ్యాపార ప్రాంతం కర్ణాటక, మరియు సరఫరా స్థానం కర్ణాటక అయి ఉంటుంది. ఈ ఒక అంతర్రాష్ట్ర లావాదేవీ, మరియు ఐజిఎస్టి విధించబడతగినది అయి ఉంటుంది. మారుతి ట్రేడర్స్ మరియు ప్రైమ్ హార్డ్ వేర్స్ మధ్య జరిగిన లావాదేవి యొక్క రెండవ భాగం రాష్ట్రంలోపలిది అయి ఉంటుంది, మరియు సిజిఎస్టి+ఎస్జిఎస్టి వసూలు చేయబడుతుంది.

వివరాలు CGST, SGST మరియు IGST అర్థం ఈ బ్లాగ్ పోస్ట్ చదవండి.సిజిఎస్టి, ఎస్జిఎస్టి మరియు ఐజఎస్టిని సవివరంగా అర్ధం చేసుకునేందుకు ఈ బ్లాగ్ పోస్ట్ చదవండి.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

191,854 total views, 22 views today

Yarab A

Author: Yarab A

Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.