1. సరఫరాలో సరుకు ఒక చోటు నుంచి మరొక చోటుకి కదలిక లేనప్పుడు, గ్రహీతకు సరుకు అందజేసిన సమయంలో సరుకు ఉన్న ప్రదేశంసరఫరా ప్రదేశం అవుతుంది.

ఉదాహరణకు: వారి నమోదిత వ్యాపార ప్రాంతం చెన్నై తమిళనాడు అయి ఉన్న రెక్స్ కార్లు, మైసూర్, కర్ణాటకలో ఒక షోరూమ్ తెరుస్తారు. వారు మైసూర్, కర్ణాటకలో రోహన్ జనరేటర్లు నుండి ప్రాంగణంలో ముందుగా ఇన్స్టాల్ చేయబడిన ఒక జెనరేటర్ కొనుగోలు చేస్తారు.

సరఫరాదారు లొకేషన్: మైసూర్, కర్ణాటక

సరఫరా ప్రదేశం: జెనరేటర్ సరఫరాకు దానిని తరలించడం అవసరం లేదు. అందువల్ల, సరఫరా స్థానం మైసూర్, కర్నాటక అయి ఉంటుంది.

ఇది ఒక రాష్ట్రంలోపల జరిగిన సరఫరా, మరియు వర్తించే పన్నులు ఏమిటంటే సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి.

Click To Tweet

GST for transactions involving no movement of goods

2. సరుకు సైట్ వద్ద అసెంబల్ చేయబడటం లేదా ఇన్స్టాల్ చేయబడటం జరిగినప్పుడు, అసెంబల్ చేసే లేదా ఇన్స్టాల్ చేసే ప్రదేశం సరఫరా ప్రదేశం అవుతుంది.
Click To Tweet

ఉదాహరణకు: వారి నమోదిత వ్యాపార ప్రాంతం చెన్నై తమిళనాడు అయి ఉన్న రెక్స్ కార్లు, తెలంగాణాలో హైద్రాబాద్ లో ఒక కొత్త శాఖ తెరుస్తారు. కొత్త శాఖ వద్ద ఇన్స్టాల్ చేసేందుకు, వారి నమోదిత వ్యాపార స్థలం కూడా చెన్నై, తమిళనాడు అయి ఉన్న రాన్ లిఫ్ట్స్ నుండి వారు ఒక లిఫ్ట్, కొనుగోలు చేసారు.

సరఫరాదారు ప్రదేశం: చెన్నై, తమిళనాడు

సరఫరా ప్రదేశం: హైదరాబాద్, తెలంగాణలోని రెక్స్ కార్లు ప్రాంగణంలో లిఫ్ట్ అసెంబల్ చేయబడి ఇన్స్టాల్ చేయబడింది. అందువల్ల, సరఫరా ప్రదేశం హైదరాబాద్, తెలంగాణ అవుతుంది.

ఈ ఒక అంతర్రాష్ట్ర సరఫరా, మరియు వర్తించే పన్ను ఐజిఎస్టి అయి ఉంటుంది.

Determining GST for goods assembled or installled

3. సరుకు ఒక వాహన మాధ్యమం ద్వారా సరఫరా చేయబడినప్పుడు, వస్తువులు చేరవేయబడిన ప్రదేశం సరఫరా చేయబడిన ప్రదేశం అవుతుంది
Click To Tweet

ఉదాహరణకు: : ఒక వ్యక్తి కోలకతా నుండి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న ఒక విమానంలో ప్రయాణిస్తూ ఉండగా, విమానం-లోపల షాపింగ్ కేటలాగ్ నుండి ఒక పవర్ బ్యాంకు కొనుగోలు చేస్తారు. ఎయిర్ లైన్స్ కు కోలకతాలో ఒక నమోదిత వ్యాపార స్థానం ఉంది మరియు పవర్ బ్యాంకు కోలకతాలో విమానంలో తీసుకోబడింది.
సరఫరాదారు ప్రదేశం: కోలకతా, పశ్చిమ బెంగాల్.
సరఫరా ప్రదేశం: కోలకతా, పశ్చిమ బెంగాల్.
ఇది ఒక రాష్ట్రం లోపలి సరఫరా మరియు వర్తించే పన్నులు ఏమిటంటే సిజిఎస్టి మరియు ఎస్జఎస్టి.

GST for goods supplied on board a mode of conveyance

వరుస క్రమంలో రానున్నవి:
‘వీరికి బిల్లు చేయండి’-‘వీరకి రవాణా చేయండి’ లావాదేవీల సందర్భంలో సరఫరా ప్రదేశం

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

132,287 total views, 348 views today