మా గత బ్లాగ్ లో మనంజిఎస్టి ఇన్పుట్ పన్ను క్రెడిట్ వినియోగించుకునేందుకు పరిస్థితులు మరియు ఇన్పుట్ (ఐటిసి) క్రెడిట్ వినియోగించుకోగల సందర్భాలని గురించి తెలుసుకున్నాము. ఈ బ్లాగ్ లో, మీరు ఇన్పుట్ పన్ను క్రెడిట్ వినియోగించుకోలేని సందర్భాలని గురించి మనం చర్చిద్దాం.

1. మీరు రిజిస్టర్ చేసుకునేందుకు బాధ్యులైన తేదీ నుండి 30 రోజుల లోపల రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు పెట్టుకోబడలేదు.

మీరు రిజిస్టర్ చేసుకునేందుకు బాధ్యులైన తేదీ నుండి 30 రోజుల లోపల రిజిస్ట్రేషన్ కోసం మీరు దరఖాస్తు పెట్టుకోకపోతే, మీరు పన్ను చెల్లించవలసిన బాధ్యత కలిగే తేదికి ముందు రోజు వరకు మీరు ఇన్పుట్ల పై మరియు స్టాక్ లో గల సగం పూర్తిచేయబడిన లేదా పూర్తిచేయబడిన వస్తువుల పై అర్హతగల ఐటిసిని కోల్పోతారు.

2. ఇన్పుట్ పన్ను క్రెడిట్ వినియోగించుకునేందుకు సమయసీమ అధిగమించబడిన తర్వాత

క్రింది తేదీల్లో అత్యంత ముందుగావచ్చే దానిలోపల ఐటిసిని వినియోగించుకోవడం జరగాలి-
• ఇన్వాయిస్ తేది నుండి 1 సంవత్సరం
లేదా
• తరువాతి ఆర్ధిక సంవత్సరం సెప్టెంబర్ కి రిటర్న్ ఫైల్ చేసిన తేది.
లేదా
• వార్షిక రిటర్న్ ఫైల్ చేసిన తేది (గడువు తేది తరువాతి ఆర్ధిక సంవత్సరపు 31 డిసెంబర్)

మనం దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం.
ఉదాహరణ: రాజేష్ అప్పారెల్ ప్రెవేట్ లిమిటెడ్ పురుషుల దుస్తుల్లో ఒక డీలర్. వీరు జూలై 15, 2017 నాడు తయారీదారు నుండి రూ.1,00,000 కోసం దుస్తులు కొనుగోలు చేసారు. కొనుగోలు పై చెల్లించబడిన జిఎస్టి రూ.18,000 (18%). వారు 31 జూలై 2018 నాడు 2017-18 సంవత్సరానికి వారి వార్షిక రిటర్న్ ఫైల్ చేశారు, మరియు సెప్టెంబర్ 2018 కు రిటర్న్ ను 20 అక్టోబర్ 2018 న ఫైల్ చేశారు.

ఇక్కడ తనిఖీ చేయవలసిన మూడు తేదీలు ఇవి –

ఇన్వాయిస్ తేది నుండి 1 సంవత్సరం14 జులై 2018
తరువాతి ఆర్ధిక సంవత్సరం సెప్టెంబర్ కి రిటర్న్ ఫైల్ చేసిన తేది20 అక్టోబర్ 2018
వార్షిక రిటర్న్ ఫైల్ చేసిన తేది31 జులై 2018

పై మూడు తేదీల్లోకి ఇన్వాయిస్ తేది నుండి 1 సంవత్సరం, అంటే 14జులై 2018 అత్యంత ముందుగావచ్చే తేదీ అయినందువలన, ఇన్వాయిస్ పై ఐటిసిని 14 జులై 2018 లోపుగా వినియోగించుకోవాలి.

3. ఒక కాంపొజిషన్ పన్ను చెల్లింపుదారు ద్వారా ఇన్పుట్లుగా ఉపయోగించబడే సరుకులు మరియు/లేదా సేవలపై

ఇన్పుట్లుగా ఉపయోగించబడే సరుకులు మరియు/లేదా సేవలపై ఒక కాంపొజిషన్ పన్ను చెల్లింపుదారు ఐటిసిని వినియోగించుకోలేరు.
ఉదాహరణ: లక్ష్మీ కిరానా స్టోర్స్ అనేది జిఎస్టి కింద ఒక కాంపొజిషన్ పన్ను చెల్లింపుదారుగా నమోదయ్యారు. వారు తయారీదారు నుండి రూ.20,000 కోసం పచారీ సామాన్లను కొనుగోలు చేసారు మరియు @ 12% జిఎస్టి రూ.2,400 ఛార్జి చేయబడింది. లక్ష్మీ కిరాణా స్టోర్స్ ఒక కాంపొజిషన్ పన్ను చెల్లింపుదారుగా నమోదై ఉన్నందున, వారు కొనుగోలు పై రూ.2,400 ఐటిసి వినియోగించుకోలేరు. ఈ చెల్లించబడిన జిఎస్టి వారి పదార్థం ధర భాగంగా అవుతుంది.

4. వ్యక్తిగత వినియోగం కోసం ఉపయోగించుకోబడిన సరుకు మరియు/లేదా సేవల పై

ఉదాహరణ: రాజేష్ అప్పారెల్ ప్రెవేట్ లిమిటెడ్ తయారీదారు నుండి రూ 50,000 కు దుస్తులు కొనుగోలు చేసారు. కొనుగోలు పై చెల్లించబడిన జిఎస్టి రూ. 9,000. కొనుగోలు చేయబడిన దుస్తుల్లో నుంచి రూ.2,000 విలువచేసే దుస్తులని యజమాని తన వ్యక్తిగత వినియోగం కోసం తీసుకున్నారు. మిగిలిన దుస్తులు వినియోగదారులకు విక్రయించడం జరిగింది. ఇక్కడ, కొనుగోలు పై వినియోగించుకోవలసిన ఐటిసి ఎంత అంటే రూ.8,640 (48,000 * 18%).

5. మినహాయించబడిన సరఫరాలు చేయడం కోసం ఉపయోగించబడిన సరుకు మరియు/లేదా సేవల పై

మినహాయించబడిన సరఫరాలు చేయడం కోసం ఉపయోగించబడిన సరుకు మరియు/లేదా సేవల పై మరియు అందుకునేవారు వ్యతిరేక ఛార్జ్ ప్రాతిపదికన పన్ను చెల్లించే సందర్భంలో సరఫరాల పై ఐటీసీ వినియోగించుకోవడానికి వీలులేదు.
ఉదాహరణ: మీరు ఒక మినహాయింపు వస్తువుని తయారు చేస్తారు. మీరు 4 సెప్టెంబర్ 2017నాడు- కింది (మినహాయింపు సరుకు తయారీకి ఉపయోగించబడే) ఇన్పుట్లను కొనుగోలు చేస్తారు-

లోపలికి సరఫరాలు- 4.9.2017
ఇన్పుట్లువిలువ (రూ.)ఇన్పుట్ల పై చెల్లించబడిన జిఎస్టి @ 18% (రూ.)
ముడి పదార్ధం A3,00,00054,000
ముడి పదార్ధం B30,000 5,400
మొత్తం3,30,00059,400

ఈ ఇన్పుట్లు ఒక మినహాయింపు పొందిన సరుకు తయారీ కోసం ఉపయోగించబడ్డాయి కాబట్టి ఇక్కడ మీరు రూ.59,400 ఐటిసి వినియోగించుకోలేరు.

6. ఇన్వాయిస్ తేదీ నుండి 3 నెలల్లోపుగా చెల్లింపు చేయబడని అందుకున్న సేవల కోసం

ఒక సేవ గ్రహీత ఇన్వాయిస్ తేదీ నుండి 3 నెలల్లోపుగా సేవలు అందుకున్నందుకు చెల్లించవలసిన చెల్లింపును పన్నుతో సహా చేయకపోతే, వినియోగించుకోబడిన ఐటిసిని, బాకీ ఉన్న వడ్డీతోసహా, గ్రహీత యొక్క బాధ్యతకు చేర్చడం జరుగుతుంది.

ఉదాహరణ: మీరు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ నుండి ఆడిటింగ్ మరియు కన్సల్టెన్సీ సేవలు పొందారు. సేవ యొక్క విలువ రూ.50,000 మరియు ఛార్జి చేయబడిన జిఎస్టి రూ.9,000 (@ 18%) ఉంది. మీరు ఇన్వాయిస్ తేదీ నుండి 3 నెలల్లో రూ.59,000 చెల్లింపు చేయకపోతే, మీ ద్వారా వినియోగించుకోబడిన రూ.9,000 ఐటిసి బాకీ ఉన్న వడ్డీతో పాటు, మీ బాధ్యతకు జోడించబడుతుంది.

7. పోయిన, దోచుకోబడిన, నాశనం చేయబడిన, కొట్టిపారేయబడిన లేదా కానుక లేదా ఉచిత నమూనాలుగా తీసివేయబడిన సరుకు పై

ఉదాహరణ: మీరు ఒక ఎలక్ట్రానిక్ వస్తువుల డీలర్. నవంబర్ 1, 2017 నాడు, మీరు ప్రతి ఒక్కటి @ రూ.25,000 గల 20 కంప్యూటర్లని తయారీదారు నుండి కొనుగోలు చేసారు. ఛార్జి చేయబడిన జిఎస్టి (@ 18%) రూ. 90,000 ఉంది. 2 నవంబర్, 2017 నాడు కంప్యూటర్లల్లో 1 పూర్తిగా నాశనమైపోయి ఇంకెంతమాత్రమూ ఉపయోగించటం వీలుకాదు. మీరు ఆ కంప్యూటర్ పై ఐటిసి,అనగా రూ. 4,500, వినియోగించుకోలేరు.

8. మోటార్ వాహనాలు మరియు ఇతర ప్రయాణం కోసం

మోటారు వాహనాలు మరియు ఇతర ప్రయాణం కోసం ఐటిసి అనుమతించబడదు, అవి ఇలా అయితే తప్ప:
• మరింత సరఫరా చేయబడటం లేక
• ప్రయాణీకులు లేదా సరుకు రవాణా చేయడం కోసం ఉపయోగించబడిన
• అలాంటి వాహనాలు లేదా ప్రయాణ సాధనాలని డ్రైవ్ చేయడానికి, ఎగరవేయడానికి లేదా నావిగేట్ చేయడానికి శిక్షణ అందజేయటం కోసం ఉపయోగించబడిన

ఉదాహరణ: సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒక కారు తయారీదారు, ఫ్యాక్టరీ ఆవరణలో ఉద్యోగుల రవాణా కోసం ఒక టెంపో ట్రావెలర్ కొనుగోలు చేసారు. అది పైన పేర్కొన్న కార్యకలాపాల కోసం ఉపయోగించబడలేదు కాబట్టి టెంపో ట్రావెలర్ పై సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐటిసిని వినియోగించుకోలేరు.

మరొక దృష్టాంతం చూద్దాం. ముఖేష్ ట్రావెల్స్, ఒక టూర్ ఆపరేటర్, వారి ప్యాకేజీ పర్యటనల సమయంలో పర్యాటకులను రవాణాచేసే ప్రయోజనం కోసం ఒక టెంపో ట్రావెలర్ కొనుగోలు చేసారు. ముఖేష్ ట్రావెల్స్ కోసం ఒక వ్యాపార కార్యకలాపమైన – ప్రయాణీకులను రవాణా చేయడం కోసం అది ఉపయోగించుకోబడింది కాబట్టి ఇక్కడ, ముఖేష్ ట్రావెల్స్ టెంపో ట్రావెలర్ పై ఐటిసి పొందవచ్చు.

9. ఆహారం మరియు పానీయాలు, అవుట్-డోర్ క్యాటరింగ్, సౌందర్య పోషణ, ఆరోగ్య సేవలు, సౌందర్య మరియు ప్లాస్టిక్ సర్జరీ పై

అవి అదే వర్గం సరుకులు లేదా సేవల యొక్క బాహ్య సరఫరా చేసినందుకు ఉపయోగించబడిన చోట మినహా ఆహారం మరియు పానీయాలు, అవుట్-డోర్ క్యాటరింగ్, సౌందర్య పోషణ, ఆరోగ్య సేవలు, సౌందర్య మరియు ప్లాస్టిక్ సర్జరీ పై, ఐటిసి వినియోగించుకోవడం వీలుకాదు.

ఉదాహరణ 1: సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ ఉద్యోగులకు దీపావళి వేడుక కార్యక్రమం కోసం ఒక క్యాటరర్, రాకేష్ కేటరర్ల సేవలను తీసుకుంటారు. సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు క్యాటరింగ్ సేవ పై ఐటిసి వినియోగించుకోలేరు ఎందుకంటే వారి వ్యాపార కార్యకలాపం క్యాటరింగ్ సేవ కాదు కాబట్టి.

ఉదాహరణ 2: సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు సేవ అందించే సమయంలో, రాకేష్ కేటరర్లు ఒక షామియానా అందించేవారి సేవలు తీసుకుంటారు. ఇక్కడ షామియానా సేవల పై రాకేష్ కేటరర్లు ఐటిసి పొందవచ్చు ఎందుకంటే, అదే వర్గం సేవల యొక్క బాహ్య సరఫరా చేయడం కోసం అవి ఉపయోగించుకోబడ్డాయి కాబట్టి.

10. ఉద్యోగులకు విధిగా అందించవలసిన సేవలైన నోటిఫై చేయబడిన సేవలు మినహా ఉద్యోగులకు తీసుకున్న క్లబ్బులు, ఆరోగ్యం & ఫిట్నెస్ కేంద్రాల సభ్యత్వాలు, రెంట్-ఎ-క్యాబ్ సేవలు మరియు ఉద్యోగుల కోసం తీసుకోబడిన జీవిత & ఆరోగ్య భీమా పై

ఉదాహరణ: ముఖేష్ ట్రావెల్స్, ఒక టూర్ ఆపరేటర్, తమ ఉద్యోగులు ఉపయోగం కోసం, ఒక ఫిట్నెస్ సెంటర్, ప్రథమ్ ఫిట్నెస్ సెంటర్ యొక్క వార్షిక సభ్యత్వం తీసుకుంటారు. ఇక్కడ, ముఖేష్ ట్రావెల్స్ సభ్యత్వం ఛార్జీలపై చెల్లించిన జిఎస్టి పై ఐటిసి వినియోగించుకోలేరు.

11. సెలవు లేదా ఇంటి ప్రయాణ రాయితీ వంటి సెలవులో ఉద్యోగులకు ప్రయాణ ప్రయోజనాల పై

ఉదాహరణ: సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్టిఎ (లీవ్ ట్రావెల్ అలవెన్స్) లో భాగంగా తమ సీనియర్ ఉద్యోగులకు ప్రయాణ ఖర్చులు తిరిగి చెల్లిస్తుంది. తిరిగి చెల్లించిన ప్రయాణ ఛార్జీల జిఎస్టి భాగంపై సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐటిసి వినియోగించుకోలేరు.

12. తరుగుదల గనక క్లెయిమ్ చేయబడి ఉంటే, క్యాపిటల్ సరుకు ధర యొక్క పన్ను భాగం పై

ఆదాయం పన్ను రిటర్న్ లో గనక పన్ను భాగంపై తరుగుదల క్లెయిమ్ చేయబడి ఉంటే, క్యాపిటల్ సరుకు ధర యొక్క పన్ను భాగం పై ఐటిసి వినియోగించుకోవడం వీలుకాదు.

ఉదాహరణ: సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్, కార్ల తయారీకి ఉపయోగించేందుకు రూ..50,00,000 కు యంత్రాంగం కొనుగోళ్లు చేసారు.. యంత్రాంగం పై చెల్లించబడిన జిఎస్టి రూ.9,00,000. సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్, జిఎస్టి భాగం కలిసి ఉన్న ఆదాయపు పన్ను కింద యంత్రాల తరుగుదల ని క్లెయిమ్ చేసారు. ఈ సందర్భంలో, సూపర్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ యంత్రాంగం పై రూ.9,00,000 ఐటిసి వినియోగించుకోలేరు.

ఇప్పటికే అసాధారణ సందర్భాల్లో ఇన్పుట్ పన్ను క్రెడిట్ ఉపయోగించుకోవడాన్ని వాడుకున్నారు

ఐటీసీ వినియోగించుకున్న ఒక సాధారణ డీలర్ కాంపొజిషన్ పథకానికి మారినప్పుడు

ఐటీసీ వినియోగించుకున్న ఒక సాధారణ డీలర్ కాంపొజిషన్ పథకానికి మారినప్పుడు, ఆ వ్యక్తి స్టాక్ లో ఇన్పుట్లు, సగం-తయారైన దశలో ఉన్న ఇన్పుట్లు, స్టాక్ మరియు క్యాపిటల్ గూడ్స్ తయారైన సరుకు (సూచించిన శాతం పాయింట్లతో తగ్గించబడి)పైన వినియోగించుకున్న ఐటిసిని కాంపొజిషన్ పథకం మారే తేదీకి ముందు రోజున తిరిగి చెల్లించాలి.

ఉదాహరణ: మీరు ఒక సాధారణ డీలర్ గా నమోదు చేయబడ్డారు. మీ టర్నోవర్ రూ .50 లక్షలు మించని కారణాన మీరు 1 సెప్టెంబర్ 2017 నాడు కాంపొజిషన్ పథకానికి మారారు. 31 ఆగష్టు 2017 నాడు, మీరు ఇప్పటికే ఐటిసి వినియోగించుకున్న క్రింది ఇన్పుట్లు స్టాక్ లో ఉన్నాయి –

మూసివేసేటప్పుడు స్టాక్- 31.8.2017
ఇన్పుట్లువిలువ (రూ.)ఇన్పుట్ల పై చెల్లించబడిన జిఎస్టి @ 18% (రూ.)
ముడి సరుకు A1,50,00027,000
ముడి సరుకు B20,000  3,600
మొత్తం1,70,00030,600

కాంపొజిషన్ పథకానికి మారడంతోనే, స్టాక్ లో ఇన్పుట్ల పై వినియోగించుకోబడిన రూ 30,600 ఐటిసిని మీరు తిరిగి చెల్లించాలి.

పన్ను పరిధిలోకి వచ్చే సరుకు మరియు/లేదా సేవలు మినహాయింపు పొందినప్పుడు

పన్ను పరిధిలోకి వచ్చే సరుకులు మరియు / లేదా ఒక వ్యక్తి ద్వారా సరఫరా చేయబడే సేవలు మినహాయింపుగా గుర్తించబడినప్పుడు, స్టాక్ లో ఇన్పుట్లు, స్టాక్ లో సగం-తయారైన దశలో ఉన్న లేదా తయారైన సరుకు ఇన్పుట్లు, మరియు క్యాపిటల్ సరుకు (సూచించిన శాతం పాయింట్లతో తగ్గించబడి) పైన వినియోగించుకున్నఐటిసిని మినహాయింపు తేదీకి ముందు రోజున తిరిగిచెల్లించాలి.
ఉదాహరణ: మీరు 15 సెప్టెంబర్ 2017 నుంచి అమల్లోకి వస్తుందని తెలియపరచబడిన ఒక పన్ను పరిధిలోకి వచ్చే ఒక సరుకును తయారు చేసారు. 14 సెప్టెంబర్ 2017 నాడు జిఎస్టి ఇప్పటికే వినియోగించుకోబడిన క్రింది ఇన్పుట్లు మీ స్టాక్ లో ఉన్నాయి –

మూసివేసేటప్పుడు స్టాక్ – 14.9.2017
ఇన్పుట్లువిలువ (రూ.)ఇన్పుట్ల పై చెల్లించబడిన జిఎస్టి @ 18% (రూ.)
ముడి సరుకు1,00,00018,000
సగం తయారైన సరుకు రూపంలో ఇన్పుట్లు50,000 9,000
మొత్తం1,50,00027,000

స్టాక్ లో ఐటిసి వినియోగించుకోబడిన ఇన్పుట్లు, అంటే రూ.27,000 తిరిగి చెల్లించవలసి ఉంటుంది.
గమనిక: జిఎస్టి రేట్లు ఇంకా ఖరారు చేయబడలేదు మరియు ఉదాహరణలలో పేర్కొన్న రేట్లు కేవలం ఉదాహరణ ప్రయోజనం కోసం మాత్రమే.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

127,598 total views, 20 views today