సాంకేతిక-మద్దతుగల అనువర్తన అనేది భారతదేశంలో పూర్తిగా కొత్త భావన ఏమీ కాదు. ఎప్పుడో 1990 లో పన్నుల పరిపాలన కోసం పన్నుల విభాగాలు సాంకేతికతని ఉపయోగించాయి. అయితే, ఇది ప్రధానంగా ఒక వెనుక నుండి మద్దతు (బ్యాకెండ్) యంత్రాంగంగా ఉండేది. రిటర్నులు ఆన్లైన్ ఫైల్ చేయడాలని ప్రవేశపెట్టినప్పుడు ప్రవర్తనలో ఒక పెద్ద మార్పు జరిగింది. ఇది వివిధ కంప్యూటర్ వ్యవస్థలు విలీనం చేయబడ్డ ఫలితంగా, తద్వారా పన్ను చెల్లించేవారు నేరుగా పన్ను శాఖతో పరస్పరం సంభాషించేందుకు వీలు కల్పించాయి.

ప్రస్తుత పన్ను వ్యవస్థ ప్రకారం, డేటా లేదా సమాచారం విశేషంగా ప్రభుత్వానికి ఒక దిశలో ప్రవహిస్తుంది, దీనిని మనం B నుంచి G లేదా వ్యాపారం నుంచి ప్రభుత్వానికి డేటా ప్రవాహంగా వర్ణించవచ్చు. సాంకేతికను ఉపయోగించడంతో, కట్టుబడి ఉండవలసిన ఖచ్చితత్వం బాగా మెరుగుపడగా సమయం మరియు వ్యయం గణనీయంగా తగ్గింది.

జిఎస్టి అనువర్తన కోసం సాంకేతికత – ఈ సారి భిన్నమైనది ఏమిటి?

అనువర్తించడానికి ఇప్పటికే సాంకేతికత ఒక ముందుకునడిపే శక్తి కావడంతో, జిఎస్టి అమలు మరియు అనువర్తన కోసం సరైన సాంకేతికతకు సంబంధించిన సమస్యలను మళ్లీ పరిశీలించాల్సిన అవసరం ఏమిటి? ప్రభుత్వం మరియు వ్యాపార దృక్పథం నుండి జిఎస్టి అమలు మరియు పరిపాలనలో సాంకేతికత ఎందుకు కీలక పాత్ర పోషిస్తుంది?

జిఎస్టి తో, ప్రభుత్వం సాధించాలని అనుకుంటున్న రెండు ప్రధాన లక్ష్యాలు:

• పన్ను ఎగవేతను తగ్గించడం
• పన్నుచెల్లింపుదారుల కోసం అనువర్తించడం సులభతరం చేయడం

అమలులో ఉన్న పన్ను విధానాలలో, ప్రభుత్వం గర్తించలేకపోయిన అనేక ఎగవేతలు మరియు పన్నుల రాబడిని కోల్పోయిన కేసుల ఉన్నాయి. తత్ఫలితంగా, విక్రేత యొక్క బాధ్యతకు వ్యతిరేకంగా ఇన్పుట్ క్లెయిమ్లను ట్రాక్ చేయడం అనేది సంబంధిత విభాగానికి ఒక సవాలుగా మారింది. ఇంకా ఇన్పుట్ టాక్స్ పై నకిలీ క్లెయిములు, మోసపూరితమైన క్లెయిములు, విక్రేత ప్రకటించిన పన్ను బాధ్యతకు అనుగుణంగా లేని ఇన్పుట్ పన్ను క్లెయిములు, లేదా తన పన్ను బాధ్యతలను అందించని విక్రేత వంటి అనేక సందర్భాలు కూడా ఉన్నాయి.

దీనిని అధిగమించడానికి, కొనుగోలుదారు మరియు విక్రేత యొక్క ఇన్వాయిస్ మ్యాచ్ అవడాన్ని జిఎస్టి ప్రవేశ పెట్టింది.

It has been estimated that the taxpayer base under #GST is around 8 million Click To Tweet నెలవారీ ప్రాతిపదికన బిలియన్ల కొద్దీ ఇన్వాయిస్లు సరిపోల్చవలసి ఉండడంతో, దృఢమైన IT మౌలిక స్థాపన ద్వారా మద్దతివ్వబడిన ఒక వాస్తవిక సమయంలో ఇన్వాయిస్ సరిపోల్చే సామర్ధ్యం కోసం ఒక తీవ్రమైన ఆవశ్యకత ఏర్పడింది.

ఈ తరహాలో ఇన్వాయిస్ల మ్యాచింగ్ ని మానవీయంగా సాధించే మార్గమే లేదు.

పన్నుచెల్లింపుదారుల కోసం అనువర్తించడాన్ని సరళీకృతం చేయడంలో జిఎస్టిఎన్ పాత్ర ఏమిటి?

జిఎస్ఎన్ అనేది ప్రస్తువ వ్యవస్థ నుంచి గణనీయంగా భిన్నంగా ఉండే మార్పులను ప్రవేశపెట్టే స్టేట్-ఆఫ్-ద ఆర్ట్ ఐటి మౌలిక సదుపాయాల్ని విస్తరింపజేయడంపై ప్రస్తుతం కృషి చేస్తోంది. ఒక ఓపెన్ ఎపిఐ (అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్) కలిగి ఉండి జిఎస్టిఎన్ సర్వర్ పన్ను చెల్లింపుదారుల ద్వారా ఉపయోగించబడే మూడవ పక్ష అప్లికేషన్లతో ఎల్లలు లేకుండా కనెక్ట్ అవుతుంది, దానితో ఒక ఆల్-యూజర్ ఇంటర్ఫేస్, మరియు డెస్క్టాప్లు, మొబైల్లు మరియు టాబ్లెట్ల ద్వారా సౌలభ్యాన్ని అందిస్తుంది. పన్ను చెల్లింపుదారులు పోర్టల్ కు లాగ్ అవడం కాకుండా, వారి సాఫ్ట్వేర్ లోపల నుండే వారి ఇన్వాయిస్ మ్యాచింగ్ ఆటోమేట్ చేయడానికి ఇది సహాయపడుతుంది. ఇది సమయం ఆదా చేస్తుంది, మరియు అనువర్తన విధానాల సరళతను ప్రేరేపిస్తుంది. క్రమబధ్ధమైన అంతరాయాల్లో రిటర్నులను ఫైల్ చేయడంలో జిఎస్టి చాలా క్రమశిక్షణను అందిస్తుందని, మరియు వ్యాపారాలు దీనిని తక్కువ ప్రయాసతో సాధించడంలో ఆటోమేషన్ సహాయపడుతుంది.

సాంకేతికని ఉపయోగించడం అనేది, తక్కువగా లేదా అసలు మానవ జోక్యం లేకుండా రిజిస్ట్రేషన్, రిటర్న్ లు ఫైల్ చేయడం, డేటా మార్పిడి మరియు సమర్థవంతమైన దర్యాప్తు, పర్యవేక్షణ, ఆడిటింగ్ మరియు పనితీరు విశ్లేషణల కోసం సమర్థవంతమైన పన్ను పరిపాలనకు కూడా వీలు కల్పిస్తుంది. ఇది ఆఫ్లైన్ సామర్ధ్యాలు, హెచ్చరిక సామర్థ్యాలు, మొబైల్ / టాబ్లెట్ ఇంటర్ఫేస్ మరియు డేటా యొక్క నకిలీని నివారించడానికి అదనపు యంత్రాంగాలు వంటి అనేక యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను కూడా అందిస్తుంది.
ఈ పన్ను విధానం భారతదేశంలో మొట్టమొదటిసారిగా అమలు చేయబడుతున్నందున, అమలుచేయబడే ప్రారంభ దశలలో వ్యాపారాలు అనేక సవాళ్లను ఎదుర్కుంటాయి. అయితే, ఒకసారి వ్యవస్థలు క్రమబద్ధీకరించబడిన తర్వాత, ఊహించబడ్డ రెండు ముఖ్య లక్ష్యాలు – పన్ను ఎగవేత నిరోధించడం, మరియు పన్ను ఆదాయం మరియు పన్ను చెల్లింపుదారులు కట్టబడి ఉండటాన్ని సులభతరం చేయడం సాధించబడతాయి.

ఈ మార్పు సఫలం అవడం అనేది జిఎస్టికి కట్టుబడి ఉండటంలో మనదేశం ప్రపంచ చరిత్రను సృష్టించడానికి సహాయపడుతుంది.

కాబట్టి వ్యాపారాలు ఇప్పుడు ఏమి చేయాలి?

జూలై 1, 2017 నాడు ప్రారంభమయ్యే జిఎస్టి వ్యవస్థ, జిఎస్టిఎన్ సర్వర్ తో ఎల్లలు లేని ఇంటర్ఫేస్ తో సాంకేతిక శక్తి యొక్క బలం మీద నడుస్తుంది. వ్యాపారాలు తమ మాన్యువల్ సిస్టంలను ఆటోమేట్ చేయాలి మరియు జిఎస్టిఎన్ వ్యవస్థతో పరస్పరం స్పందించగల మరియు సత్వరమై, ఖచ్చితమైన మరియు విశ్వసనీయ అనువర్తింపుకు సహాయపడే సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి.
ఇన్వాయిస్ మ్యాచింగ్ అనేది జిఎస్టి యొక్క అతి కీలకమైన ఆవశ్యకత. జిఎస్టి ద్వారా నిర్దేశించబడిన స్పష్టమైన సమయపాలన కారణంగా, అనువర్తించడం అనేది ఇక ఏమాత్రమూ నెల-ముగింపు లేదా త్రైపాక్షికం-ముగింపులో జరిగే కార్యకలాపంగా ఉండదు. అందువలన, మానవీయమైన లేదా తక్కువ-సాంకేతిక వ్యవస్థను ఉపయోగించి ఇన్వాయిస్ మ్యాచింగ్ మరియు ఇతర అనువర్తింపు సంబంధిత కార్యకలాపాలు సాధించడం వీలుకాదు. వేగం మరియు ఖచ్చితత్వం రెండూ కీలకమైనవి.
వ్యాపారాలు తరచుగా జిఎస్టిఎన్ వ్యవస్థతో పరస్పరం స్పందించడం ప్రారంభించాలి. దీనికి ఒక జిఎస్టిఎన్- ప్రారంభించబడిన వ్యాపార అప్లికేషన్ లేదా అకౌంటింగ్ సాఫ్ట్ వేర్ అవసరం అవుతుంది, దీనితో ముందున్న కార్యం ఎల్లలు లేకుండా మరియు సమర్ధవంతంగా తయారవుతుంది.

ఒక వ్యాపారంగా, మీరు తప్పక:
• జిఎస్టి, మరియు మీ వ్యాపారంపై సాంకేతికత ప్రభావం గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ప్రారంభించాలి
• కట్టుబడి ఉండవలసిన క్రమశిక్షణ అవసరాన్ని మెచ్చుకోండి
• కట్టుబడి ఉండటాన్ని సాధించటానికి సహాయపడటానికి సాఫ్ట్వేర్ యొక్క సరైన ఎంపిక పై దృష్టి పెట్టండి

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

85,941 total views, 409 views today

Yarab A

Author: Yarab A

Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.