మా మునుపటి బ్లాగుల్లో, జిఎస్టి కింద సరఫరాపై విధించబడే పన్నులని గురించి చర్చించాము.
• ఇంట్రాస్టేట్ (రాష్ట్రం లోపలి) సరఫరాలపై, విధించబడే పన్నులు ఏమిటంటే సెంట్రల్ జిఎస్టి (సిజిఎస్టి) మరియు స్టేట్ జిఎస్టి (ఎస్జిఎస్టి).
• ఇంటర్ స్టేట్ (రాష్ట్రం వెలుపలి) సరఫరాలపై విధించబడే పన్ను ఐజిఎస్టి.
ఇప్పుడు చర్చించుకుంటున్నది జిఎస్టి లోని మరో భాగం అయిన యుటిజిఎస్టి గురించి. యుటిజిఎస్టి అంటే యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అని అర్ధం.
యుటిజిఎస్టి ని, అది విధించబడే పరిస్థితులు మరియు అది విధించబడే విధానము మనం అర్థం చేసుకుందాం

కెంద్రపాలిత ప్రాంతం (యూనియన్ టెరిటరీ) జిఎస్టి (యుటిజిఎస్టి)

ఒక కేంద్రపాలిత ప్రాంతం నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉంటుంది. ఇది స్వంతగా ఎన్నికైన ప్రభుత్వాలను కలిగి ఉన్న రాష్ట్రాల కంటే వాటిని భిన్నంగా ఉండేలాగా చేస్తుంది. ప్రస్తుతం, భారతదేశంలో 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి:
1. చండీగఢ్
2. లక్షద్వీప్
3. డామన్ మరియు డైయు
4. దాద్రా మరియు నాగర్ హవేలీ
5. అండమాన్ మరియు నికోబార్ దీవులు
6. ఢిల్లీ
7. పుదుచ్చేరి

వీటిల్లో ఢిల్లీ మరియు పుదుచ్చేరిలకు ఎన్నికైన సభ్యులు మరియు ముఖ్యమంత్రి గల తమ సొంత శాసనసభలు ఉన్నాయి. అందువల్ల అవి పాక్షిక-రాష్ట్రాలు(సెమీ-స్టేట్స్) గా పనిచేస్తాయి.
జిఎస్టి కింద, ఎస్జిఎస్టి చట్టం భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. భారత రాజ్యాంగంలోని ‘రాష్ట్రాల’ నిర్వచనం అనేదానిలో వాటి సొంత శాసనసభలుగల కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అందువల్ల, ఎస్జిఎస్టి చట్టం ఢిల్లీ మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది. అంటే అర్థం ఏమిటంటే ఢిల్లీ మరియు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాలలో సరఫరాపై విధించబడే పన్నులు సిజిఎస్టి + ఎస్జిఎస్టి మరియు ఢిల్లీ / పుదుచ్చేరి నుండి మరొక రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా పై విధించబడే పన్ను ఐజిఎస్టి అని.
ఎస్జిఎస్టి చట్టం దాని సొంత శాసనసభ లేకుండా ఒక కేంద్రపాలిత ప్రాంతంపై వర్తింపజేయబడలేదు కాబట్టి, కేంద్ర పాలిత ప్రాంతాలైన చండీగఢ్, లక్షద్వీప్, డామన్ మరియు డైయు, దాద్రా మరియు నగర్ హవేలి మరియు అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో యుటిజిఎస్టి అని పిలవబడే ఒక పన్నును విధించడం కోసం జిఎస్టి కౌన్సిల్ యుటిజిఎస్టి చట్టం ప్రవేశపెట్టింది. ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్జిఎస్టి స్థానంలో యుటిజిఎస్టి విధించబడుతుంది.

UTGST is applicable in the union territories of Chandigarh, Lakshadweep, Daman and Diu, Dadra and Nagar Haveli and Andaman and Nicobar Islands. Click To Tweetపన్ను విధింపు
కేంద్రపాలిత ప్రాంతం లోపల సరఫరా
ఒక కేంద్రపాలిత ప్రాంతం లోపల సరఫరాపై, సిజిఎస్టి + యుటిజిఎస్టి విధించబడుతుంది.
ఉదాహరణకు: చండీగఢ్ లోని ఫర్నిచర్ సెంటర్ చండీగఢ్లో వీణా ఫర్నీచర్స్ కు రూ. 10,00,000కు 50 సోఫా సెట్లు సరఫరా చేసింది.
ఇది చండీగఢ్ యొక్క కేంద్ర పాలిత ప్రాంతంలోపలి సరఫరా. సోఫా సెట్లపై 12% జిఎస్టి రేటును ఊహించి, ఈ సందర్భంలో పన్ను లెక్కింపు ఈ విధంగా ఉంటుంది:

వివరాలు మొత్తం (రూ.)
సోఫాసెట్లు10,00,000
సిజిఎస్టి @ 6%60,000
యుటిజిఎస్టి @ 6%60,000
మొత్తం 11,20,000

అందువల్ల, ఇక్కడ ఉన్న ఒకేఒక్క తేడా ఏమిటంటే కేంద్రపాలిత ప్రాంతాల్లోపలి సరఫరాలపై, ఎస్జిఎస్టి స్థానంలో యుటిజిఎస్టి విధించబడుతుంది.

On supplies within a union territory, CGST and UTGST will be levied. Click To Tweet
కేంద్రపాలిత ప్రాంతం వెలుపల సరఫరా

ఒక కేంద్రపాలిత ప్రాంతం నుండి మరొక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా పై ఐజిఎస్టి విధించబడుతుంది.

ఉదాహరణకు: చండీగఢ్ లోని ఫర్నిచర్ సెంటర్ రూ. ఢిల్లీలోని రమేష్ ఫర్నీచర్ టౌన్ కు రూ. 10,00,000కు 50 సోఫా సెట్లు సరఫరా చేసింది.

ఇది చండీగఢ్ యొక్క కేంద్ర పాలిత ప్రాంతం వెలుపల సరఫరా. సోఫా సెట్లపై 12% జిఎస్టి రేటును ఊహించి, ఈ సందర్భంలో పన్ను లెక్కింపు ఈ విధంగా ఉంటుంది:

వివరాలు మొత్తం (రూ.)
సోఫాసెట్లు10,00,000
ఐజిఎస్టి @ 12%1,20,000
మొత్తం 11,20,000

అందువల్ల, రాష్ట్రం వెలుపల సరఫరాపై పన్ను విధింపుకు లాగానే, ఒక కేంద్రపాలిత ప్రాంతం వెలుపల సరఫరాపై ఐజిఎస్టి వర్తించబడుతుంది.

IGST will be applicable on supplies outside a union territory.Click To Tweet
వినియోగం ఆర్డర్

ఎస్జిఎస్టి క్రెడిట్, వినియోగించుకున్నట్లుగానే చెల్లించదగిన పన్ను సెట్ ఆఫ్ చేసేందుకు యుటిజిఎస్టి క్రెడిట్ ను వినియోగించుకోవచ్చు, అంటే:

ఇన్పుట్ పన్ను క్రెడిట్ బాధ్యతకు ప్రతిగా సెట్ ఆఫ్
యుటిజిఎస్టియుటిజిఎస్టి మరియు ఐజిఎస్టి (ఈ క్రమంలో)

ఇంకా, సిజిఎస్టి బాధ్యతను సెట్ ఆఫ్ చేసేందుకు యుటిజిఎస్టి క్రెడిట్ వినియోగించుకోవడం వీలుకాదు.

ఉదాహరణ: ఆగస్ట్ ’17 చివరలో, చండీగడ్ లోని ఫర్నీచర్ సెంటర్, ఇన్పుట్ పన్ను క్రెడిట్ మరియు పన్ను బాధ్యతను క్రింద చూపిన విధంగా కలిగి ఉంది:


ఇన్పుట్ పన్ను క్రెడిట్ (రూ.)

పన్ను బాధ్యత (రూ.)
సిజిఎస్టి1,00,000సిజిఎస్టి80,000
యుటిజిఎస్టి1,00,000యుటిజిఎస్టి80,000
ఐజిఎస్టి2,00,000ఐజిఎస్టి2,50,000

ఇక్కడ, ఫర్నీచర్ సెంటర్ యుటిజిఎస్టి క్రెడిట్ రూ. 1,00,000 ను కింది విధంగా వినియోగించుకోవచ్చు:


వివరాలు
మొత్తం (రూ.)
యుటిజిఎస్టి క్రెడిట్1,00,000
(-)యుటిజిఎస్టి బాధ్యతకు విరుధ్ధంగా సెట్-ఆఫ్ చేయబడినది(-) 80,000
బ్యాలెన్స్20,000
(-) ఐజిఎస్టి బాధ్యతకు విరుధ్ధంగా సెట్-ఆఫ్ చేయబడినది(-) 20,000
బ్యాలెన్స్ఏమీ లేదు

తమ సొంత శాసనసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్జిఎస్టి స్థానంలో యుటిజిఎస్టి విధించబడుతుంది. సిజిఎస్టి మరియు ఐజిఎస్టి బిల్లులతో పాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడే యుటిజిఎస్టి బిల్లు, 6 ఏప్రిల్ 17, నాడు పాస్ చేయబడింది.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

171,407 total views, 412 views today