(English) Language

 • English
 • Hindi
 • Marathi
 • Kannada
 • Telugu
 • Tamil
 • Gujarati

(తాజా మార్పులని చేర్చేందుకు ఈ పోస్ట్ 2 డిసెంబర్ 2016 నాడు అప్డేట్ చేయబడింది.

భారతీయ పన్నుల చరిత్రలో ఆగష్టు 3, 2016 ఒక ఎర్రటి అక్షర లిఖిత రోజుగా నమోదుచేయబడుతుంది; ఆ నాడు రాజ్యసభలో 1 ఏప్రిల్ 2017 నాటి నుండి భారతదేశంలో జిఎస్టి(గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) అమలుకు మార్గం సుగమం చేస్తూ 122 వ రాజ్యాంగపు బిల్లు దాదాపుగా ఏకగ్రీవంగా ఆమోదించబడింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్లు గత దశాబ్దంగా గణనీయంగా అభివృధ్ధి చెందింది మరియు స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి భారతదేశపు ఏకైక అతిపెద్ద పన్ను సంస్కరణగా పేర్కొనబడుతుంది. ఇది 1.5 నుంచి 2% వరకు జిడిపిని అధికం చేస్తుందని అంచనా. పదికిపైగా పరోక్ష పన్నులు సమ్మిళితం చేసుకుంటూ భారతదేశాన్ని ఒక సాముదాయక మార్కెట్ గా చేస్తూ ‘ఒక భారతదేశం, ఒకటే పన్ను’ అనేది జిఎస్టి తో కొత్త వాస్తవం అయి ఉంటుంది.

కాస్కేడింగ్ ప్రభావం తొలగింపు మాత్రమే కాకుండా, సరళీకృత అనువర్తనం, సాంకేతిక మద్దతు మరియు భారతదేశ వ్యాప్తంగా ఏకరీతి ప్రక్రియ అనేది ‘ వ్యాపారం చేయడం సుగమం’ చేయడానికి గణనీయంగా దోహదపడుతుంది. అయితే, ఇప్పటికే ఉన్న కొన్ని వ్యాపార పద్ధతులు మార్పులకు లోనవడం అవసరం కాబట్టి ఒక వ్యాపార విజయం అనేది ఈ కొత్త వాస్తవాన్ని అర్ధం చేసుకోవడం మరియు పాటించగలగే సామర్ధ్యం పై గణనీయంగా ఆధారపడి ఉంటుంది.

గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ భారతదేశ వ్యాప్తంగా సరుకు సరఫరా మరియు సేవలపై విధించబడే సమగ్ర పన్ను. జిఎస్టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) ఒక గమ్యం ఆధారిత వినియోగం పన్ను, మరియు ప్రస్తుతం ఉన్న పన్ను పరిధిలోకి వచ్చే అంశం అయిన అమ్మకం, తయారీ లేదా సేవ కాకుండా సరఫరా అంశం పన్ను పరిధిలోకి వచ్చేదై ఉంటుంది. డ్రాఫ్ట్ మోడల్ జిఎస్టి చట్టం ముందుగా జూన్ 2016 లో వెల్లడించబడింది, దాని తరువాత సవరించిన డ్రాఫ్ట్ చట్టం 26 నవంబరు 2016 న వెల్లడించబడింది. లావాదేవీలు మృదువుగా సాగిపోవడానికి , తుది జిఎస్టి చట్టం అన్ని ఆందోళనలు పరిష్కరించేందుకు అనువుగా వ్యాపారాలు, పరిశ్రమలు / వాణిజ్య సంస్థలు, వృత్తి పరమైన సంఘాలు మరియు అటువంటివారు సాధ్యమైనంత పెందరాళే సాధికార సమాచారాన్ని అందించే సమయం ఆసన్నమైపోయింది.

నేపధ్యం

గత 5 నుండి 6 దశాబ్దాలుగా భారతదేశంలో పరోక్ష పన్నుల వ్యవస్థ అనేక రూపాంతరాలకు గురైంది. 1986 లో MODVAT పథకం, ఎక్సైజ్ మరియు సర్వీస్ టాక్స్ మధ్య క్రెడిట్ మార్పిడి (2004), వేట్ (2005 నుండి) ప్రవేశపెట్టబడటం లాంటివి పన్ను పరిపాలనా వ్యవస్థలో పారదర్శకత పెంచాయి, పన్ను చెల్లింపుదారుల ఇక్కట్లు తగ్గించాయి, మరియు వినియోగదారుకు ప్రయోజనం చేకూరుస్తూ కాస్కేడింగ్ ప్రభావాన్ని నిర్మూలించాయి. అయితే, భారతదేశం యొక్క సమాఖ్య నిర్మాణం, కేంద్ర, రాష్ట్ర రెండింటి ద్వారా పన్ను నిర్వహించబడటానికి దారితీసింది. ఈ రెండు సంస్థల వ్యాప్తంగా క్రెడిట్స్ ఉపయోగించుకునే సౌకర్యం లేకపోవడం అనేది ఇప్పటికీ పాక్షికంగా కాస్కేడింగ్ వ్యవస్థలో మిగిలి ఉండటానికి దారితీశాయి. దీనికి అదనంగా, బహుళ సంస్థల ప్రమేయం కారణంగా అనువర్తన భారం పెరిగింది. జిఎస్టి అనేది ఒకే పన్ను ద్వారా భారతదేశం అంతటా ఏకరూపకత నడుపుతూ మరియు పన్ను క్రెడిట్ యొక్క ఒక అనియంత్రిత ప్రవాహానికి భరోసా ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ఈ ఆందోళనలు పరిష్కరిస్తుంది. సందర్భానుసారంగా, జిఎస్టి అనేది వాట్ ను పోలి ఉంటుంది, అంటే సరఫరా గొలుసులో ప్రతి పాయింట్ వద్ద జోడించబడిన విలువపై మాత్రమే పన్ను వర్తించబడుతుంది.

విలక్షణ అంశాలు

జిఎస్టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) యొక్క విలక్షణ అంశాలు:

రిజిస్ట్రేషన్:

జిఎస్టి నమోదు ప్రవేశం (థ్రెష్హోల్డ్) భారతదేశం యొక్క ఈశాన్య భారతదేశం + సిక్కిం, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, కు రూ .10 లక్షలు మరియు మిగిలి భారతదేశానికి రూ. 20 లక్షలు ఉంటుంది. జిఎస్టి కింద సుమారుగా 7-8 మిలియన్ వ్యాపారాలు నమోదు చేయబడే అవకాశం ఉంది. రూ .50 లక్షల లోపు టర్నోవర్ గల చిన్న డీలర్లు కాంపొజిషన్ పథకం స్వీకరించి టర్నోవర్పై ఫ్లాట్ ~ 1 నుంచి 4% పన్ను చెల్లించే ఎంపిక కలిగి ఉంటారు.

ద్వంద్వ జిఎస్టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్):

భారతదేశం యొక్క సమాఖ్య నిర్మాణం పరిగణించి, ద్వంద్వ జిఎస్టి అనేది తగిన మోడల్ గా ఎంపిక చేసుకోబడింది. ఇందులో సరుకు సరఫరా మరియు సేవల పై పన్ను కేంద్రం మరియు రాష్ట్రాలు రెండింటి ద్వారా సంయుక్తంగా విధించబడుతుంది.s.

ద్వంద్వ జీఎస్టీ అంశాలు ఇవి:

 • సిజిఎస్టి: కేంద్ర జిఎస్టి
 • ఎస్జిఎస్టి: రాష్ట్ర జిఎస్టి
 • ఐజిఎస్టి: సమగ్ర జిఎస్టి

రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య లావాదేవీల్లో సిజిఎస్టి+Sజిఎస్టి వర్తిస్తుంది మరియు రాష్ట్రంలోపలి లావాదేవీల్లో ఐజిఎస్టి వర్తిస్తుంది.

జిఎస్టి రేట్లు:

క్రింది విధంగా 3 సెట్ల రేట్లు ఉండే సంభావ్యత ఉంది:

 • మెరిట్ రేటు
 • ప్రామాణిక రేటు
 • డి-మెరిట్ రేటు

విలువైన లోహాలకి తక్కువ ధర మరియు అత్యవసర సరుకుకి శూన్యం-రేటు ఉండే అవకాశం కూడా ఉంది.

విలీనం చేయబడిన పన్నులు:

జిఎస్టి కింద విలీనం చేయబడే పన్నులు ఇవి:

జిఎస్టి లో విలీనం చేయబడినవిజిఎస్టి లో విలీనం చేయబడనివి
కేంద్ర ఎక్సైజ్ప్రాధమిక కస్టమ్స్ సుంకం
సర్వీస్ పన్నుమానవ వినియోగం కోసం మద్యం
వాట్(VAT)/ అమ్మకపు పన్నుపెట్రోల్ / డీజిల్ / విమాన ఇంధనం / ప్రాకృతిక గ్యాస్ *
మనోరంజకం పన్నుస్టాంప్ డ్యూటీ మరియు ఆస్తి పన్ను
లగ్జరీ పన్నుటోల్ పన్ను
లాటరీ పై పన్నులువిద్యుత్తు డ్యూటీ
ఓక్ట్రాయి మరియ ప్రవేశ పన్ను
కొనుగోలు పన్ను

 

*తదుపరి ప్రకటించే తేదీనాడు చేర్చబడేటందుకు

ఐటిసి వినియోగం:

పన్ను బాధ్యతను ఎత్తివేయడం కోసం ఇన్పుట్ పన్ను క్రెడిట్ వినియోగించుకునే పద్ధతి క్రింద విధంగా నిర్వచించబడింది:

ఇన్పుట్ పన్ను క్రెడిట్దీని బాధ్యతకు వ్యతిరేకంగా ఎత్తివేయడం
సిజిఎస్టిసిజిఎస్టి మరియు ఐజిఎస్టి (ఆ క్రమంలో)
ఎస్జిఎస్టిఎస్జిఎస్టి మరియు ఐజిఎస్టి (ఆ క్రమంలో)
ఐజిఎస్టిఐజిఎస్టి, సిజిఎస్టి,ఎస్జిఎస్టి (ఆ క్రమంలో)

దయచేసి సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి ఒకదానికి వ్యతిరేకంగా మరొకదానిని ఎత్తివేయడం వీలుకాదని గమనించండి.

పన్ను బాధ్యతకు వ్యతిరేకంగా ఇన్పుట్ పన్ను క్రెడిట్ ఎత్తివేయడం ఎలాగ

ఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్:

గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ నెట్వర్క్ లేదా జిఎస్టిఎన్ అనేది జీఎస్టీ అన్ని ఇ-ఫైలింగ్ అవసరాలను నెరవేర్చేందుకు ఐటి ప్రధాన వెన్నెముక (బ్యాకెండ్ మరియు ఫ్రంటెండ్) మరియు పోర్టల్ ముందుకు తీసుకురావడానికి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (ప్రైవేట్ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాదారుల) క్రింద విలీనం చేయబడిన ఒక లాభం కోసం కాని సెక్షన్ 25 / సెక్షన్ 8 కంపెనీ. అన్ని ప్రక్రియలు, ఫారంలు, మరియు దేశములో జరిగే మొత్తం వాణిజ్యం డేటా కూడా నియంత్రించడానికి ఇది ఒక నోడల్ (కేంద్ర) ఏజెన్సీ అయి ఉంటుంది.

జిఎస్టి కౌన్సిల్:

అధ్యక్షుని ఆమోదం పొందిన 60 రోజుల్లో కౌన్సిల్ (మండలి) ఏర్పాటు చేయబడుతుంది, అందులో రాష్ట్రాలకు 2/3 వ ప్రాతినిధ్యం మరియు కేంద్రానికి 1/3 వ ప్రాతినిధ్యం ఉంటుంది. జిఎస్టి కౌన్సిల్ పన్ను రేట్లు, వివాద పరిష్కారం, మినహాయింపుల ఇంకా అటువంటి వాటికి సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. జిఎస్టి కౌన్సిల్ (75% ఓట్లు) చేసిన సిఫార్సులు కేంద్రం, రాష్ట్రాలు బధ్డులై ఉండవలసినవిగా ఉంటాయి.

వ్యాపార ప్రక్రియ

రిజిస్ట్రేషన్:

ఇప్పటికే ఉన్న డీలర్స్ ఆటోమేటిగ్గా బదిలీ చేయబడతారు మరియు క్రింది నిర్మాణంతో ఒక 15 అంకెల పాన్ ఆధారిత జిఎస్టిఐఎన్ ఇవ్వబడుతుంది.

రాజ్యం కోడ్పాన్ (PAN)ఎంటిటి కోడ్బ్లాంక్చెక్ అంకె
123456789101112131415

ఎంటిటి కోడ్ అనేది రాష్ట్రంలో ఒకదాని పక్కన ఒకటిగా బహుళ వ్యాపార అంశాలు కలిగి ఉన్న పన్నుచెల్లించేవారికి వర్తిస్తుంది.

రిటర్న్స్:

జిఎస్టి (గూడ్స్ & సర్వీస్ టాక్స్) వ్యవస్థ ఈ క్రింది మార్పులను ప్రవేశపెట్టింది:

 • అన్ని వ్యాపారాలు తప్పనిసరిగా అవసరమైన త్రైమాసిక లేదా వార్షిక రిటర్నులతో పాటు నెలవారీ రిటర్నులు దాఖలు చేయడం జిఎస్టి వ్యవస్థకు అవసరం. ఇప్పుడు త్రైమాసిక లేదా అర్ధ సంవత్సరం (సేవా పన్ను కోసం రిటర్న్ మొదలైనవి) రిటర్నులు ఫైలు చేసే వ్యాపారాలు కూడా ఇప్పుడు ప్రతి నెల రిటర్నులు ఫైలు చేయాలి.
 • నేడు ఉన్న 1 ఈవెంట్ తో పోలిస్తే ‘ప్రతి నెల 3 అనువర్తనం (కంప్లయెన్స్) ఈవెంట్లు’ ఉంటాయి. అంటే ఈ నాడు ఉన్న 1 రిటర్న్ ఫైల్ చేయడానికి ప్రతిగా ఇప్పుడు వ్యాపారాలు ఫారం జిఎస్టి ఆర్ -1, ఫారం జిఎస్టిఆర్-2 మరియు ఫారం జిఎస్టిఆర్ -3 (క్రింద పేర్కొన్న విధంగా) ఫైల్ చేయవలసి ఉంటుంది.
 • తొలి అనువర్తనం ఈవెంట్ (ఫారం జిఎస్టిఆర్ -1 ఫైల్ చేయడం) ప్రస్తుత వేట్ వ్యవస్థలో ఉన్న 20 వ తారీకు గడువుకు వ్యతిరేకంగా తరువాతి నెల 10 గడువుతేదీగా కలిగి ఉంటుంది.
 • కాంపొజిషన్ పథకం ఇంకెంతమాత్రమూ ఇష్టపడే ఎంపికగా ఉండదు ఎందుకంటే, రిటర్నులు త్రైమాసికానికి ఫైల్ చేయాలి మరియు, ఇంతకు పూర్వంలాగే అమ్మకాలు ఏకమొత్తంలో వున్నప్పటికి, అమ్మకాలకి సంబంధించి ఆ రిటర్నుల్లోని వివరాలు ఫైల్ చేయాలి. పథకంలో మరో పెద్ద ప్రతిబంధకం ఏమిటంటే కాంపొజిట్ డీలర్లకు అమ్మకం ధరను పెంచే ఛెయిన్ కి ఇన్పుట్ క్రెడిట్ లభ్యత కాకపోవడం. అంటే వ్యాపారాలు ఈ డీలర్ల నుండి వారి కొనుగోళ్లు తగ్గిస్తారు అని అర్ధం.

రెగ్యులర్ డీలర్: నెలసరి ఫైలింగ్

 • ఫారం జిఎస్టిఆర్-1: అన్ని అమ్మకాల ఇన్వాయిస్లను అప్లోడ్ చేయండి (10 నాటికి)
 • ఫారం జిఎస్టిఆర్-2ఎ: సరఫరాదారు ద్వారా అందజేయబడిన (11 నాడు) ఫారం జిఎస్టిఆర్ -1 ఆధారంగా గ్రహీతకు వాటంతట అవే నింపబడిన లోపలికి సరఫరా విరాలు అందించబడతాయి
 • ఫారం జిఎస్టిఆర్-2: ఫారం జిఎస్టిఆర్-2ఎ లో చేర్పులు (క్లెయిములు) లేదా మార్పులు ఫారం జిఎస్టిఆర్-2 లో(15 న) సమర్పించబడాలి
 • ఫారం జిఎస్టిఆర్-1ఎ: ఫారం జిఎస్టిఆర్-2 గ్రహీత ద్వారా చేర్చబడిన, దిద్దబడిన లేదా తొలగించబడిన బయటివైపు సరఫరాల వివరాలు సరఫరాదారుకు అందుబాటులో ఉంచబడతాయి ( 20 న)
 • ఫారం జిఎస్టిఆర్-3: దానంతట అదే నింపబడిన జిఎస్టిఆర్-3 20 నాటికి సమర్పించండి
 • ఫారం జిఎస్టిఆర్-9: వార్షిక రిటర్న్ –వినియోగించుకున్న ఐటిసి వివరాలు మరియు చెల్లించిన జిఎస్టి ఇందులో స్థానిక అంతర్రాష్ట్ర మరియు దిగుమతి / ఎగుమతులు ఉంటాయి. (తరువాతి ఆర్థిక సంవత్సరం 31 డిసెం) సమకూర్చండి

కాంపొజిషన్ డీలర్: త్రైమాసిక ఫేలింగ్

 • ఫారం జిఎస్టిఆర్-4 ఎ: సరఫరాదారు ద్వారా సమర్పించబడిన (త్రైమాసిక) ఫారం జిఎస్టిఆర్-1 ఆధారంగా కాంపొజిషన్ పథకం కింద రిజిస్టర్ చేసుకోబడిన గ్రహీతకు అందుబాటులో ఉంచబడిన లోపలికి సరఫరాల వివరాలు.
 • ఫారం జిఎస్టిఆర్-4: సరుకు మరియు సేవల అన్ని బాహ్య సరఫరా( Out ward Supplies) సమర్పించండి. ఇందులో దానంతట అదే నింపబడిన ఫారం జిఎస్టిఆర్-4ఎ, చెల్లించదగిన పన్ను మరియు పన్ను చెల్లింపు ఉంటాయి. (త్రైమాసికం ముగిసిన తర్వాత 18 నాటికి)
 • ఫారం జిఎస్టిఆర్-9 ఎ: పన్ను చెల్లింపు వివరాలు (తరువాతి ఆర్థిక సంవత్సరం 31 డిసెం) తో పాటు ఫైల్ చేసిన త్రైమాసిక రాబడి కన్సాలిడేటెడ్ వివరాలు సమకూర్చండి.

చెల్లింపులు:

 • తప్పని ఇ-చెల్లింపు ఈ మొత్తానికి > Rs 10,000
 • అన్లైన్: NEFT/RTGS/IMPS
 • ఆఫ్లైన్: నగదు/ చెక్కు/ డిడి/NEFT / RTGS మొదలైనవి
 • చలాన్ దానంతట అదే నింపబడి ఉంటుంది, మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

రిఫండ్స్ (తిరిగి చెల్లింపులు):

ఎక్కడెక్కడ వర్తిస్తుందో అక్కడ రిఫండ్ ప్రక్రియ దానంతట అదే ప్రారంభించబడుతుంది, పరీక్షించబడటం లేకుండా అప్లై చేయబడినప్పుడు 90% రిఫండ్ తాత్కాలికంగా మంజూరు చేయబడుతుంది.

ముఖ్యంగా ప్రభావితమయ్యే క్షేత్రాలు

వ్యాపారాలకి ప్రధానంగా ప్రభావితమయ్యే క్షేత్రాలు:

 • సాంకేతిక స్వీకరణ తప్పనిసరి: అన్ని ప్రక్రియలు ఆన్లైన్ ఉంటాయి కాబట్టి, మరియు రిటర్న్ ఫైల్ చేయడం అనేది సూక్ష్మ రేణువు (గ్రాన్యులార్) స్వభావం (ఇన్వాయిస్ వారీగా) కలిగి ఉండటంతో, సమర్థత మరియు ప్రభావవంతాన్ని నిర్ధారించేందుకు పన్నుచెల్లింపుదారులు తగిన సాంకేతికత అవలంబించవలసి ఉంటుంది. గతంలో మాదిరిగా కాగితం ఫైలింగ్ అనేది ఒక ఎంపికగా వుండదు.
 • భారతదేశ వ్యాప్త మార్కెట్ కు ప్రాప్యత: రాష్ట్రానికి రాష్ట్రానికి మద్య మరియు రాష్ట్రంలోపల వర్తకాలు పన్ను తటస్థత కలిగినవిగా అవుతాయి, మరియు అనువర్తించవలసిన పేచీలు లేకుండా సోర్సింగ్ విక్రేతలు మరియు వినియోగదారులు ఇద్దరి కోసం భారతదేశం మొత్తం ఒక మార్కెట్ గా తెరవబడుతుంది.
 • నగదు ప్రవాహం ప్రణాళిక: కొనుగోలుపై ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ అనేది రిటర్న్ ఫైలింగ్ సమయంలో మాత్రమే తాత్కాలికంగా అందజేయబడతాయి, మరియు సంబంధిత అమ్మకం అప్లోడ్ చేయబడిన తర్వాత మరియు సరఫరాదారు ద్వారా బాధ్యత నిర్వర్తించబడిన తర్వాతే నిర్ధారించబడుతుంది. అందువల్ల, అసమతుల్యత విషయంలో నగదు ప్రవాహాలు ప్రభావితమవుతాయి. ఏదైనా సరఫరా పన్నువేయదగినది అయినందున, శాఖ బదిలీలు పన్ను బాధ్యతకు దారితీస్తాయి, ఇవి నగదు ప్రతిష్టంభనకు దారితీస్తాయి. ముందుగా అందుకున్న అడ్వాన్సుల పై కూడా జిఎస్టి వర్తిస్తుంది మరియు సరుకుకు కూడా రివర్స్ ఛార్జ్ వర్తిస్తుంది. ప్రభావవంతంగా ఎలా వ్యాపారం చేయాలి మరియు ఒప్పందాలు నిర్మాణం చేసుకునేందుకు వ్యాపారాలు పునరాలోచన చేయడం అవసరం.
 • సులభంగా అనువర్తనం: వ్యాపారాలు సూక్ష్మ రేణువు (గ్రాన్యులార్) స్వభావం (ఇన్వాయిస్ వారీగా) డేటా ఇవ్వడం జిఎస్టి కు అవసరం, ఇది హెచ్ఎస్ఎన్ కోడ్లతో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. శుభవార్త ఏమిటంటే, ఇంతకు ముందు ప్రబలంగా ఉన్న అనేక పరోక్ష పన్నులను భర్తీ చేస్తూ మరియు సాంకేతిక మద్దతుతో జిఎస్టి పాటించడం సులభం. జిఎస్టితో, వారి రిటర్నులు అప్లోడ్ చేయని విక్రేతల ఇన్పుట్ క్రెడిట్ కత్తిరించడం ద్వారా ప్రభుత్వం వారిని అనుసరించే భారాన్ని తొలగించుకుంది.
 • బ్రాంచ్ /సరఫరా గొలుసు తిరిగి-ఇంజనీరింగ్: పన్ను పరిగణనలు కారణంగా బహుళ రాష్ట్ర ఉనికిని కలిగిన వ్యాపారాలు (తగ్గింపు సిఎస్టి రేటును పొందగోరేవారు) వారి గిడ్డంగి మరియు శాఖ నెట్వర్క్లు తిరిగి ప్రణాళిక చేసుకుని వాటిని రాష్ట్రాల వారీగా కాకుండా మార్కెట్లకు దగ్గరగా ఉంచుకోవాలి.
 • ధర వ్యూహం: కాస్కేడింగ్ ప్రభావం తొలగించడం వలన, ఉత్పత్తుల ధరలు కిందికి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల, వ్యాపారాలు సేకరణ మరియు అమ్మకం కోసం కొత్త వాస్తవాలకు పునః-సర్దుబాటు చేసుకోవడం అవసరం
 • ఒప్పందాల పై మళ్ళీ చర్చలు: పని ఒప్పందాలు మరియు ఇతర బహుళ సంవత్సరం సరఫరా ఒప్పందాలు జిఎస్టి రేట్లు శోషించేందుకు గాను తిరిగి సంప్రదింపుల నిర్వహించుకోవాలి. పన్ను అడ్వాన్స్ పై చెల్లించబడుతుంది కాబట్టి, అటువంటి పరిస్థితుల్లో ఒకసారి పునర్విమర్శ చేసుకోవడం అవసరం.

దీని తర్వాత ఏమిటి?

రాజ్యసభలో 122 రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ అవడంతో, వెంటనే తదుపరి చర్యలు ఇవి:

 • ఇది ఒక రాజ్యాంగ సవరణ అయి ఉన్నందున, కనీసం 15 రాష్ట్ర అసెంబ్లీల్లో బిల్లు ఆమోదించబడటం అవసరం.
 • అధ్యక్షుడు నుంచి బిల్లుకు ఆమోదం మరియు ఆమోదం పొందిన తేదీ నుంచి తదుపరి 60 రోజుల్లోపల జిఎస్టి మండలి ఏర్పాటు, అవసరం
 • పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సిజిఎస్టి మరియు ఐజిఎస్టి బిల్లులు (బహుశా మనీ బిల్లుగా) మరియు 29 అసెంబ్లీల్లో ఎస్జిఎస్టి బిల్లు పాస్ అవడం
 • జనవరి 2017 నాటికి జిఎస్టి నెట్వర్క్ అంచెలంచెలుగా ప్రారంభం.

పనులు పెద్దవిగా కనిపించినప్పటికీ సాధించదగినవి.

మనందరికీ ఇకపై ఏమిటి

జిఎస్టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) ప్రారంభించడానికి 1 ఏప్రిల్ 2017 సంభావ్య తేదీగా ఉండడంతో, ఈ దిశలో పన్నుచెల్లింపుదారుల అనేక సన్నాహక చర్యలు తీసుకోవడం అవసరం. ప్రారంభించేందుకు ఒక స్వచ్ఛమైన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండటం కోసం పరివర్తనం కీలకంగా ఉంటుంది.

 1. ప్రస్తుత వ్యవస్థ (సెన్ వ్యాట్, వ్యాట్) నుంచి ఇన్పుట్ పన్ను క్రెడిట్ (రిటర్నులు/ఇన్పుట్లు/క్యాపిటల్ గూడ్స్ లో) జిఎస్టి (సిజిఎస్టి, ఎస్జిఎస్టి) కి కారీ ఫార్వర్డ్ చేయబడుతుంది. అందుకే, పుస్తకాలు అప్డేట్ చేసి ఉంచుకోవడం తప్పనిసరి. ఇది కంపెనీలకు అంచనా సమయంలో సహాయపడుతుంది, ఎందుకంటే కేవలం ఆ సమయంలోనే సంఖ్య పిక్ అప్ చేసుకోబడుతుంది మరియు ట్రెయిల్ (మార్గం)/స్పష్టత గనక అందుబాటులో లేకపోతే, వ్యాపారాలు ఎంతో ఆర్థిక, ఆర్థికేతర కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి.
 2. జిఎస్టి కి పరివర్తన నునుపుగా సాగిపోయేందుకు వీలుగా ఇఆర్పి లో ఉన్న అకౌంటింగ్ మరియు పార్టీ మాస్టర్లు అన్నీ నింపబడిన చట్టబద్ధమైన అధికారిక వివరాలతో అప్డేట్ చేయబడి ఉండాలి

ఎప్పటిలాగేనే, చట్టబద్ధమైన అధికారిక మార్పులు అర్ధం చేసుకునేందుకు మరియు అన్వయించుకునేందుకు టాలీ వ్యాపారాలకు మద్దతు అందించడంలో మార్గదర్శకంగా ఉంటూ వస్తోంది. టాలీ ఇఆర్పి 9 లో గొప్పగా సరళీకృతం చేయబడిన పరిష్కారం శీఘ్రంగా పరివర్తన చెందడం మరియు జిఎస్టి యొక్క చట్టపరమైన అధికారిక అవసరాలను సులభంగా వ్యవహరించగలగడాన్ని నిర్థారిస్తుంది.

బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ నోట్ తయారుచేయబడింది, అయితే వాస్తవ జిఎస్టి రేట్లు మరియు వ్యాపార ప్రక్రియలు అది ప్రారంభించబడే సమయానికి చెప్పుకోదగిన మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

325,568 total views, 11 views today

Santosh HR

Author: Santosh HR

Product leader and GST expert with keen focus on the ever changing indirect taxation landscape of India.